- రోడ్డెక్కిన వృద్ధులు
- రెండు గంటల పాటు రాస్తారోకో
- నచ్చజెప్పి ఆందోళన విరమింప జేసిన ఎస్‌ఐ
జిన్నారం: ప్రభుత్వం తమకు పింఛన్లు మంజూరు చేసినా స్థానిక పోస్టుమన్, పంచాయతీ సిబ్బంది డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సోమవారం పలువురు వృద్ధులు రోడ్డెక్కారు. ఈ ఘటన జిన్నారం మండలం దోమడుగు ప్రధాన రహదారి పై చోటు చేసుకుంది. దోమడుగు పంచాయతీ పరిధిలో సుమారు 300 వరకు పింఛను లబ్ధిదారులు ఉన్నారు.
వీరికి ప్రభుత్వం డబ్బు మంజూరు చేసిం ది. అయితే రెండు నెలలుగా పోస్టు మన్ వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు డబ్బులు ఇవ్వడం లేదు. పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో విసుగు చెందిన వృద్ధులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. స్థానిక వార్డు సభ్యులు గోవర్దన్ గౌడ్, యాదగిరి వృద్ధులకు మద్దతుగా రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జిన్నారం ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
లబ్ధిదారులతో మాట్లాడి సమస్యను స్వయంగా తెలుసుకున్నారు. ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, స్థానిక పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, పోస్టు మన్‌లతో ఎస్‌ఐ లాలూనాయక్ ఫోన్‌లో మాట్లాడి ఇక్కడి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు. గంటలోపు అర్హులకు పిం ఛను డబ్బు ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఈ విషయాన్ని ఎస్‌ఐ లాలూనాయక్ ఆందోళన కారులకు చెప్పి వారి ని ఎంపీడీఓ కార్యాలయానికి పంపారు.
పింఛన్ డబ్బు కోసం నిరసన
Published Tue, Apr 21 2015 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM
Advertisement