మీ భూమి మీదే.. | More than 40000 land disputes were resolved in re survey | Sakshi
Sakshi News home page

మీ భూమి మీదే..

Published Sat, May 11 2024 6:16 AM | Last Updated on Sat, May 11 2024 6:16 AM

More than 40000 land disputes were resolved in re survey

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం అమల్లోనే లేదు

ఈ చట్టం గురించి చంద్రబాబు హీనాతిహీనంగా దుష్ప్రచారాలు చేస్తున్నాడు 

రాజకీయ లబ్ధికోసం భూముల పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు

అసత్య ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు

ప్రజలు కన్నతల్లిలా భావించే భూమిపై కుట్రలు చేస్తున్నాడు

ఈ చట్టానికి, భూ సంబంధిత ఫిర్యాదులకు సంబంధం ఏమిటి?

చట్టమే అమలుకానప్పుడు భూ సంబంధిత ఫిర్యాదులెలా వస్తాయి?

భూ ఆక్రమణల ఫిర్యాదులు లేనేలేవు

రీ సర్వేలో 40 వేలకు పైగా భూ వివాదాలు పరిష్కారమయ్యాయి

బాబు సృష్టించిన తప్పుడు ప్రచారాలు..    
» మీ ఆస్తులకు జిరాక్సు కాపీలు ఇస్తారు. ఒరిజినల్‌ పత్రాలు ఇవ్వరు.. – ఇది పచ్చి అబద్ధం
»  మీ ఆస్తులకు గ్యారంటీ ఉండదు. మీ భూములు లాక్కుంటారు.. – ప్రజల ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది..
» మీ ఇళ్ల స్థలాలు ఎత్తుకెళ్తారు. మీ యాజమాన్య హక్కులు నిరూపించుకోవాలి..  – స్థలాలను ఎత్తుకెళ్తారనేది అపోహే
»  కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు.. – నిరభ్యంతరంగా కోర్టుకు వెళ్లొచ్చు.
»   మీ వారసులకు భూములు దక్కవు.. – మీ వారసులకే భూములు దక్కుతాయి
» ఇది కేంద్ర చట్టం కాదు. రాష్ట్రమే తెచ్చింది.. – కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఈ చట్టం గురించి సిఫారసు చేసింది
» మీ పాసు పుస్తకాలు మీ దగ్గర ఉండవు.. – మీ పాస్‌ పుస్తకాలు మీ దగ్గరే ఉంటాయి 

ప్రజలారా చంద్రబాబు మాటలు విని మోసపోవద్దు
»  భూముల్ని మింగిన చంద్రబాబు మీ భూముల్ని కాపాడతాడా?
»  అమరావతిలో రూ.వేల కోట్ల విలువైన భూముల్ని దోచేసిన వాడు భూముల రక్షకుడా?
»  విశాఖలో లక్ష ఎకరాల భూముల రికార్డుల్ని మాయంచేసిన మాయావి మీ భూములకు భద్రత కల్పిస్తాడా?
»   వైఎస్‌ జగన్‌ హయాంలో ఒక్క భూకుంభకోణం జరగలేదు
»  చంద్రబాబు హయాంలో అమరావతి భూముల కుంభకోణం, విశాఖ లక్ష ఎకరాల కుంభకోణం, సదావర్తి భూముల 
కుంభకోణం వంటివి ఎన్నో జరిగాయి.
»  జగన్‌ హయాంలోనే భూములకు రక్షణ.
» చుక్కల భూములకూ విముక్తి కల్పించింది జగ¯ó...
»   షరతుల గల పట్టా భూములకూ విముక్తి కల్పించింది జగన్‌
»    అసైన్డ్‌ భూములకూ హక్కులు ఇచ్చినవాడు జగన్‌
» చంద్రబాబు భూములు లాక్కుంటే.. జగన్‌ భూములు ఇచ్చాడు.
ఇక దుర్మార్గాలేంటి?ళీ    మీ దస్తావేజులు మీకే ఇస్తారు. ప్రస్తుతం కూడా ఇస్తున్నారు. గత 3 నెలల్లో 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వారందరికీ ఒరిజినల్‌ డాక్యుమెంట్లు ఇచ్చారు. 
»   చంద్రబాబు బావమరిది, వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణ ఇటీవల రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తీసుకున్నాడు. 
»    అలాగే, పవన్‌కళ్యాణ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఒరిజినల్స్‌ తీసుకున్నాడు. కానీ, ప్రజలను మాత్రం జిరాక్సు కాపీలని భయపెడుతున్నాడు.
»    అధికారం, డబ్బు, కండబలంతో మీ భూముల్నిఎవరూ కొట్టేయలేరు. అది అసాధ్యం
»    మీ వారసుల్ని నిర్ణయించేది మీరే. అందులోఅధికారుల ప్రమేయం ఉండనే ఉండదు
»   జగన్‌ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చనేది చంద్రబాబు చేసే తప్పుడు ప్రచారం
»    ప్రస్తుతం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టమేలేదు. అలాంటప్పుడు ల్యాండ్‌ టైట్లింగ్‌ ఆఫీసర్‌ని ఎలా నియమిస్తారు?
»    ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగాకోర్టుకు వెళ్లొచ్చు. 

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం వాస్తవాలు..
»  ప్రజల ఆస్తులను కాపాడ్డానికే ‘ల్యాండ్‌ టైట్లింగ్‌’ 
»  దీన్ని ఇంకా అమలు చేయడంలేదు. అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన మాత్రమే ఇచ్చింది. అమలుకు 
నోటిఫికేషన్‌ ఇంకా ఇవ్వలేదు
»  నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఏ చట్టం అమలుచేయలేరు
»  రాష్ట్రమంతటా ఈ చట్టం ఒకేసారి అమల్లోకి రాదు. భూముల సర్వే తర్వాత అభ్యంతరాలన్నీ పరిష్కరమయ్యాక,
గ్రామాల వారీగా భూముల తుది రిజిస్టర్‌ రూపొందించిన చోట్ల కాలానుగుణంగా చట్టం అమల్లోకి వస్తుంది.
» నోటిఫికేషన్‌ ఇవ్వాలంటే రీసర్వే పూర్తవ్వాలి. ఆరు వేల గ్రామాల్లోనే సర్వే పూర్తయింది. ఇంకా 11 వేల గ్రామాల్లో పూర్తవ్వాలి. అప్పుడే చట్టం అమలుచేసే అవకాశం ఉంటుంది. 
» ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి, రిజిస్ట్రేషన్లకు సంబంధంలేదు. భూపత్రాలు యాజమానుల వద్దే ఉంటాయి. జిరాక్సు కాపీలు ఇస్తారనేది దుర్మార్గపు ప్రచారం
»  ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం అమలైనా కోర్టుకు నిస్సంకోచంగా వెళ్లవచ్చు. 
»  వారసత్వ ఆస్తులను మ్యుటేషన్‌ తరహాలోనే చేసుకోవచ్చు. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ దాన్ని నిర్ణయించలేడు. 
»  ఈ చట్టం 90 దేశాల్లో అమల్లో ఉంది. మహారాష్ట్ర కూడా ల్యాండ్‌ టైట్లింగ్‌ మోడల్‌ చట్టం చేసింది.
» 2019లో నీతి అయోగ్‌ అన్ని రాష్ట్రాలు ఈ చట్టం చేసుకోవాలని చెప్పింది
» ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ మద్దతు తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement