‘యావరేజ్‌ స్టూడెంట్‌ నాని’ మూవీ రివ్యూ | Average Student Nani 2024 Movie Review And Rating In Telugu | Pawan Kumar Kothuri | Sneha Malviya | Sakshi
Sakshi News home page

Average Student Nani Review: ‘యావరేజ్‌ స్టూడెంట్‌ నాని’ సినిమా ఎలా ఉందంటే..?

Published Fri, Aug 2 2024 4:27 PM | Last Updated on Fri, Aug 2 2024 5:48 PM

Average Student Nani Movie Review And Rating In Telugu

టైటిల్‌: యావరేజ్‌ స్టూడెంట్‌ నాని
నటీనటులు: పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ మాల్వియ, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి, తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ LLP
నిర్మాతలు: పవన్ కుమార్ కొత్తూరి, బిషాలి గోయెల్
రచయిత, దర్శకుడు: పవన్ కుమార్ కొత్తూరి
సంగీతం: కార్తీక్ బి కొడకండ్ల
సినిమాటోగ్రఫీ: సజీష్ రాజేంద్రన్
విడుదల తేది: ఆగస్ట్‌ 2, 2024

‘యావరేజ్‌ స్టూడెంట్‌ నాని’ కథేంటంటే..
నాని(పవన్‌ కుమార్‌) ఓ యావరేజ్‌ స్టూడెంట్‌. అమ్మనాన్నలు(ఝాన్సీ, రాజీవ్‌ కనకాల) తిడుతూ ఉన్నా.. అమ్మాయిలను ఫ్లట్‌ చేస్తూ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తుంటాడు. అక్క(వివియా సంపత్‌) సహాయంతో మంచి ర్యాంక్‌ రాకపోయినా బీటెక్‌లో జాయిన్‌ అవుతాడు. కాలేజీలో తన సీనియర్‌ సారా(స్నేహ మాల్వియా)తో ప్రేమలో పడతాడు. జూనియర్‌ అను(సాహిబా భాసిన్‌) నానిని ఇష్టపడుతుంది. కొన్ని కారణాల వల్ల సారా అదే కాలేజీకి చెందిన ఓ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంటుంది. నాని ఈ బాధలో ఉండగానే..కోమాలో ఉన్న తన అక్క తనకోసం చేసిన త్యాగం గురించి తెలుస్తుంది. తనవల్ల ఎవరికి ఉపయోగం లేదని భావించిన నాని.. ఓ సంచలన నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? నానిని ప్రాణంగా ప్రేమించిన సారా..మరో వ్యక్తితో ఎందుకు ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవాల్సి వచ్చింది? నాని-సారాల లవ్‌స్టోరీ గురించి తెలిసిన తర్వాత కూడా అను నానితో ఎలా ప్రేమలో పడింది? యావరేజ్‌ స్టూడెంట్‌ అయినా నాని.. చివరకు అందరితో శభాష్‌ అనిపించుకోవడమే కాకుండా.. అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని ఎలా సంపాదించగలిగాడు? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే.. 
హీరో యావరేజ్‌ స్టూడెంట్‌. అల్లరి చిల్లరగా తిరుగుతూ..చివరకు ఓ మంచి పని చేసి అందరితో శభాష్‌ అనిపించుకుంటాడు.. ఇలాంటి యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. యావరేజ్‌ స్టూడెంట్‌ నాని కథ కూడా ఇదే. అయితే యూత్‌కి ఆకట్టుకునే విధంగా బోల్డ్‌, గ్లామర్‌ అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు పవన్‌ కొత్తూరి. దర్శకుడు రాసుకున్న పాయింట్‌ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రయత్నంలో మాత్రం పూర్తిగా సక్సెస్‌ కాలేకపోయాడు. కేవలం రొమాంటిక్‌ సీన్లతో కథనాన్ని నడిపించే ప్రయత్నం చేశాడు. ఫాదర్‌-సన్‌ రిలేషన్‌, సిస్టర్‌ సెంటిమెంట్‌ ఉన్నా.. బోల్డ్‌ సీన్ల కారణంగా వాటికి ప్రేక్షకుడు కనెక్ట్‌ కాలేకపోయాడు. అయితే యూత్‌ మాత్రం కొన్ని సీన్లను బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఫస్టాఫ్‌ అంతా నాని కాలేజీ లైఫ్‌.. సారాతో ప్రేమాయణంతో ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. సెకండాఫ్‌లో కాలేజీ సీన్లు బోర్‌ కొటి​ంచినా.. పాదర్‌-సన్‌ సెంటిమెంట్‌ సీన్లు ఆకట్టుకుంటాయి. చివరిలో ఇద్దరు హీరోయిన్లతో కలిసి వచ్చే పాట ఈళలు వేయిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. కథనం బోల్డ్‌గా సాగినా.. అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు. బోల్డ్‌ సీన్స్‌ అత్యధికంగా ఉండడం కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇబ్బందిగా అనిపించినా..యూత్‌ మాత్రం ఎంజాయ్‌ చేస్తుంది.

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ-నిర్మాణ బాధ్యతలు కూడా పవన్‌ కుమారే తీసుకున్నాడు. తను రాసుకున్నదే కాబట్టి నాని పాత్రలో పవన్‌ ఒదిగిపోయాడు. కామెడీ కూడా బాగా పండించాడు. ఎమోషన్‌ సీన్లలో చక్కగా నటించాడు. హీరోయిన్స్ సాహిబా భాసిన్‌, స్నేహ మాల్వియల నటనకు పెద్దగా స్కోప్‌ లేదు కానీ..తెరపై అందంగా కనిపించ్‌ ఎంటర్‌టైన్‌ చేశారు.  తల్లి పాత్రలో ఝాన్సీ, తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల బాగా నటించారు. హీరో అక్క పాత్రలో వివియా సంపత్ పర్వాలేదనిపించింది. మిగిలిన నటీనటులు కూడా ఓకే అనిపిస్తారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. చివర్లో ఇద్దరు హీరోయిన్లతో కలిసి వచ్చే మాస్‌ సాంగ్‌తో పాటు ఓ ఎమోషనల్‌ సాంగ్‌ కూడా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
- రేటింగ్‌: 2.5/5

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement