భువనగిరి/యాదగిరికొండ, న్యూస్‌లైన్
ఎంతో ప్రశస్తమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య ఏరోజు కారోజు పెరుగుతూనే ఉంది. అందుకనుగుణంగా సౌకర్యాలు మాత్రం లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తున్నది. ఇక వచ్చే 30 ఏళ్లలో ఈ ఆలయానికి భక్తుల రాక మరింత పెరగనుంది. వీరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగినన్ని సౌకర్యాలు కల్పించేందుకుగాను మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇటీవల జరిగిన ఆ శాఖ ముఖ్యసమావేశంలో దీనిపై చర్చించారు. యాదగిరిగుట్ట దేవస్థానం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఏటా *50కోట్ల రాబడి గల ఈ క్షేత్రం.. విశేషదినాలు, వారాంతపు రోజుల్లో వచ్చే భక్తులతో కిటకిటలాడుతోంది. అయితే ఇక్కడ సరైన వసతులు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శని,ఆదివారాల్లో 50 వేల నుంచి 80వేల మంది భక్తులు వస్తారంటే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
సామాన్య భక్తులకు పెద్దగా వసతులు లేవు. ధర్మదర్శనం నుంచి, శ్రీఘ్ర, అతిశ్రీఘ్ర దర్శనం కోసం ఒక భక్తుడు క్యూలైన్‌లోకి వెళ్లి బయటికి రావడానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమ యం పడుతుంది. అంతే కాకుండా అద్దె గదులు, మంచినీరు, ప్రసాదాలు, రవాణా, పార్కింగ్ వంటి విషయాల్లో నిత్యం అవస్థలే ఎదురవుతున్నాయి. 2003-04లో ఒకసారి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇందులో శాఖా పరమైన అనుమతుల్లో ఇబ్బందులు, నిధుల కొరత మా స్టర్‌ప్లాన్ అమలుకు అడ్డంకిగా మారాయి. దేవస్థానం ఈఓలు మారినపుడల్లా ఆలయంలో అభివృద్ధికార్యక్రమాల ప్రాధాన్యతలు మారుతున్నాయే కానీ భక్తుల ఇబ్బందులు తీరడం లేదన్న విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే 30 ఏళ్లలో పెరిగే భక్తుల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాల కల్పనే ధ్యేయంగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని ఇటీవల నిర్వహించిన దేవాదాయశాఖ సమావేశంలో అధికారులు నిర్ణయించారు.
ఈ అంశాలపైనే..
తాజాగా రాష్ట్ర దేవాదాయశాఖ ఆదేశాల మేరకు రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ ఆధ్యాత్మిక భావన, సంస్కృతి సంప్రదాయాలకు, భక్తుల మనోభావాలు, స్థల పురాణం వంటి అంశాలకు పెద్ద పీట వేస్తూ పుణ్య క్షేత్రంలో వసతులు కల్పించాలన్నదే మాస్టర్‌ప్లాన్ ప్రధాన ధ్యేయం
ఇవీ.. నిర్మించనున్నవి
ఆలయం చుట్టూ తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర నాలుగు దిక్కుల్లో 4 ద్వారాలు ఏర్పాటుచేసి వీటికి మహా రాజగోపురాలు నిర్మిస్తారు.
సుమారు వెయ్యి మంది భక్తులు సేద తీరడానికి , నిద్రించడానికి వీలుగా విశాలమైన డార్మెటరీ హాళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
భక్తుల కోసం 41 గదులు నిర్మిస్తారు.
సుమారు వెయ్యి వాహనాలు పట్టే విశాలమైన పార్కింగ్ రూపొందించనున్నారు.
ఆలయానికి ప్రస్తుతం ఉన్న చైర్మన్ ఇంటి ప్రక్కన గల దుకాణాల సముదాయాన్ని తొలగించి ఆక్కడి నుంచి సంగీత భవనం, ఆండాళ్ నిలయం వెనక వైపు నుంచి విశాలమైన ప్రహరీని నిర్మించనున్నారు.
వీఐపీలకు 100, సామాన్య భక్తులకు 50 చొప్పున చెల్లించి ఉండేందుకు వీలుగా అద్దె గదులు నిర్మిస్తారు. అలాగే ఉచితంగా ఉండేలా మరికొన్నింటిని రూపొందిస్తారు. ఇందులో భక్తులు నిద్రించడానికి వీలుగా వసతులు ఏర్పాటు చేయనున్నారు.
ఆలయం చుట్టూ మంచి లైటింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ మాస్టర్ ప్లాన్‌తో రానున్న మరో 30 సంవత్సరాల వరకు ఆలయ రోడ్లు, డ్రెయినేజీ, మంచినీరు, విద్యుత్ సరఫరా, వాటి నిర్వహణ విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేలా మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నారు.
ఎంతటి దూరం నుంచైనా చూస్తే ఆలయం కనిపిం చేలా ఆలయ పరసరాలను నిర్మాణం చేయనున్నారు.
భవిష్యత్‌లో ఎదురయ్యే విద్యుత్ సమస్యను తీర్చడానికి సోలార్ గ్రిడ్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నెడ్‌క్యాప్ సహకార ంతో ఏర్పాటు చేసే గ్రిడ్ నుంచి సగం విద్యుత్ దేవస్థానానికి, సగం విద్యుత్‌ను బయట విక్రయించడానికి నిర్ణయించుకున్నారు.
భక్తులరాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉండేం దుకు రెండో ఘాట్ రోడ్డు పూర్తి చేయనున్నారు.
భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా కొండపైన, కొండ కి ంది భాగంలో వసతుల కల్పనకు చర్యలుతీసుకోనున్నారు.
మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నాం, : క్రిష్ణవేణి , ఈఓ యాదగిరిగుట్ట దేవస్థానం
30 సంవత్సరాల్లో పెరిగే భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. హైదరాబాద్‌కు చెందిన రాఘవ ఆర్కిటెక్చర్ వారు ఈనెల 29 న ఈ దేవస్థానం మాస్టర్ ప్లాన్‌ను అప్పగిస్తారు. మరో 5 సంవత్సరాల తర్వాత ఈ ఆలయం రూపు రేఖలు మారిపోతాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని సౌకర్యాలతో ప్లాన్‌ను రూపొందిస్తున్నాం.
భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట : బూడిద భిక్షమయ్యగౌడ్, ఎమ్మెల్యే ఆలేరు
భక్తులకు వసతులు కల్పించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండవ ఘాట్ రోడ్డు టెండర్ ప్రక్రియలో ఉంది. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. మాస్టర్ ప్లాన్‌తో గుట్ట రూపు రేఖలు మారిపోతాయి.
మాస్టర్‌ప్లాన్‌తో గుట్ట ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు
Published Tue, Nov 26 2013 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement