♦ దాదాపు రూ. 2 లక్షలు మింగేసిన వైనం
♦ లబోదిబోమంటున్న లబ్ధిదారులు
♦ పోలీసులకు ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం రూరల్: వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు ఇవ్వాల్సిన పింఛన్ డబ్బులు రూ. 2 లక్షలను ఓ పోస్టుమన్ కాజేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందిం ది. వివరాలు.. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఉప్పరిగూడ, పోచారం , కర్ణంగూడ గ్రామాల్లో మండల కేంద్రానికి చెందిన పోస్టుమన్ యాదగిరి పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఉప్పరిగూడలో సుమా రు 300 పింఛన్లు, పోచారంలో 285 పెన్షన్లు, కర్ణంగూడలో మరికొన్ని పింఛన్లు బాధితులకు ఇవ్వాల్సి ఉంది. ఉప్పరిగూడలో 50 మంది లబ్ధిదారులకు మూడు, నాలుగు నెలల డబ్బులు, పోచారంలో 30 మందికి పింఛన్ ఇవ్వలేదని పలుమార్లు అయా గ్రామాల సర్పంచ్‌లు పోస్టుమన్ యాదగిరిని మందలించారు.
దీంతో ఆయన ఉప్పరిగూడలో 30 మందికి ఇటీవల డబ్బులు పంపిణీ చేశాడు. పోచారంలో 20 మందికి పైగా రెండు, మూడు నెలల డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఈరోజు, రేపు డబ్బులు ఇస్తానని యాదగిరి తప్పించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా, గత నా లుగు రోజులుగా పోస్టుమన్ కనిపించకుం డా పోయాడు. అతడి సెల్‌ఫోన్‌కు కాల్ చేయగా స్విఛాఫ్ వస్తోంది. సూమారు రూ.2 లక్షలకు పైగానే పోస్టుమన్ యాదగిరి డబ్బులు కాజేశాడని బాధితులు ఆరోపించారు. అయితే, పోచారం గ్రామానికి చెందిన కావలికారు రమేష్ వద్ద రూ.30 వేలతో పాటు అతడి బైక్ తీసుకొని వెళ్లిన యాదగిరి ఆచూకీ లేకుండా పోయింది. దీంతో పోస్టాఫీస్ అధికారులు, కావలికారు రమేష్‌తోపాటు యాదగిరి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణ చేపడతాం
ఆసరా పింఛన్లు అందలేదని.. పోస్టుమన్ యాదగిరి కాజేసినట్లు ఫిర్యాదులు అందాయని ఎంపీడీఓ అనిల్‌కుమార్ తెలిపారు. అతడు ఎంతమొత్తంలో డబ్బులు తీసుకున్నాడు.. అనే విషయాలు పూర్తిస్థాయిలో తెలియరాలేదని చెప్పారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ తెలిపారు.