Pension money
-
పింఛన్ కోసం.. నలుగురు మృత్యువాత
సాక్షి నెట్వర్క్: అవ్వాతాతలు, వృద్ధులు, వితంతువులు తదితరుల ఇళ్లకే వెళ్లి ప్రతీనెలా ఠంఛనుగా ఒకటో తేదీ పొద్దున్నే వలంటీర్ల ద్వారా పింఛన్లను అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానంపై టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి అక్కసుకు వారు బలవుతున్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మైలేజీ వస్తుందేమోనన్న దుగ్థతో కూటమి పార్టీలు ఎన్నికల సంఘానికి పదేపదే ఇ చ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో గత నెలలో సచివాలయాల వద్ద ఇవ్వగా దీనిపైనా కూటమి అభ్యంతరాలు చెప్పడంతో ఈనెల బ్యాంకుల్లో పింఛన్ మొత్తం జమచేయమని ఈసీ ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాలున్న వారికి బ్యాంకుల్లో పింఛన్లను జమచేసింది. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులకు తరలివెళ్లిన అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు భగభగలాడుతున్న మండుటెండల్లో నానా అవస్థలు పడ్డారు. ఇలా ఎండలకు తాళలేక వడదెబ్బతో ముగ్గురు మృత్యువాత పడగా మరొకరు పెన్షన్ ఎలా తెచ్చుకోవాలో తెలీక చింతిస్తూ మరణించారు. వివరాలివీ.. చిత్తూరులో జిల్లాలో స్పృహతప్పి.. చిత్తూరు జిల్లా కార్వేటినగరం పరిధిలోని పద్మసరస్సు ఎస్టీ కాలనీకి చెందిన చిన్నముత్తయ్య (గోపాలయ్య) మామిడి తోటలో కాపలాదారు. పింఛన్ కోసం బ్యాంకుకు వెళ్లి తిరిగి వస్తుండగా జీలగల్లు ప్రాంతంలో ఎండ వేడికి తాళలేక స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పెన్షన్ కోసం చింతిస్తూ.. ఇన్నాళ్లూ ఇంటికే వచ్చిన పింఛన్ సొమ్ము బ్యాంకులో జమకావడంతో ఎలా తెచ్చుకోవాలో తెలీక శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెమళ్లదిన్నె ఎస్టీ కాలనీకి చెందిన రాగి తిరుపాలమ్మ (75) చింతిస్తూ గురువారం మృతిచెందింది. తిరుపాలమ్మ బుధవారం పింఛను డబ్బుల కోసం సచివాలయం వద్దకు వెళ్లగా బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు సమాచారం ఇచ్చారు. కానీ, డబ్బులు చేతికి అందలేదనే దిగులుకు తోడు ఆ డబ్బుల్ని ఎలా తెచ్చుకోవాలో తెలీక చింతిస్తూ తెల్లవారుజామున ప్రాణాలు విడిచింది. పింఛను తీసుకున్న పది నిమిషాలకే వడదెబ్బ.. అన్నమయ్య జిల్లా పెనగలూరుకు చెందిన బుజ్జమ్మ (60) బ్యాంకులో పింఛన్ తీసుకుని ఇంటికి బయల్దేరుతుండగా ఎండవేడిమి తాళలేక దారిలోనే కుప్పకూలింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించింది. బ్యాంకు బయటే కుప్పకూలి.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొటాలకు చెందిన వెంకట నాగులు (72) తన ఖాతాలో పింఛను డబ్బులు జమకావడంతో ఏ.రంగంపేటలోని బ్యాంకుకు వెళ్లాడు. ఎండ వేడిమికి తట్టుకోలేక బ్యాంకు వెలుపలగుండెపోటుతో కుప్పకూలిపడిపోయాడు. తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
Telangana: ఆసరా ఆలస్యం.. కొన్ని జిల్లాల్లో రెండు మూడు నెలలు కూడా!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఆసరా ఆలస్యమవుతోంది. పింఛన్ల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ప్రతినెలా మొదట్లోనే అందాల్సిన సొమ్ము కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. కొన్ని జిల్లాల్లో రెండు మూడు నెలలు ఆలస్యంగా పింఛన్ డబ్బులు ఇస్తుంటే.. మరికొన్ని చోట్ల మరింత ఆలస్యంగా చెల్లింపులు జరుగుతున్నాయి. దీనితో పింఛన్‌పై ఆధారపడి బతుకీడుస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు. మందులు, ఇతర నెలవారీ అవసరాలు తీరక అవస్థల పాలవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లబ్ధిదారుల్లో కొందరికి పోస్టాఫీస్ ద్వారా, మరికొందరికి బ్యాంక్ అకౌంట్ల ద్వారా పింఛన్ సొమ్ము అందుతుంది. దీనితో పలు ప్రాంతాల్లో వృద్ధులు పింఛన్ సొమ్ము జమ అయిందో, లేదో తెలుసుకునేందుకు పోస్టాఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తగా మంజూరు చేసినా.. రాష్ట్రంలో ఆసరా పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవీ, ఫైలేరియా బాధితులు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికుల కేటగిరీల్లో మొత్తంగా 35,95,675 మందికి పింఛన్లు అందేవి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా మరింత మందికి పింఛన్లు మంజూరు చేసింది. వృద్ధాప్య పింఛన్ వయసును 57 ఏళ్లకు తగ్గించడంతో మరో 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పటికే వివిధ కేటగిరీల పింఛన్ కోసం వచ్చిన మరో 3 లక్షల దరఖాస్తులు కలిపి.. మొత్తంగా 14 లక్షల దరఖాస్తులు అయ్యాయి. ఇందులో ప్రభుత్వం ఇటీవల కొత్తగా 9.38 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసింది. దీనితో మొత్తంగా లబ్ధిదారుల సంఖ్య అక్టోబర్ చివరినాటికి 44,14,915 మందికి చేరింది. మరో 4.6 లక్షల మంది పింఛన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు. అందక.. మంజూరుగాక.. తెలంగాణ ఏర్పడే నాటికి నెలకు రూ.200గా ఉన్న పింఛన్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు రూ.3,016కు.. వృద్ధులు, వితంతువులు ఇతర కేటగిరీల్లో రూ.2,016కు పెంచింది. దీనితో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపశమనం కలిగింది. నెలవారీ మందులు, నిత్యావసరాలకు కష్టం తీరింది. కానీ ఇటీవల ఆసరా పింఛన్ల సొమ్ము అందడంలో జాప్యం జరుగుతుండటంతో ఇబ్బంది మొదలైంది. వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించినా.. ఆ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నవారిలో కొన్ని లక్షల మందికి ఇంకా మంజూరు కాలేదు. మంజూరు అయినవారిలోనూ కొందరికి పింఛన్ సొమ్ము అందడం లేదని వాపోతున్నారు. వృద్ధుల వేలిముద్రలు అరిగిపోవడం, బ్యాంకు ఖాతాల్లో మార్పులు, ఆధార్‌తో అనుసంధానం వంటి సమస్యలతోనూ పింఛన్లు సరిగా అందని పరిస్థితి నెలకొంది. ఆసరా పింఛన్ల పంపిణీలో జాప్యం, ఇతర అంశాలపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ సమస్యలను గుర్తించింది. పలు జిల్లాల్లో సమస్యలివీ.. ► సూర్యాపేట జిల్లాలో గత ఐదు నెలలుగా 25వ తేదీ తర్వా పింఛన్ల సొమ్ము అందుతోంది. అక్టోబర్ పింఛన్ సొమ్ము ఇప్పటికీ అందలేదని లబ్ధిదారులు చెప్తున్నారు. 57 ఏళ్లు దాటినవారి వృద్ధాప్య పింఛన్ల కోసం 30వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. కొత్తగా మంజూరైన వారిలోనూ కొందరికి సొమ్ము రావడం లేదు. ► కరీంనగర్ జిల్లాలో కొత్తగా పింఛన్ మంజూరైన వారిలో 4 వేల మంది వరకు ఇంకా సొమ్ము అందడం లేదు. ఇదేమిటంటే వివరాలు అసమగ్రంగా ఉన్నాయని, మీసేవ వాళ్లు తప్పుగా నమోదు చేశారని చెప్తూ అధికారులు చేతులు దులుపుకొంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ► ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4,61,988 మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. కొత్తగా వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో వేల మంది ఇంకా మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. మంజూరైన పింఛన్లలోనూ బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్, ఇతర సమస్యలతో కొందరిని పింఛన్ సొమ్ము అందడం లేదు. ఇక భార్యాభర్త ఇద్దరికీ పెన్షన్ ఉండటం, సొంత ఇళ్లు, వాహనాలు ఉండటం వంటి కారణాలతో కొందరి పింఛన్లను తొలగించారు. ► ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పింఛన్ సొమ్ము ఆలస్యంగా అందుతోందని లబ్ధిదారులు చెప్తున్నారు. అర్హత ఉన్నా తమకు మంజూరుకావడం లేదని వాపోతున్నవారు వేలలో ఉన్నారు. గోస పడుతున్నం ఈమె పేరు భూతం రాములమ్మ. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కోటపహాడ్ గ్రామం. వయసు 85ఏళ్లు. భర్త, పిల్లలు ఎవరూ లేరు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆసరా పింఛనే దిక్కు. ఈ సొమ్ము నెల నెలా సమయానికి అందడం లేదని, ఖర్చుల కోసం ఇబ్బంది అవుతోందని ఆమె వాపోతోంది. ప్రతీ నెల మొదటివారంలో పింఛన్ పంపిణీ చేయాలని కోరుతోంది. మంజూరై రెండు నెలలైనా.. ఈ వ్యక్తి పేరు సంక రాజేందర్. జగిత్యాల జిల్లా సిరికొండ గ్రామం. కిడ్నీ వ్యాధి బాధితుడు. రెండు నెలల కింద డయాలసిస్ కేటగిరీలో పింఛన్ మంజూరైంది. గుర్తింపు కార్డు సైతం ఇచ్చారు. కానీ ఇప్పటివరకు పింఛన్ డబ్బులు రావడం లేదని వాపోతున్నాడు. -
