కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలో | Ramoji Rao Eenadu Fake News on Land Titling Act | Sakshi
Sakshi News home page

కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలో

Published Sun, May 5 2024 5:23 AM | Last Updated on Sun, May 5 2024 5:23 AM

Ramoji Rao Eenadu Fake News on Land Titling Act

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై బరితెగించి అబద్ధాలు 

లేని వ్యక్తులకు అన్యాయం జరిగిందంటూ రామోజీ ఆక్రోశం 

కల్పిత పాత్రలను సృష్టించి, ఏదో జరిగిపోయిందని ఆక్రందన 

రిజిస్టరే లేనపుడు అందులో కొందరి పేర్లు లేకపోవటం సాధ్యమా? 

చట్టం దేవుడెరుగు... చట్టానికి సంబంధించిన రూల్సే రాలేదని తెలీదా? 

రూల్స్‌ వచ్చాక.. వాటిపై సమగ్ర చర్చ జరిగిన తరవాతే తుది రూపు 

పైపెచ్చు రీసర్వే పూర్తయ్యాకే ఈ చట్టాన్ని అమలు చేయటం సాధ్యం 

ఇప్పటికి 4 వేల గ్రామాల్లోనే రీ సర్వే పూర్తి.. ఇంకా 13 వేల గ్రామాల్లో పెండింగ్‌ 

అది పూర్తయి.. రూల్స్‌ ఖరారయ్యాక కదా చట్టం అమలు గురించి మాట్లాడేది.. 

అయినా అన్ని రాష్ట్రాలనూ అమలు చేయమంటున్నది కేంద్రమే కదా! 

అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తేనే... ఇక్కడా చేస్తామని చెబుతున్న రాష్ట్రం 

మోదీ ముందు తల ఊపి.. బయట మాత్రం విష ప్రచారం చేస్తున్న బాబు 

బాబునెవరూ నమ్మటం లేదని గ్రహించి... మారీచుడి పాత్రలోకి రామోజీ 

జనాన్ని భయపెట్టడానికి అబద్ధాలే అ్రస్తాలుగా మాయా యుద్ధం 

పోలింగ్‌ వరకూ ఈ ఒక్క అంశంమీదే మాట్లాడాలని ‘ఎల్లో’ తాఖీదు 

మిగతావన్నీ పక్కనబెట్టి విస్తృతంగా విష ప్రచారం చేస్తున్న పచ్చ మంద

సాంబశివుడు.. గోవిందరెడ్డి.. సుబ్బారావు.. ఎవరు వీళ్లంతా?
రామోజీరావు రహస్య సంతానమా? లేకపోతే చంద్రబాబు దత్తపుత్రులా? లేని పేర్లను సృష్టించి.. లేని రిజిస్టరులో వీళ్ల పేర్లు వివాదంలో చిక్కుకున్నట్లుగా రాసి పారేసి... లేని చట్టాన్ని అమల్లో ఉన్నట్టుగా చూపిస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతుల్ని చేసిన ‘ఈనాడు’ను ఏమనుకోవాలి? రాష్ట్రాన్ని రాచపుండులా పీడిస్తున్న రామోజీరావు తన చంద్రబాబు కోసం ఇంకెంత దిగజారుతారు? అసలు అమల్లోకే రాని ‘ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం’ గురించి ఎందుకు జనాన్నింతలా భయపెడుతున్నారు? జనం గనక మాకు వద్దంటే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఏ చట్టాన్నయినా తెస్తుందా? అలా తెచ్చిన దాఖలా ఒక్కటయినా ఉందా?

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి :  కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖరారు చేసిన చట్టం ఈ ‘ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌’. దీన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ నోడల్‌ ఏజెన్సీ ‘నీతీ ఆయోగ్‌’ అన్ని రాష్ట్రాలకూ పంపితే.. ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో రాష్ట్రం కూడా ఆ దిశగా అడుగులు వేసి ముసాయిదా చట్టాన్ని చేసింది. కానీ ఈ చట్టానికి సంబంధించిన రూల్స్‌ ఏవీ ఇప్పటిదాకా విడుదల కాలేదు.

 అంటే ఈ చట్టం కింద టైటిల్‌ రిజిస్టరు ఎలా ఉంటుంది? టైటిల్‌ రిజిష్ట్రారుగా ఎవరిని నియమించాలి? రెవెన్యూ అధికారులనా... లేకపోతే న్యాయ వ్యవస్థ నుంచి జ్యుడీíÙయల్‌ అధికారులనా? ఇలా ఈ చట్టం అమలుకు సంబంధించి ఉండే సమగ్ర నియమ నిబంధనలేవీ ఇంకా రూపు దిద్దుకోనేలేదు. ఈ రూల్స్‌ విడుదలయ్యాక వీటిపై గ్రామ స్థాయి నుంచి సభలు నిర్వహించి.. ప్రజల అభ్యంతరాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నియమాలు (రూల్స్‌) రూపొందిస్తారు. ఆ రూల్స్‌కు లోబడే చట్టాన్ని అమలు చేస్తారు.

ఇవేవీ జరగకుండానే... చట్టం అమలయిపోతున్నట్లుగా, ప్రభుత్వం భూములు లాక్కుంటోందంటూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేయటం ఎంత దుర్మార్గం రామోజీరావ్‌? అందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి సందర్భంలోనూ ఒక మాటంటూ ఉంటారు. తాను పోరాడుతున్నది మాయా యుద్ధం చేసే మారీచులతోనని. ఈ ఎల్లో ముఠా అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతుందని, ఎంతటి విపత్తులనైనా సృష్టిస్తుందని. నారా వారిని ఎలాగైనా గద్దెనెక్కించాలని మాయా యుద్ధం చేస్తున్న ‘ఈనాడు’ బుద్ధి... అందుకే ఇపుడు భూ మార్గం పట్టింది.  

చట్టం రావాలంటే సర్వే పూర్తి కావాలి..
మూడేళ్ల కిందట కేంద్రం ఈ చట్టాన్ని ఆమోదించి అన్ని రాష్ట్రాలకూ పంపిన తర్వాత.. నీతీ ఆయోగ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా చట్టానికి రూపకల్పన చేయటంతో పాటు.. రాష్ట్రంలోని గ్రామాల్లో రీ సర్వే చేపట్టింది. నిజానికి వందేళ్ల కిందట ఎప్పుడో బ్రిటిష్‌ ప్రభుత్వం చేపట్టిన సర్వే తప్ప.. నాటి నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వమూ భూముల సమగ్ర సర్వే చేపట్టలేదు.

కొత్తగా సర్వేయర్లను నియమించి.. రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగాన్ని మొత్తాన్ని మోహరించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రీ సర్వే యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన సర్వే జనరల్‌ సైతం రాష్ట్రానికి వచ్చి రీ సర్వే చేస్తున్న తీరును ప్రశంసించారు. ఈ రీ సర్వే చేస్తూ... కింది స్థాయిలో పరిష్కారమయ్యే చిన్న చిన్న వివాదాల కోసం మొబైల్‌ న్యాయ స్థానాలను కూడా ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా సాగుతున్న ఈ ప్రయత్నం వల్ల ఇప్పటికి 4 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తయింది. మరో 2 వేల గ్రామాల్లో తుది దశలో ఉంది. కాకపోతే రాష్ట్రంలో మొత్తం 17 వేల గ్రామాలున్నాయి. ఇంకా 11 వేల గ్రామాల్లో రీసర్వే మొదలు కావాల్సి ఉంది.

మొత్తం అన్ని గ్రామాల్లోనూ రీసర్వే పూర్తయ్యాక వివాదాలు లేని భూములకు సంబంధించి వాటి యజమానులకు హక్కు పత్రాలు అందజేస్తారు. ఆ హక్కు దారుల వివరాలే చివర్లో టైటిల్‌ రిజిస్టరులో ఉంటాయి. ప్రజలంతా అంగీకరించి.. ప్రభుత్వం గనక ముందుకు వెళితే ఈ సుదీర్ఘ ప్రక్రియ పూర్తవటానికి కొన్నేళ్లు పడుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి కనక... మిగతా రాష్ట్రాలు కూడా రీ సర్వేలు పూర్తి చేసి, ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తే.. అప్పుడు దేశ వ్యాప్తంగా ఒకే టైటిల్‌ రిజిస్టరు నిర్వహించడానికి వీలవుతుంది.

