Akshay Singh
-
మరోసారి కోర్టుకు నిర్భయ దోషులు
న్యూఢిల్లీ: నిర్భయ దోషులు వారి ఉరిశిక్ష అమలుపై మళ్లీ కోర్టును ఆశ్రయించారు. నలుగురు దోషుల్లో ఇద్దరు తమ శిక్ష అమలుపై స్టే ఇవ్వాల్సిందిగా ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈనెల 3వ తేదీన వారికి ఉరి శిక్ష అమలు కానున్న సంగతి తెలిసిందే. దోషులు అక్షయ్ సింగ్, పవన్‌కుమార్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్లపై ఈనెల 2లోగా వివరణ ఇవ్వాలని తీహార్ జైలు అధికారులకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా నోటీసులు జారీచేశారు. అక్షయ్ సింగ్ తన పిటిషన్లో తాజాగా మరో క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశానని, అది పెండింగ్‌లో ఉందని పేర్కొన్నాడు. సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని పవన్‌కుమార్ గుప్తా పిటిషన్లో పేర్కొన్నాడు. -
నిర్భయ కేసు : రివ్యూ పిటిషన్‌పై విచారణ
న్యూఢిల్లీ : నిర్భయ కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. అక్షయ్ పిటిషన్‌పై డిసెంబర్ 17న మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తనకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని అక్షయ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఢిల్లీలో వాయు కాలుష్యం, జల కాలుష్యం వల్ల ఎలాగో తన ఆయుష్షు తగ్గిపోతుందని.. అలాంటప్పుడు మరణశిక్ష ఎందుకు అని ప్రశ్నించాడు. అయితే గతంలో మిగిలిన ముగ్గురు దోషులు వినయ్, ముకేశ్, పవన్‌లు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇటీవల వినయ్ క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వంతోపాటు, కేంద్రం కూడా తోసిపుచ్చింది. కొద్ది రోజుల్లో నిర్భయ కేసులో దోషులను ఊరి తీస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్న సమయంలో అక్షయ్ రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, నిర్భయను 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి బస్సులో ఆరుగురు రాక్షసులు మూకుమ్మడిగా అత్యాచారం చేయడమే కాకుండా, దారుణంగా హింసించడంతో ఆమె కొన్నాళ్లు మృత్యువుతో పోరాడి సింగపూర్ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆరుగురు దోషుల్లో ఒకరైన రామ్‌సింగ్ జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్ కావడంతో మూడేళ్ల పాటు జువైనల్ హోంకి పంపారు. మిగిలిన నలుగురికి కోర్టు 2017లో మరణశిక్ష విధించింది. ప్రస్తుతం వీరు తీహార్ జైలులో ఉన్నారు. -
నేనేదో జోక్ చేశాను అంతే..
భోపాల్: వ్యాపమ్ స్కామ్‌పై తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి కైలాస్ విజయ్ వార్గీయ సమర్థించుకున్నారు. పైపెచ్చు మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందంటూ ఎదురుదాడి చేశారు. 'నేనేమీ వివాదాస్పదగా మాట్లాడలేదు. నేనేదో జోక్ చేశాను అంతే అంటూ కైలాస్ విజయ్ వార్గీయ తనను తాను వెనకేసుకొచ్చుకున్నారు. మీడియా తన వ్యాఖ్యాలను అనవసరంగా రాద్ధాంతం చేసిందని మండిపడ్డారు. వరుస అనుమానాస్పద మరణాలతో మరణ మృదంగాన్ని మోగిస్తున్న వ్యాపమ్ కేసులో మంత్రుల అనుచిత వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. 48 వరుస అనుమానాస్పద మరణాలతో కిల్లింగ్ స్కాంగా పేరుగాంచిన ఈ కేసులో మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మంత్రులు బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలతో వివాదాన్ని రగిలిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ మరణంపై మంత్రి కైలాస్ విజయ్ వార్గీయ స్పందనను మీడియా కోరినపుడు ... చచ్చిపోయిన ఆ జర్నలిస్టు గురించి మర్చిపోండి... అతను నాకంటే గొప్పవాడా ఏంటి అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జర్నలిస్టు మరణాన్ని చాలా తేలిగ్గా తీసి పారేస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయిన దృశ్యాలు మీడియాలో ప్రసారం కావటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. దీంతో మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. కాగా స్కాంలో రిపోర్టింగ్‌లో ఉన్న జర్నలిస్టు అక్షయ్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. అలాగే ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్‌కు సహకరిస్తున్న జబల్ పూర్ యూనివర్శిటీ డీన్ అరుణ్ శర్మ కూడా అనుమానాస్పద రీతిలో చనిపోయారు. తన విచారణ నివేదికను సమర్పించిన రెండురోజుల తర్వాత ఢిల్లీలోని ఒక హెటల గదిలో ఆయన చనిపోయారు. మరోవైపు ఈ కేసులో ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ అనామిక కుస్వాహ సోమవారం ఉదయం స్థానిక చెరువులో శవమై తేలారు. -
విలేకరి అక్షయ్ సింగ్ ఆకస్మిక మృతి
జబువా (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న వృత్తిపరీక్షల బోర్డు(వ్యాపమ్) కుంభకోణంపై వార్తలు అందిస్తున్న అక్షయ్ సింగ్ అనే విలేకరి శనివారం ఆకస్మికంగా మృతి చెందారు. టీవీ టుడే టీవీ చానల్ విలేకరిగా పనిచేస్తున్న అక్షయ్ మధ్యప్రదేశ్‌లోని మేఘ్‌నగర్‌లో హఠాత్తుగా అనారోగ్యానికి గురై కన్నుమూశారు. ఢిల్లీలో పనిచేస్తున్న ఆయన అనుమానాస్పదంగా మృతిచెందిన ఈ స్కాం నిందితురాలు నమ్రతా దామోర్ తల్లిదండ్రులతో మాట్లాడేందుకుశనివారం మేఘ్‌నగర్ వచ్చారు. నమ్రత తండ్రి మెహతాబ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్షయ్, మరో ఇద్దరు మెహతాబ్ ఇంటికి వెళ్లారు. ఇంటర్వ్యూ అయిపోయాక ఏవో కాగితాలను జిరాక్స్ చేయించేందుకు ఒక వ్యక్తిని పంపారు. అక్షయ్ ఆ ఇంటి వెలుపల వేచిచూస్తుండగా హఠాత్తుగా నోట్లోంచి నురగ వచ్చింది. ఆయనను దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఫలితం లేకపోవంతో దగ్గర్లోనే ఉన్న దాహోద్(గుజరాత్)కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ స్కాంలో లబ్ధి పొందినట్లు భావిస్తున్న నమ్రత మృతదేహం 2012లో రైలు పట్టాలపై కనిపించింది. అక్షయ్ మృతిపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సందేహాలు లేవనెత్తారు. పోస్ట్‌మార్టంను వీడియోలో చిత్రీకరించాలని డిమాండ్ చేశారు.