మూడు వారాలు గడిచినా అందని ‘ఆసరా’
సాక్షి, నెట్వర్క్: ఈ నెల ‘ఆసరా’ లేక పింఛన్‌దారులు ఆగమాగమవుతున్నారు. పింఛన్ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియని అయోమయంలో ఉన్నారు. మందులు కొనలేకపోతున్నారు. నిత్యవసరాలు సమకూర్చుకోలేకపోతున్నారు. ప్రతినెలా మొదటి వారంలోనే చేతికందే ‘ఆసరా’పెన్షన్ ఈ సారి మూడు వారాలు గడిచినా ఇంకా జాడలేదు. గతంలో ఎప్పుడూలేని రీతిలో ఈసారి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఆందోళన చెందుతున్నారు. పెన్షన్ డబ్బులు వస్తాయన్న ధీమాతో కొడుకులు, కూతుళ్లకు దూరంగా ఉంటున్న వృద్ధులు, వితంతువులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి రోజూ పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే తాము ఫైనాన్స్ విభాగానికి నివేదించామని, వారు క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. ఎదురుచూపుల్లో 38 లక్షల మంది... ఆసరా పింఛన్ కింద ప్రతి నెలా ఆయా వర్గాలకు ప్రభుత్వం 2,016 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఆగస్టు నెల కింద అందాల్సిన పెన్షన్ డబ్బుల కోసం 38 లక్షల 71 వేల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వీవర్స్, హెచ్ఐవీ బాధితులు, బోదకాలు బాధితులు ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అయినవారికి దూరంగా ఉంటున్నవారే. ఇంకా పలువురు చిన్నారుల సంరక్షణ బాధ్యతలను చూస్తున్న వారూ ఉన్నారు. మస్తు ఇబ్బంది అవుతోంది చిల్లర ఖర్సులకు మస్తు ఇబ్బంది పడుతున్న. రోజూ పోస్ట్ ఆఫీస్‌కు వచ్చి పోతున్న. ఇప్పుడు, అప్పుడు అంటున్నరు. ఎప్పుడు ఇస్తారో ఏమో. మస్తు ఇబ్బంది అవుతుంది. – అమ్రు, హజీపూర్, కామారెడ్డి జిల్లా పింఛన్ రాక మస్తు ఇబ్బంది పడుతున్నాం. ఆఫీసర్లను అడిగితే రేపు మాపంటున్నరు. ఇంతకు ముందు ఆరో తారీఖు ఇస్తుండిరి. ఇప్పుడు పదిహేను రోజులైనా అస్తలేవు. – రుక్కవ్వ, సోమార్పేట్, కామారెడ్డి జిల్లా -
బంధువని నమ్మితే.. భర్త పెన్షన్ కొట్టేశాడు ..
సాక్షి, సైదాబాద్(హైదరాబాద్): బంధువని నమ్మి చనిపోయిన భర్తకు రావాల్సిన పెన్షన్ పనులు అప్పగించిన వృద్ధురాలినే మోసం చేశాడు ఓ ఘనుడు. విషయం పసిగట్టిన బాధితురాలు బుధవారం సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిస వివరాల ప్రకారం... సైదాబాద్‌కు చెందిన సర్వారీ బేగం ప్రస్తుతం నిజామాబాద్‌లోని తన కూతురు ఇంట్లో ఉంటోంది. ఆమె భర్త ఎంఏ. సత్తార్ హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ 2006 నవంబర్‌లో మృతి చెందాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త చనిపోవటంతో అతనికి రావాల్సిన పెన్షన్ తదితర బెనిఫిట్స్ మంజూరు చేయించే పనులను బంధువైన అబ్దుల్ హక్ అలీంకు అప్పగించింది. అయితే అతను ఆ పనులు చేయిస్తానని నమ్మబలికి ఆమె నుంచి కొన్ని తెల్ల కాగితాలు, స్టాంప్ పేపర్ల మీద వేలిముద్రలు తీసుకున్నాడు. అయితే ఇటీవల తన భర్తకు రావాల్సిన రూ.14 లక్షల పెన్షన్ మంజూరు అయ్యాయని వాటిని తన బంధువు అబ్దుల్ ఆమె వేలిముద్రలు వేసిన కాగితాల సహాయంతో తన ఎకౌంట్లోకి వేసుకున్నాడని తెలిసింది. అంతేకాకుండా తానే అబ్దుల్‌కు రూ.8.90 లక్షలు అప్పుగా ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించాడని పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యువతిని పెళ్లి చేసుకుంటానని కానిస్టేబుల్ మోసం -
మామ పింఛన్ డబ్బుల కోసం భర్తను..
రెబ్బెన(ఆసిఫాబాద్): భర్తకు కష్టసుఖాల్లో తోడుగా ఉండాల్సిన భార్యే తన పాలిట మృత్యువుగా మారింది. మామ పింఛన్ డబ్బుల కోసం భర్తతో గొడవపడి చివరికి కొడవలితో భర్త గొంతు కోసి హతమార్చింది. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి మండలంలోని రోళ్లపాడులో చోటుచేసుకుంది. ఎస్సై దీకొండ రమేష్ వివరాల ప్రకారం... చింతకుంట్ల శ్రీను(30), అంజలి అలియాస్ స్వప్న భార్యాభర్తలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఏడేళ్ల కొడుకు తిరుపతి, ఐదేళ్ల కూతురు సువర్ణ ఉన్నారు. భార్యాభర్తలకు మద్యం సేవించే అలవాటుతో బానిసలుగా మారారు. కూలీ పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో మద్యం సేవించి తరుచుగా గొడవ పడేవారు. ఈ క్రమంలో మంగళవారం శ్రీను తండ్రి పోచయ్యకు పింఛన్ డబ్బులు వచ్చాయి. తండ్రి వద్ద నుంచి రూ.600 కొడుకు శ్రీను అడిగి తీసుకున్నాడు. సాయంత్రం ఆ విషయం భార్యకు తెలియటంతో డబ్బుల కోసం ఇద్దరి మధ్య గొడవైంది. ఆ డబ్బులు తన వద్ద లేవని, ఖర్చు చేశానని శ్రీను చెప్పడంతో కోపంతో రగిలిపోయింది. మంచంపై నిద్రిస్తున్న భర్తను అర్ధరాత్రి కొడవలితో గొంతుకోసింది. దీంతో శ్రీను కేకలు వేయడంతో పక్క షెడ్డులో నిద్రిస్తున్న తండ్రి పోచయ్య ఇంట్లోకి వచ్చేసరికి స్వప్న పారిపోయింది. శ్రీను మెడపై రెండు, ఎడమ చెంపపై, చెవి కింది భాగంలో, ఎడమ రొమ్ముపై భాగంలో తీవ్రగాయాలై మృతి చెందాడు. బుధవారం విషయం తెలుసుకున్న రెబ్బెన సీఐ ఆకుల అశోక్, ఎస్సై రమేష్ సంఘటనా స్థలానికి చేసుకుని విచారణ చేపట్టారు. శ్రీను తండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తల్లీదండ్రులు దూరం కావడంతో వారి పిల్లలు అనాథులుగా మారారు. కళ్ల ఎదుటే విగతజీవిగా పడిఉన్న తండ్రి మృతదేహం వద్ద చిన్నా రుల రోదన స్థానికులను కంటతడి పెట్టించాయి. -
మంచాన పడ్డ తల్లిని బ్యాంకుకు లాక్కెళ్తూ..
ఒడిశా: తన తల్లి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన నగదు తీసుకునేందుకు మంచాన పడ్డ తల్లిని ఓ మహిళ బ్యాంకు వరకు లాక్కెళ్లింది. ఈ విషాద ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నౌపారా జిల్లాకు బార్గావున్‌కు చెందిన పుంజీమతి దేవి తల్లి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం రూ.1500 జమ చేసింది. ఈ మొత్తాన్ని తీసుకునేందుకు సదరు మహిళ జూన్ 9న ఉత్కల్ గ్రామీణ బ్యాంకుకు వెళ్లింది. అయితే ఖాతాదారు ఉంటేనే డబ్బులు ఇస్తామని బ్యాంకు మేనేజర్ అజిత్ ప్రధాన్ తేల్చి చెప్పాడు. (హృదయ విదారకం : స్నేహితుడికి గుర్తుగా) దీంతో ఆమె గత్యంతరం లేని పరిస్థితిలో మంచాన పడ్డ వందేళ్ల వయసున్న తల్లిని బ్యాంకు వరకూ లాక్కుంటూ వెళ్లింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మధుస్మిత సాహో స్పందిస్తూ... "బ్యాంకు మొత్తాన్ని ఒకరే నిర్వహిస్తున్నారు. అందువల్ల అదే రోజు ఆమె ఇంటికి వెళ్లడం బ్యాంకు మేనేజర్‌కు కుదరలేదు. కాబట్టి తర్వాతి రోజు బ్యాంకు సదరు మహిళ ఇంటికి వస్తానని భరోసా ఇచ్చాడు. కానీ ఆమె వినిపించుకోకుండా తల్లిని మంచంలో వేసి లాక్కుని వెళ్లింది" అని తెలిపారు. ఎట్టకేలకు ఆమె డబ్బులు విత్‌డ్రా చేసుకుందని తెలిసింది. (3 లక్షల జన్‌ధన్ ఖాతాల నుంచి డబ్బులు వెనక్కి) -
ఫించన్ డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై దాడి
-
అర్థిస్తే ఆలకించలేదు.. తానే రంగంలోకి దిగాడు..!
భువనేశ్వర్ : కియోజంర్ జిల్లాలోని సలంది నదిపై బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు దశాబ్దాలుగా మొరపెట్టుకున్నా స్పందించలేదు. ఇక జిల్లా యంత్రాంగం పని మొదలు పెట్టి.. మధ్యలోనే నిలిపేసింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఓ రిటైర్డ్ ఉద్యోగి తానే నడుం బిగించాడు. తన పీఎఫ్ డబ్బులను వెచ్చించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాడు. అదిప్పుడు చివరి దశకు చేరుకుంది. రూ. 10 లక్షలు ఖర్చు చేసి బ్రిడ్జిని నిర్మాణాన్ని చేపట్టానని వెటర్నరీ విభాగంలో పనిచేసి రిటైర్డ్ అయిన గంగాధర్ రావత్ చెప్పుకొచ్చారు. మరో రెండు లక్షలు ఖర్చుచేసి జూలై చివరి వరకు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘వర్షా కాలం వస్తే చాలు హటాదిది బ్లాక్‌తో నది ఇవతల ఉన్న పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. స్థానికులు వెదురు బొంగులతో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక వంతెనపైనుంచే నడక సాగించాలి. అది ప్రమాదకరం. కాంక్రీట్ బ్రిడ్జి నిర్మించాలని రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. పదేళ్ల క్రితం జిల్లా అధికారులు బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. మధ్యలోనే నిలిపేశారు. స్థానికంగా కూడా ఎలాంటి స్పందనా లేదు. ఇక లాభం లేదనుకుని బ్రిడ్జిని పూర్తి చేయడానికి నేనే పూనుకున్నాను. నా కుటుంబం కూడా నాకు అండగా నిలిచింది. గత మార్చి నుంచి నిర్మాణ పనులు సాగుతున్నాయి. మరో నెలలో బ్రిడ్జిని పూర్తి చేస్తా’ అని పెద్దాయన ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. ఈ వార్తపై జిల్లా కలెక్టర్ ఆశిస్థాకర్ స్పందించారు. బ్రిడ్జి పనులను తాము చేపడతామని వెల్లడించారు. అయితే, పూర్తి కావొచ్చిన బ్రిడ్జి నిర్మాణానికి సాయం చేసే బదులు.. వాహనాల రాకపోకలకు మరో రోడ్డు నిర్మించాలని గంగాధర్ కోరుతున్నారు. -
ఎంతపని చేశావురా మనవడా..!
అసలే పండుటాకు. వృద్ధాప్యం తెచ్చిన అనారోగ్య సమస్యలకు పింఛను డబ్బులే ఆమెకు ఆధారం. అయితే, మూడు నెలలుగా ఆమెకు తెలియకుండా పింఛను కాజేశాడో ప్రబుద్ధుడు. దీనిపై ప్రశ్నించినందుకు ఏకంగా ఆమెను చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రి పాలైంది. ఇంతకూ ఆ ప్రబుద్ధుడెవరో కాదు..సాక్షాత్తు ఆమె మనవడే.!! ఈ సంఘటన బొమ్మనచెరువు తాండాలో చోటుచేసుకుంది. చిత్తూరు, మదనపల్లె టౌన్ : మండలంలోని బొమ్మనచెరువు తాండాకు చెందిన పెద్దిరెడ్డెప్ప నాయక్ భార్య పీకమ్మ(80)కు ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ ఇస్తోంది. ఈ సొమ్మును మూడు నెలలుగా ఆమె మనవడు గణేంద్రనాయక్ (22) కాజేస్తూ వస్తున్నాడు. ఇది ఆమెకు తెలియదు. తనకు పింఛను అందకపోవడంపై పీకమ్మ కార్యదర్శిని నిలదీసింది. నీ మనవడే తీసుకెళ్తున్నాడని కార్యదర్శి చెప్పడంతో ఆమె మనవడిని నిలదీసింది. ఆగ్రహించిన అతడు ‘అన్నం పెడుతున్నాం కదా!.. డబ్బులు నీకెందుకు?’ అంటూ ఎదురుతిరిగాడు. ఆమె దూషించడంతో కర్రతో చితకబాది తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలిని స్థానికులు చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పింఛనులో కాకినాడ జమ్మభూమి కమిటీ కనిషన్
-
పెన్షన్ కోసం కన్న తండ్రిని..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మీర్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెన్షన్ డబ్బుల కోసం ఓ యువకుడు కన్న తండ్రిని అతి కిరాతకంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళ్తే.. మీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో నివాసం ఉంటున్న కృష్ణ వాటర్ బోర్డ్‌లో పనిచేసి.. ఆరు నెలల క్రితం పదవి విరమణ పొందాడు. నెలవారి పెన్షన్ డబ్బులతో జీవనం సాగిస్తున్న కృష్ణతో అతడి కుమారుడు తరుణ్ తరుచు గొడవపడుతుండేవాడు. పెన్షన్ డబ్బులు తనకు ఇవ్వాల్సిందిగా తండ్రిపై ఒత్తిడి చేసేవాడు. అయిన కృష్ణ డబ్బులు ఇవ్వకపోవడంతో.. తండ్రిపై పగ పెంచుకున్న తరుణ్.. అతనిపై ఇనుప రాడుతో దాడికి దిగాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ కృష్ణను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్టుగా తెలిపారు. దీంతో కృష్ణ మృతదేహాన్ని తిరిగి ఇంటికి తీసుకువచ్చిన కుటుంబసభ్యులు బంధువులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నారు. -
‘ఆసరా’కు బ్రేక్
మోర్తాడ్ /బాన్సువాడ :పెద్దనోట్లు రద్దుతో ఏర్పడిన కష్టాలు ఆసరా పింఛన్ లబ్ధిదారులనూ వెంటాడుతున్నాయి. రూ. 500, రూ. యి నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ నెలకు సంబంధించిన ఆసరా పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. పింఛన్లను లబ్ధిదారులకు చెల్లించడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కానీ బ్యాంకుల్లో కొత్త రూ. 2 వేల నోట్లు మాత్రమే లభిస్తుండడంతో ఆసరా పింఛన్లు ఎలా పంపిణీ చేయాలో అధికారులకు అర్థం కావడం లేదు. తపాలా శాఖ అధికారులు బ్యాంకుల నుంచి డబ్బును డ్రా చేయగా బ్యాంకర్లు మొత్తం రూ. 2 వేల నోట్లను అందించారు. వికలాంగులకు రూ. 1500 ఇస్తుండగా, ఇతర లబ్ధిదారులకు రూ. వెయి చొప్పున పింఛన్ ఇస్తారు. తపాలా శాఖ వద్ద రూ. 2 వేల నోట్లు మాత్రమే అందుబాటులో ఉండడంతో ఇద్దరు లబ్ధిదారులకు కలిపి ఒక నోటు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. పింఛన్ డబ్బును చిల్లర విడిపించుకుని లబ్ధిదారులు పంచుకోవాలని సూచించాలని అధికారులు భావించారు. అయితే ఈ విధానం వల్ల పింఛన్ లబ్ధిదారుల మధ్య వివాదం తలెత్తే అవకాశం ఉందని భావించిన అధికారులు పింఛన్ల పంపిణీని జిల్లా వ్యాప్తంగా నిలిపివేశారు. డ్రా చేసిన సొమ్మును మళ్లీ బ్యాంకులోనే డిపాజిట్ చేయాలని తపాల శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. బ్యాంకులకు రూ.100 నోట్లు, కొత్త రూ. 500 నోట్లు చేరిన తర్వాతే ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. బ్యాంకులకు చిన్న నోట్లు సరఫరా కావడానికి మరో వారం, పది రోజుల సమయం పడుతుంది. దీంతో అప్పటి వరకు లబ్ధిదారులు ఆగాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. పింఛన్లకు సరిపడా మంజూరు కాని సొమ్ము జిల్లాలోని ఆసరా పింఛన్ల లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా సొమ్మును ప్రభుత్వం మంజూరు చేయలేదని తెలిసింది. లబ్ధిదారుల సంఖ్యలో 30 శాతం మందికి మాత్రమే సొమ్ము అందేలా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మోర్తాడ్ తపాల శాఖ పరిధిలోని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయడానికి రూ. 30 లక్షలు అవసరం కాగా రూ. 6 లక్షలను మాత్రమే విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 63,924 మంది వృద్ధులు, 18,855 మంది వికలాంగులు, 66,216 మంది వితంతువులు, 206 మంది చేనేత కార్మికులు, 1,007 మంది గీత కార్మికులు, 77,346 మంది బీడీ కార్మికులు, 1,731 మంది కళాకారులు ఆసరా పింఛన్లను పొందుతున్నారు. వీరందరికి పింఛన్ల కోసం రూ. 23.87 కోట్లు అవసరం ఉంటుంది. అందులో తక్కువ మొత్తమే ప్రభుత్వం విడుదల చేయడంతో తపాల శాఖ కార్యాలయాలకు తక్కువ నిధులు అందారుు. ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో పింఛన్లు మంజూరు చేసి, చిన్న నోట్లను అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి జిల్లాలో వృద్ధాప్య పింఛన్లు 48,750, వికలాంగులకు 17,032, వితంతు 625, గీత కార్మికులకు 662, బీడీ కార్మికులకు 28,705, కళాకారులకు 903, మొత్తం లక్షా 43వేల 590 పింఛన్లు ప్రతినెలా అందజేస్తున్నారు. ప్రతినెలా 15లోపు చెల్లింపులు పూర్తవుతాయి. కానీ ఈ సారి పెద్ద నోట్ల రద్దు ప్రభావం కారణంగా పింఛన్ల డబ్బులు అందలేదు. -
‘ఆసరా’ డబ్బు కాజేసిన పోస్టుమన్
♦ దాదాపు రూ. 2 లక్షలు మింగేసిన వైనం ♦ లబోదిబోమంటున్న లబ్ధిదారులు ♦ పోలీసులకు ఫిర్యాదు ఇబ్రహీంపట్నం రూరల్: వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు ఇవ్వాల్సిన పింఛన్ డబ్బులు రూ. 2 లక్షలను ఓ పోస్టుమన్ కాజేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందిం ది. వివరాలు.. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఉప్పరిగూడ, పోచారం , కర్ణంగూడ గ్రామాల్లో మండల కేంద్రానికి చెందిన పోస్టుమన్ యాదగిరి పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఉప్పరిగూడలో సుమా రు 300 పింఛన్లు, పోచారంలో 285 పెన్షన్లు, కర్ణంగూడలో మరికొన్ని పింఛన్లు బాధితులకు ఇవ్వాల్సి ఉంది. ఉప్పరిగూడలో 50 మంది లబ్ధిదారులకు మూడు, నాలుగు నెలల డబ్బులు, పోచారంలో 30 మందికి పింఛన్ ఇవ్వలేదని పలుమార్లు అయా గ్రామాల సర్పంచ్‌లు పోస్టుమన్ యాదగిరిని మందలించారు. దీంతో ఆయన ఉప్పరిగూడలో 30 మందికి ఇటీవల డబ్బులు పంపిణీ చేశాడు. పోచారంలో 20 మందికి పైగా రెండు, మూడు నెలల డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఈరోజు, రేపు డబ్బులు ఇస్తానని యాదగిరి తప్పించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా, గత నా లుగు రోజులుగా పోస్టుమన్ కనిపించకుం డా పోయాడు. అతడి సెల్‌ఫోన్‌కు కాల్ చేయగా స్విఛాఫ్ వస్తోంది. సూమారు రూ.2 లక్షలకు పైగానే పోస్టుమన్ యాదగిరి డబ్బులు కాజేశాడని బాధితులు ఆరోపించారు. అయితే, పోచారం గ్రామానికి చెందిన కావలికారు రమేష్ వద్ద రూ.30 వేలతో పాటు అతడి బైక్ తీసుకొని వెళ్లిన యాదగిరి ఆచూకీ లేకుండా పోయింది. దీంతో పోస్టాఫీస్ అధికారులు, కావలికారు రమేష్‌తోపాటు యాదగిరి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపడతాం ఆసరా పింఛన్లు అందలేదని.. పోస్టుమన్ యాదగిరి కాజేసినట్లు ఫిర్యాదులు అందాయని ఎంపీడీఓ అనిల్‌కుమార్ తెలిపారు. అతడు ఎంతమొత్తంలో డబ్బులు తీసుకున్నాడు.. అనే విషయాలు పూర్తిస్థాయిలో తెలియరాలేదని చెప్పారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ తెలిపారు. -
పెన్షన్లు వచ్చేశాయ్..
♦ రూ.37 కోట్లు విడుదల ♦ నేటి నుంచి పంపిణీ ♦ రెండ్రోజుల్లో ఖాతాల్లోకి డబ్బులు జోగిపేట: మార్చి నెల పెన్షన్ల డబ్బులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పంపిణీ చేసే పెన్షన్లు ఈనెల 29 వరకు పంపిణీ కాలేదు. దీంతో పెన్షన్‌దారులు చాలా ఇబ్బంది పడ్డారు. తాజాగా నిధులు విడుదల కావడంతో సదరు డబ్బును ఆయా ఖాతాదారుల ఖాతాల్లోకి సోమవారం వేసినట్లు డీఆర్డీఏ ఏపీఓ (పెన్షన్) విజయలక్ష్మి వెల్లడించారు. నిజానికి ప్రతి నెల మొదటి, రెండు వారాల్లోనే ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేసేది. గ్రామాల్లో లబ్ధిదారులు ప్రజాప్రతినిధులు, గ్రామ కార్యదర్శులు, పట్టణాల్లో నగర పంచాయతీ కమిషనర్లు, చెర్మైన్ల చుట్టూ గత 20 రోజులుగా తిరుగుతూనే ఉన్నారు. రోజూ పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,36,072 వితంతు, వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లు ఉన్నాయి. వీరికి బ్యాంకులు, పోస్టాఫీసులు, మాన్యువల్ పద్ధతిన పంపిణీ చేసేవారు. వృద్ధులకు, వితంతువులకు, గీత, చేనేత కార్మికులకు రూ.వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.1500 చొప్పున అందచేస్తున్నారు. లబ్ధిదారులకు ఈ డబ్బులే ప్రధాన ఆదరువు అవుతున్నాయి. పంపిణీలో ఏమాత్రం జాప్యమైనా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై డీఆర్డీఏ ఏపీఓ విజయలక్ష్మిని వివరణ కోరగా మార్చి నెల పింఛన్ల సొమ్మును సోమవారం విడుదల చేశామని, ఆయా ఖాతాలకు ఇవి చేరుతాయని చెప్పారు. జిల్లాకు పెన్షన్ల నిమిత్తం ప్రతి నెల రూ.37 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి మంగళ, బుధవారాల్లో పడతాయని, గ్రామాల్లో కూడా పంపిణీ చేస్తారన్నారు. -
నీ బాంచెన్.. సుశీల!
