నాలుక మడతేసిన టీడీపీ, ఎల్లో మీడియా
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద పిల్లిమొగ్గలు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం... దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లిమొగ్గలు వేస్తోంది... ఎలాగైనా ప్రజలను మెప్పించాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు కాకుంటే ఇప్పుడు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్లే జస్ట్.. కొద్దిరోజుల క్రితం అబ్బో ఆ చట్టం... రైతులకు చుట్టం... అసలు అలాంటి చట్టం ఉంటే భూ యజమానులు నిశ్చింతగా ఉండొచ్చు.. మీ భూములు.. స్థలాలు కాపాడుకునేందుకు యాతనపడక్కర్లేదు అంటూ అప్పుడు చెప్పినవాళ్ళే ఇప్పుడు ఆమ్మో అది చట్టం కాదు... భూతం అంటూ కొత్త రాగాలు అందుకుంటున్నారు. చంద్రబాబుకు పనికొస్తుంది అంటే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేద్దాం అనే స్థాయికి దిగజారిపోయారు. చంద్రబాబు కోసం ఐతే రామాయణం..ఇతిహాసాలు... బైబిల్ ఖురాన్ సైతం చదవొద్దు అని చెప్పడానికి వాళ్ళు ఏమాత్రం వెనుకాడరు.
👉ల్యాండ్ టైట్లింగ్ చట్టం సూపర్...అలాంటి చట్టం దేశంలో గతంలో రానేలేదు... అలాంటి చట్టాలు ఉంటే ప్రజలకు నిశ్చింత..భూములకు భద్రతా అంటూ టీడీపీ ఎమ్మెల్యే పబ్లిక్ ఎకవుంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా ఆనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ చట్టం మంచిదని, పలు దేశాల్లో ఇలాంటి చట్టం ఉండడంవల్లనే అక్కడ భూతగాదాలు లేవని వివరించారు... ఇలాంటి చట్టం ఆంధ్రాలో కూడా రావాలని డిమాండ్ చేసారు.. దీంతో అయన వాగ్ధాటి,,విషయపరిజ్ఞానం చూసి టీడీపీ సభ్యులు బల్లలు చరిచారు.
👉ఈనాడు వారి ఈటీవీలో సైతం ఆమధ్య ఈ చట్టం గొప్పది అంటూ కథనాలు ఇచ్చారు... ఇప్పుడు ఆ చట్టం పేరిట ప్రజలను భయపెట్టడంలో రామోజీ ముందున్నారు...ఈనాడు పేజీలన్నీ ఆ చట్టాన్ని భూతంలా చూపిస్తూ నింపేయగా...ఈటీవీలో గంటలకొద్దీ చర్చలు పెడుతున్నారు... ఆంటే చంద్రబాబుకు ఉపయుక్తం ఆంటే తన వైఖరి ఎలాగైనా మార్చుకునేందుకు రామోజీరావుకు ఎలాంటి సిగ్గు ఉండదు...
👉ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రసంగించారు... ఇప్పుడేమో ఆమె తన బంధువు చంద్రబాబు కోసం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు... ఆంటే ఈ చట్టం గొప్పతనం..ప్రజలకు కలిగే మేలు గురించి ఈ ముగ్గురికీ తెలుసు కానీ...ఇప్పుడు చంద్రబాబుకు లబ్ది చేకూర్చడానికి ఆ ముగ్గురూ నాలుక మడతేశారు... జస్ట్ వారంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు కుర్చీలు మడతేసి కొడితే ఆ ముగ్గురితో బాటు చంద్రబాబుకు సైతం జేజెమ్మ గుర్తొస్తుంది ..
:::సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment