జింఖానా, న్యూస్‌లైన్: కాకతీయ జట్టు బౌలర్ పవన్ కుమార్ (6/37) విజృంభించడంతో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఎస్‌ఎన్ గ్రూప్ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఎన్ గ్రూప్ 103 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన కాకతీయ మూడే వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. అజయ్ (42) మెరుగ్గా ఆడాడు.
మరో మ్యాచ్‌లో నవజీవన్ ఫ్రెండ్స్ జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్‌లో రణ ధీర్ (88), బౌలింగ్‌లో అంబాదాస్ (5/68) రాణించారు. దీంతో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో సాక్రెడ్ హర్ట్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన సాక్రెడ్ హర్ట్ 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. జమీల్ (81) అర్ధ సెంచరీతో రాణించాడు. తర్వాత లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన నవజీవన్ ఫ్రెండ్స్ 5 వికెట్ల కోల్పోయి 206 పరుగులు చేసింది. వినయ్ 45 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
భారతీయ: 237 (సోమశేఖర్ 72, ప్రజ్వల్ 40, శ్రీకాంత్ నాయుడు 49; గుప్త 7/53); మహ్మద్ సీసీ: 198 (గుప్త 57; సోమశేఖర్ 3/15, అశోక్ కుమార్ 6/43).
గగన్ మహల్ సీసీ: 143 (సాగర్ 32; మహబూబ్ అలీ 3/28. ముఖీత్ 5/35); యూత్ సీసీ: 144/5 (అనిరుధ్ రెడ్డి 36, అరుణ్ 40 నాటౌట్).
తిరుమల: 196 (అశ్విన్ మానే 45; ఖాదర్ 3/43, సయ్యద్ సోహైల్ 3/14); డెక్కన్ బ్లూస్: 113 (సోహైల్ 39; అశ్విన్ మానే 5/32).
పవన్ విజృంభణ
Published Wed, Dec 18 2013 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement
Advertisement