
కాజల్ అగర్వాల్
పదేళ్లుగా తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలను కబ్జా చేసి పడేశారు కాజల్ అగర్వాల్. హీరోయిన్‌గా పదేళ్లు పూర్తి చేసినా వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు కాజల్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు కాజల్. కానీ ఇంతవరకూ కన్నడ సినిమా చేయలేదు. ఉపేంద్ర చేయబోతున్న ‘కబ్జా’ చిత్రంతో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారట కాజల్. ఆర్.చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా తెరకెక్కనున్న గ్యాంగ్‌స్టర్ చిత్రం ‘కబ్జా’. ఇందులో ఉపేంద్ర సరసన హీరోయిన్‌గా కాజల్ కనిపిస్తారట. ఈ సినిమాలో విలన్‌గా జగపతిబాబు నటించనున్నారు. ఈ సినిమా ఏడు భాషల్లో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment