
‘‘చంద్రు ఇదివరకే అద్భుతమైన చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్. ఉపేంద్ర హీరోగా ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కబ్జా’. పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా ఈ నెల 17న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలోని ‘పల్లి.. పల్లి.. బెల్లంపల్లి..’ అంటూ సాగే మూడో పాటను కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ విడుదల చేశారు. ఉపేంద్ర, తాన్యా హోప్‌పై ఈ మాస్ సాంగ్‌ని చిత్రీకరించారు. రవి బస్రూర్ స్వరపరచిన ఈ పాటను తెలుగులో చంద్రబోస్ రాయగా హరిణి ఇవటూరి, సంతోష్ వెంకీ పాడారు.
దర్శక–నిర్మాత ఆర్. చంద్రు హోమ్ టౌన్ షిడ్ల గట్ట (కర్నాటక)లో జరిగిన ఈ పాట విడుదల వేడుకలో కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్, మాజీ మంత్రి హెచ్.ఎం. రెవన్న, కోప్రొడ్యూసర్ అలంకార్ పాండియన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment