
న్యూఢిల్లీ: నిర్భయ దోషులు వారి ఉరిశిక్ష అమలుపై మళ్లీ కోర్టును ఆశ్రయించారు. నలుగురు దోషుల్లో ఇద్దరు తమ శిక్ష అమలుపై స్టే ఇవ్వాల్సిందిగా ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈనెల 3వ తేదీన వారికి ఉరి శిక్ష అమలు కానున్న సంగతి తెలిసిందే. దోషులు అక్షయ్ సింగ్, పవన్‌కుమార్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్లపై ఈనెల 2లోగా వివరణ ఇవ్వాలని తీహార్ జైలు అధికారులకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా నోటీసులు జారీచేశారు. అక్షయ్ సింగ్ తన పిటిషన్‌లో తాజాగా మరో క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశానని, అది పెండింగ్‌లో ఉందని పేర్కొన్నాడు. సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని పవన్‌కుమార్ గుప్తా పిటిషన్‌లో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment