సాక్షి, విజయవాడ: టీడీపీపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.. విచారణకు సీఐడీని ఆదేశించింది. తక్షణమే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
మా ఫిర్యాదుపై ఈసీ స్పందించింది: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
మార్కాపురం, ఒంగోలు సభల్లో సీఎం జగన్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబుకు జగన్‌పై అసూయ తారా స్థాయికి చేరిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై బాబు అండ్ కో విషం చిమ్ముతోంది. ఐటీడీపీ సైట్‌లో విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ విలువలు, విశ్వసనీయత కోల్పోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. చర్యలకు సీఐడీకి సిఫారసు చేసింది. చంద్రబాబు, పవన్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’’ అని విష్ణు కోరారు.
ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బాబు, పవన్ దుష్ప్రచారం: మనోహర్ రెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న విషప్రచారంపై ఈసీకి ఫిర్యాదు చేశామని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారు. భూ వివాదాల పరిష్కారం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మోదీ సభలో మాట్లాడే ధైర్యం బాబు, పవన్‌లకు ఉందా?. అబద్దాల ప్రచారానికి టీడీపీకి ఓ యూనివర్సిటీ నే ఉంది’’ అని మనోహర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా, అమల్లో లేని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశం పార్టీ ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లను తప్పుదారి పట్టిస్తోంది. ఇది ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధం. టీడీపీపై తగిన చర్యలు తీసుకోండి’ అని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదుతో పాటు తగిన ఆధారాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment