కొండకరకాం (విజయనగరం రూరల్): మండల పరిధిలోని కొండకరకాం పోస్ట్‌మన్ నిర్వాకం తాళ్లపూడిపేట గ్రామ నిరుద్యోగులకు శాపంగా మారింది. పోస్ట్‌మన్ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల సమీప ప్రాంతాల్లోని నిరుద్యోగులు ఉద్యోగాలకు దూరం కావాల్సిన పరిస్థి తి నెలకొంటోంది. మండల పరిధిలోని కొండకరకాం గ్రామ పోస్టాఫీస్ పరిధి లో కొండకరకాం, వైఎస్‌ఆర్ నగర్, ఆర్‌కె టౌన్‌షిప్, నెల్లిమర్ల మండలం తాళ్లపూడిపేట, ఎల్‌ఎన్‌పేట గ్రామాలు ఉన్నాయి. కొండక రకాం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లిమర్ల మండలం తాళ్లపూడిపేట గ్రామానికి వచ్చే ఉత్తరాలను పోస్ట్‌మన్ ఎం.చలపతిరావు సకాలంలో అందించడం లేదన్నది ప్రధాన ఆరోపణ. ఇక్కడి నిరుద్యోగులు ప్రభు త్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు అధికంగా దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఆ సంస్థల నుంచి కాల్ లెటర్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఎప్పుడో ఇంటర్వ్యూ గడువు దాటి 10, 20 రోజులు పోయిన తర్వాత వీరికి కాల్‌లెటర్లు అందుతున్నాయి. ఇవి తెలిసిన వరకే.. అందకుండా పోతున్నవి ఇంకెన్నో..! గత రెండేళ్ల కాలంలో తాళ్లపూడిపేట గ్రామానికి చెందిన ఆరుగురు నిరుద్యోగులకు కాల్‌లెటర్లను పోస్ట్‌మన్ అందించలేదు. ఇటీవల మరోసారి ముగ్గురు నిరుద్యోగులైన తాళ్లపూడి సూరప్పుడు, ధవళ పెంటంనాయుడు, ఎం.పైడిరాజులకు కాల్‌లెటర్లు అందించాల్సి ఉంది. వాటినీ సదరు పోస్ట్‌మన్ అందించలేదు. దీంతో పలువురు నిరుద్యోగులు కొండకరకాం గ్రామంలో ఉన్న పోస్ట్‌మన్ ఇంటికి వెళ్లి ఉత్తరాలను పరిశీలించారు. పది రోజుల క్రితం వచ్చిన కాల్‌లెటర్లు పోస్ట్‌మన్ ఇంటిలోని టీవీ వెనుక ఉండడంతో వారంతా నిర్ఘాంతపోయారు. దీంతో వారంతా సోమవారం కొండకరకాం గ్రామానికి వచ్చి సర్పంచ్, ఎమ్పీటీసీ సమక్షంలో పోస్ట్‌మన్‌ను నిలదీశారు. అనంతరం విజయనగరంలోని హెడ్ పోస్టాఫీస్‌లో ఫిర్యాదు చేశారు.
లేజీ.. పోస్ట్‌మన్!
Published Tue, Aug 11 2015 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM
Advertisement