బుక్కరాయసముద్రం : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఓ పోస్ట్ మ్యాన్ దారుణ హత్యకు గురయ్యాడు. మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న మార్కండేయ స్వామి ఆలయంలో ఇది జరిగింది. పోస్ట్‌మ్యాన్‌గా పనిచేసే బి.సత్యం(38) కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో శనివారం రాత్రి మార్కండేయ స్వామి ఆలయంలో నిద్ర చేశాడు.
కాగా అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో సత్యం తలపై మోది హత్య చేశారు. ఆదివారం ఉదయం ఓ స్థానికుడు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో ఆలయానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
దేవాలయంలో పోస్ట్ మ్యాన్ దారుణ హత్య
Published Sun, Aug 30 2015 7:51 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement