హైదరాబాద్: మూడు రోజుల క్రితం రాజ్ భవన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన యువకుడు ఆదివారం మృతి చెందాడు. సీఐ వేధింపుల్లో భాగంగా శుక్రవారం గవర్నర్ కలిసేందుకు వచ్చిన పవన్ కుమార్ అనే యువకుడ్ని పోలీసులు అడ్డుకోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయువకుడు ఈ రోజు ఉదయం మృతి చెందాడు. గత కొంతకాలంగా సీఐ తనను వేధిస్తున్నాడంటూ కడపకు చెందిన పవన్ కుమార్ గవర్నర్ కలిసేందుకు యత్నించాడు.
ఈ క్రమంలోనే అతన్ని పోలీసులు అడ్డుకున్నారు. తనకు న్యాయం చేయాల్సిదింగా గవర్నర్ ను కలవడానికి వస్తే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించాడు. దీనిలో భాగంగానే అతని వెంట తెచ్చుకున్న విషాన్ని తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.