కేంద్రం ఆశిస్తున్నది అదే. దీనివల్ల దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడి భూమినయినా కొనుగోలు చేయొచ్చు. ఢిల్లీలో భూమి కొనుగోలు చేసినా విజయవాడ రిజిస్టరు కార్యాలయంలోనే దాన్ని రిజిస్టరు చేసుకోవచ్చు. పైపెచ్చు ఒక భూమిని ఎక్కడ ఎవరు కొనుగోలు చేసినా... విక్రయించినా, లేక ఆ భూమిపై ఎక్కడ రుణం తీసుకున్నా ఆ వివరాలన్నీ టైటిల్‌ రిజిస్టరులో నమోదవుతాయి.

కాబట్టి రుణం వంటి వివరాలు దాచి మరొకరి దగ్గర రుణాలు తీసుకునే అవకాశం ఉండదు. ఇదిగో ఇలాంటిది వ్యవస్థ ఇంకా అమల్లోకి రాలేదు కనకనే సుజనా చౌదరి లాంటి వ్యక్తులు పారిశ్రామిక వేత్తల ముసుగులో ఒకే పరిశ్రమకు సంబంధించిన భూముల్ని పలు ఆర్థిక సంస్థల దగ్గర తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. చివరకు బ్యాంకుల్ని ముంచేశారు. ఇప్పుడేమో తాను ఆ వ్యాపారాల నుంచి తప్పుకున్నానని, తనకేమీ సంబంధం లేదని శుద్ధపూస కబుర్లు చెబుతున్నారు.

టైటిల్‌కు ప్రభుత్వమే గ్యారంటీ  
సమగ్రంగా రీ సర్వే జరిపి... వివాదాలేవీ లేవని తేలి్చన మీదట ఆ భూములకు టైటిల్‌ పత్రాలిస్తారు కనక.. అక్కడి నుంచి ఆ టైటిల్‌కు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. ఒకవేళ ప్రభుత్వం టైటిల్‌ ఇచ్చాక కూడా ఆ భూమి అసైన్డ్‌ అనో, డీ పట్టా అనో వివాదం గనక తలెత్తితే ఆ టైటిల్‌ దారుకు ప్రభుత్వం పూర్తి నష్టపరిహారం చెల్లిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వమే ఆయా భూములకు బీమా చేస్తుంది. బీమా సొమ్మును టైటిల్‌ దారుకు చెల్లిస్తుంది. ఈ నిబంధన వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టే ఈ చట్టం విషయంలో ముందుకు అడుగులు వేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ చెబుతోంది.  

మోదీతో చెప్పించగలవా బాబూ?
ఈ చట్టం వల్ల ప్రజలకు హాని జరుగుతుందని, ఈ చట్టం ద్వారా ప్రభుత్వం భూములు లాక్కుంటుందని చంద్రబాబు ముఠా, ఎల్లో మీడియా ఉధృతంగా విష ప్రచారం చేస్తున్నాయి. పత్రికల్లో కథనాలు రాయించటంతో పాటు పనికిమాలిన వ్యక్తులకు లాయర్ల కోటు తొడిగి నిపుణుల ముసుగులో ఎల్లో చానెళ్లలో మాట్లాడిస్తోంది. సోషల్‌ మీడియాలో అబద్ధాలను జోరుగా వైరల్‌ చేస్తోంది.

వీటిలో ఏ ఒక్క శాతం నిజం ఉన్నా.. ఈ చట్టం కేంద్రానిది కనుక ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పగలవా చంద్రబాబూ? ఈ చట్టం వల్ల ప్రజలకు హాని జరుగుతుందని, కాబట్టి దీన్ని తాము వెనక్కి తీసుకుంటున్నామని మోదీతో చెప్పించగలవా? మరి అవేవీ చెయ్యలేనపుడు ఎందుకీ విష ప్రచారం? ఎందుకు బీజేపీతో కలిసి పోటీ చేయటం? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కూటమి గట్టడమెందుకు? వారు చేస్తున్న చట్టం ప్రజలకు మేలు చేసేది కాదని, దాన్ని తెలుగుదేశం అంగీకరించదని నేరుగా చెప్పలేని నీ బతుకెందుకు? అబద్ధాల పునాదులపై నిరి్మంచుకున్న నీ రాజకీయ కోట పునాదులతో సహా పేలిపోయే రోజు అతి దగ్గరలోనే కనిపించటం లేదా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement