
సాక్షి, మేడ్చల్ : నూతన భూ క్రమబద్దీకరణ పథకంపై ప్రభుత్వం పునారాలోచించాలని రియల్టర్లు నిరసన వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ జీవో 131ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రియల్టర్లు హయత్ నగర్, నారపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు దర్నా నిర్వహించారు. అనంతరం ఉప్పల్ డిపో నుండి మేడిపల్లి మీదుగా నారపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. (వీఆర్వో వ్యవస్థ రద్దు)
ప్రభుత్వం అట్టహాసంగా తెచ్చిన 131 జీవోను ఉపసంహరించుకోవాలని నిరసనలు చేశారు. కొత్త జీవో ద్వారా ఎల్ఆర్ఎస్ చార్జీలు పెంచడం అంటే సామాన్యప్రజలను దోచుకోవడమేనని ధ్వజమెత్తారు. కరోనా కాలంలో మరింత ఇబ్బందులకు గురిచేయవద్దని విఙ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను కూడా యధావిధిగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. 2వందల గజాల లోపు ఉన్న ప్లాట్లను ఒక రూపాయికి ఎల్ఆర్ఎస్ ఇవ్వాలి విఙ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఆమోదం పొందిన లేఅవుట్లలోని ప్లాట్లు అక్రమమని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేయాలి, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. (రెవెన్యూ చట్టంపై తొందరపాటు వద్దు )
Comments
Please login to add a commentAdd a comment