
ఉపేంద్ర
‘‘ఇప్పటివరకూ ఎన్నో గ్యాంగ్‌స్టర్ కథలు విన్నారు.. చూశారు. కానీ మా సినిమా అందుకు భిన్నంగా ఉంటుంది. అండర్ వరల్డ్‌లోనే కొత్త కోణాన్ని చూపించబోతున్నాం’’ అంటోంది ‘కబ్జా’ చిత్రబృందం. ఉపేంద్ర ముఖ్య పాత్రలో ఆర్. చంద్రు తెరకెక్కిస్తున్న చిత్రం ‘కబ్జా’. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర డాన్‌గా కనిపించబోతున్నారు. 1970ల కాలంలో ఈ సినిమా కథ ఉంటుందట. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదల చేశారు. లగడపాటి శ్రీధర్ సమర్పిస్తున్న ఈ చిత్రం 7 భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠి భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment