హిజ్రా దారుణహత్య | brutal murder | Sakshi
Sakshi News home page

హిజ్రా దారుణహత్య

Jan 13 2014 3:12 AM | Updated on Jun 1 2018 8:47 PM

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఆదివారం రాత్రి ఓ హిజ్రా దారుణహత్యకు గురైంది. వివరాలిలా ఉన్నాయి. అంజలినగర్‌లో నివాసముంటున్న నందిని అనే హిజ్రా (38) పామిడికి చెందిన ప్రేమ్ సన్నిహితంగా మెలిగేవారు.

 గుంతకల్లు రూరల్, న్యూస్‌లైన్:అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఆదివారం రాత్రి ఓ హిజ్రా దారుణహత్యకు గురైంది. వివరాలిలా ఉన్నాయి. అంజలినగర్‌లో నివాసముంటున్న నందిని అనే హిజ్రా (38) పామిడికి చెందిన ప్రేమ్ సన్నిహితంగా మెలిగేవారు. వీరి మధ్య అప్పుడప్పుడు చిన్నపాటి గొడవలు చోటు చేసుకునేవి. ఈ క్రమంలో 15 రోజులుగా దూరంగా ఉంటున్న ప్రేమ్.. నందిని కోరిక మేరకు ఆదివారం మధ్యాహ్నం గుంతకల్లుకు వచ్చాడు. మరోసారి వీరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. కోపంగా వెళ్లిపోయిన ప్రేమ్ మరో ఇద్దరు మిత్రులతో కలిసి సాయంత్రం పూటుగా మద్యం తాగి నందిని ఇంటికి చేరుకున్నాడు. నందినిని ప్రతిభా వికాస్ స్కూల్ వెనుకవైపునకు తీసుకెళ్లి ఇనుపరాడ్లు, బండరాళ్లతో మోదారు. ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన రాజు అనే వ్యక్తినీ చితకబాదారు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. అర్బన్ సీఐ ఈ.శ్రీనివాసులు, ఎస్‌ఐలు సునీత (కసాపురం), ఇస్మాయిల్ (వన్‌టౌన్) సంఘటన స్థలాన్ని పరిశీలించి.. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నందినిని, గాయపడిన రాజును ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే నందిని అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
 ఆ ఇద్దరిలో ఒకరు కానిస్టేబుల్?
 ప్రేమ్‌తో కలిసి పూటుగా మద్యం తాగి నందిని(హిజ్రా)ని ఇనుపరాడ్లతో చితకబాదిన వ్యక్తులలో ఒకరు పోలీసు కానిస్టేబుల్ ఉన్నారని ప్రత్యక్ష సాక్షి పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. నేర చరిత్ర కల్గిన ప్రేమ్ కొన్నేళ్ల క్రితం స్వగ్రామం గుంతకల్లు వదిలి పామిడికి మకాం మార్చాడు. ప్రేమ్ ఆదివారం అంజలినగర్‌లో ఉంటున్న హిజ్రా ఇంటికి వచ్చాడు. వీరిద్దరూ గొడవ పడుతున్న విషయం తెలిసి ఓ కానిస్టేబుల్ సమస్యను స్టేషన్‌లో పరిష్కరిస్తామని చెప్పి ద్విచక్ర వాహనంలో తీసుకువెళ్తున్న సమయంలోనే నందిని హత్యకు గురి కావడం అనుమానాలకు తావిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement