మీ భూమికి భద్రత.. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్‌ | CM YS Jagan Fires On Chandrababu About Land Titling Act | Sakshi
Sakshi News home page

మీ భూమికి భద్రత.. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్‌

Published Sun, May 5 2024 4:27 AM | Last Updated on Sun, May 5 2024 11:23 AM

మధ్యాహ్నం 12 గంటలకు.. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించిన సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభకు మండుటెండను సైతం లెక్కచేయకుండా హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం

మధ్యాహ్నం 12 గంటలకు.. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించిన సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభకు మండుటెండను సైతం లెక్కచేయకుండా హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం

హిందూపురం ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్‌ హామీ  

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై చంద్రబాబు దుష్ప్రచారం 

చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటు 

మీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ.. 

రిజిస్ట్రేషన్‌ తర్వాత రైతులకే డాక్యుమెంట్లు 

అన్నదాతలు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదు 

భూ తగాదాలకు శాశ్వత పరిష్కారంగా వందేళ్ల తర్వాత రీసర్వే 

పేదలకు భూములిచ్చేది జగన్‌.. లాక్కునేది చంద్రబాబే

సాక్షి, పుట్టపర్తి: ‘చంద్రబాబునాయుడు అవగాహన రాహిత్యంతో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై అబద్ధాలు వల్లించడం సిగ్గుచేటు. జగన్‌ భూములు లాక్కుంటున్నాడంటూ దుష్ప్రచారం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. పేదలకు భూములిచ్చేది జగన్‌ అయితే.. లాక్కునేది చంద్రబాబు అనే విషయం అందరికీ తెలుసు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌తో రైతులు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వందేళ్ల తర్వాత భూముల రీ సర్వే చేపట్టాం. రైతుల భూముల భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. 

ఎలాంటి వివాదం లేని టైటిల్స్‌ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. అందుకనే టైటిల్‌ ఇన్సూరెన్స్‌ కూడా చేస్తున్నాం. రిజిస్ట్రేషన్‌ తర్వాత రైతులకే డాక్యుమెంట్లు అందజేస్తాం. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడటం దుర్మార్గం’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శ్రీసత్య­సాయి జిల్లా హిందూపురంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌­లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ప్రచారంలో ఉన్న అపోహలను తొలగిస్తూ స్పష్టతనిచ్చారు.

రిజిస్ట్రేషన్లపైనా చంద్రబాబు బురద
రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఫిజికల్‌ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయ్యా చంద్రబాబూ..! ఇప్పటివరకు ఏకంగా 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దేశ­వ్యాప్తంగా అమల­వుతున్న కార్డ్‌ 2 సాఫ్ట్‌వేర్‌ ద్వారా తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా ఆ తర్వాత డాక్యుమెంట్లు అన్నీ భూ యజ­మా­నులకే ఇచ్చాం. 
 


దీన్ని మరింత సులభతరం చేస్తూ.. ఏ ఒక్కరికీ సమస్య ఉండకూడదని, పత్రాలు రాసుకునే­టప్పుడు తప్పులు ఉండకూడదని ఆ ఫార్మాట్‌ కూడా ఆన్‌లైన్‌లో అందు­బా­టులో ఉంచాం. ఎవరైనా అమ్మాలను­కున్నా, కొనాలనుకున్నా ఆ ఫార్మాట్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలు నింపి డాక్యు­మెంట్లతో వెళితే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల­యం­లో వేలి ముద్రలు లాంటి మిగతా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ పూర్తి అయిన తర్వాత ఫిజికల్‌ డాక్యుమెంట్లు రైతులకే ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతోందని చంద్రబాబు తెలుసుకోవాలి.  

పెద్ద సంస్కరణ అవుతుంది..
ఎన్నికల వేళ చంద్రబాబు యథేచ్ఛగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై అవగాహన లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకులు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా మీ ఇళ్లకు ఫోన్లు చేసి మీ భూములన్నీ జగన్‌ లాక్కుంటాడంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా? మీ జగన్‌ భూములిచ్చేవాడే కానీ భూములు లాక్కునే వాడు కాదు. 

నీకు ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అంటే తెలుసా చంద్రబాబూ? ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు ఎల్లవేళలా రైతన్నలకు ఉండేటట్లు చేయడమే. చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ యాక్ట్‌ రాబోయే రోజుల్లో పెద్ద సంస్కరణ అవుతుంది. ఈరోజు ఎక్కడ భూమి కొనుగోలు చేయాలన్నా వివాదాలు తలెత్తుతు­న్నాయి. 

విస్తీర్ణం తక్కువ ఉండటం, సబ్‌ డివి­జన్,  సర్వే జరగకపోవడం, రికార్డులు అప్‌డేట్‌ కాకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవు­తున్నాయి. వీటన్నింటి కారణంగా భూ వివాదాలు పెరిగి రైతన్నలు, ప్రజలు కోర్టులు, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

వివాదాలు లేకుండా.. టైటిల్‌ ఇన్సూరెన్స్‌
రాబోయే రోజుల్లో ఏ రైతూ, ఏ ఒక్కరూ వాళ్ల భూములు కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదు. భూ వివాదాలకు సంబంధించి ఏ కోర్టుకూ వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ఆ భూముల మీద వారికి సంపూ­ర్ణ హక్కులు కల్పిస్తూ వాటిపై ఏవైనా వివాదాలు ఉంటే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. 

ఆ భూముల మీద ఎలాంటి వివాదం లేదని గ్యారంటీ ఇస్తూ ఒక సంస్కరణ తేవాలన్నదే మీ జగన్‌ ఆలోచన. అందుకనే టైటిల్‌ ఇన్సూరెన్స్‌ కూడా చేస్తున్నాం. ఎలాంటి వివాదం లేని టైటిల్స్‌ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలంటే మొదట రాష్ట్రవ్యాప్తంగా జరుగు­తున్న సర్వే పూర్తి కావాలి. దేశంలో వందేళ్ల క్రితం ఆంగ్లేయుల హయాంలో భూముల సర్వే చేశారు. 

రైతుల కోసం ఈ రోజు మళ్లీ ప్రతి ఎకరా రీ సర్వే చేస్తున్నాం. 15 వేల మంది సర్వేయర్లను నియమించాం. ఉచితంగా సరిహద్దు రాళ్లను నాటి రికార్డులన్నీ అప్‌డేట్‌ చేస్తున్నాం. సబ్‌ డివిజన్‌ చేసి ఆ హక్కు పత్రా­లను పదిలంగా రైతన్నలకు అంద­చేస్తున్నాం. రాష్ట్రంలో 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాలకు­గానూ ఇప్పటివరకు 6 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయ్యింది. మిగతా చోట్ల ఒకటిన్నర, రెండేళ్లలో సర్వే పూర్తవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement