
రాధిక
చైతన్యరామ్, పవన్ కుమార్ హీరోలుగా, రాధిక హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘గండభేరుండ’. సూర్యన్ దర్శకత్వంలో కె.సూరిబాబు, చల్లమళ్ల రామకృష్ణ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కానుంది. శ్రీసాయిదేవ్ స్వరపరచిన ఈ సినిమా పాటలను, ట్రైలర్‌ని దర్శక–నిర్మాత సాయివెంకట్, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘గండభేరుండ’ సినిమా మంచి విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.
సూర్యన్ మాట్లాడుతూ– ‘‘గండభేరుండ’ అనే పక్షి మనిషిగా పుట్టి ఓ కుటుంబాన్ని అత్యంత ప్రమాదకర విపత్తు నుంచి ఎలా కాపాడిందనే కథాంశంతో రూపొందిన సోషియో ఫ్యాంటసీ హారర్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. మలేసియాలో చేయించిన 17 నిమిషాల నిడివి గల గ్రాఫిక్స్, 5 ఫైట్స్, 4 పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, పెద్దాపురం, భీమోలు పరిసర ప్రాంతాల్లో సినిమా మొత్తం చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్ 5న విడుదల కానున్న మా సినిమా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు చల్లమళ్ల రామకృష్ణ. రాధిక, పవన్ కుమార్, విలన్ పాత్రధారి రవికిరణ్ శొంఠి, డైరెక్టర్ సుచరిత తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్.