♦ అదే పరమాన్నం.. పేదోళ్ల ఫుడ్డుగా పేరు ♦ వృద్ధులు, పిల్లల ఆదరువు ♦ కడుపు నింపుతోన్న సాత్విక ఆహారం ♦ పింఛన్ డబ్బులతో సుశీలతోనే జీవనం ♦ తయారీ సులువే.. ఖర్చూ తక్కువే.. ♦ ఖేడ్‌లో రుచి చూసిన అమాత్యులు ఉన్న ఊర్లో ఉపాధి దొరక్క కన్న బిడ్డలు వలస పక్షులయ్యారు.. ఈడు ముదిరి.. నెత్తురు సచ్చిపోయిన అవ్వాఅయ్యలను ఇంటికొదిలేసి ఎల్లలు దాటి వెళ్లిపోయారు. వలస వెళ్లి చేసిన రెక్కల కష్టానికి గుత్తేదారిలెక్కలు కట్టి, అసలు, అప్పు పట్టుకొని మిగిలిన పైకం చేతుల పెడి తే... అర్ధాకలితో కాలం వెళ్లబోస్తున్నారు కూలీ లు. ఈ దశలో ఇంటి దగ్గర అవ్వాఅయ్యల ఊసే మరిచారు. కన్న కొడుకు పంపుతాడని... కడుపు నిండా తింటామనే ఆశ పండుటాకుల్లో రోజురోజుకు సచ్చిపోతోంది. ఈ సమయంలో ఇక్కడి వృద్ధులను ‘సుశీల’అమ్మైఆదరిస్తోంది. వలసలతో వల్లకాడైన నారాయణఖేడ్ పల్లెల్లో సుశీలే పరమాన్నం. రూ.1,000 పింఛన్‌తో పండుటాకులు సుశీల తిని బతుకుతున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నారాయణఖేడ్ అంటేనే వలసలు. పాల మూరు తరువాత రాష్ట్రంలోనే ఎక్కువ మంది వలసలు పోయే ప్రాంతం. ఇక్కడి నుంచి ఏటా 40 వేల మంది కూలీలు వలస పోతుంటారని అంచనా. ఏళ్లకేళ్లుగా పాలకుల నిర్లక్ష్యంతో సగ టు మనుషుల జీవన ప్రమాణాలు పూర్తిగా అడుగంటిపోయాయి. పల్లెల్లో సాగు భూమి ఉన్నా.. నీళ్లు లేక సాగు చేసుకునే పరిస్థితి లేదు. పిల్లలు డిగ్రీలు చేసినా... స్థానికంగా ఉపాధి అవకాశాలులేక పట్నం బాటపట్టారు. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా కనీసం తాగు నీరు దొరకదు. అటు తిండిలేక, ఇటు నీళ్లు దొరక్క వలస వెళ్లాల్సిన పరిస్థితులు పల్లెల్లో కన్పించాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో యువకులు తమ ముసలి తల్లిదండ్రులను, పిల్లలను ఇంటి వద్దే వదిలేసి పోతున్నారు. కంగ్టి, కల్హేర్, మనూరు మండలాల్లోని గిరిజన తండాలు, దళిత కాలనీ లన్నీ వలసపోయాయి. చేతగాని వృద్ధులు మాత్రమే పిల్లలను పట్టుకొని ఇంటి వద్ద ఉన్నారు. పని దొరకగానే డబ్బు పంపిస్తామని చెప్పి వెళ్లిపోయిన బిడ్డలు నెలలు గడుస్తున్నా రూపాయి కూడా పంపకపోవడంతో పండుటాకులు, పసిపిల్లలు ఆకలికి అలమటిస్తున్నారు. ఇక్కడ సుశీలే టాప్... ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రూ.వెయ్యి పింఛన్, ఈ ప్రాంతంలో ప్రాచూర్యంలో ఉన్న సరళ ఆహారం సుశీల వారి కడుపు నింపుతోంది. పండ్లూడిన బోసి నోరు నమలడానికి సులువుగా ఉండి, అత్యంత చౌకగా పేదలకు అందుబాటులో ఉంటోంది. పొయ్యి మంట కూడా వెలిగించ లేని వృద్ధులు సుశీలతోనే కాలం నెట్టుకొస్తున్నారు. మురమురాలను(బొరుగు పేలాలు) నీళ్లలో తడిపి దానికి కొంత పోసు వేస్తే సుశీల సిద్ధమవుతుంది. రూ.10 ఖర్చుతోనే రోజు గడిచిపోతోం ది. సలువుగా జీర్ణం అవుతుంది. దీనికి రూ.2 కిలో బియ్యం కూడా తోడుకావటంతో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆకలి చావులు లేవని చెప్పొచ్చు. నేతల దృష్టికొచ్చిన సుశీల... ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదరరాజనర్సింహ, సునీతారెడ్డి, జగ్గారెడ్డి తదితరులు పల్లెల్లో తిరుగుతున్నారు. నేతలు పల్లెల్లో తిరుగుతోన్న సమయంలో పల్లెజనం సుశీల తిని బతుకుతున్నాం అని చెప్పడంతో నేతలకు సుశీల మీద ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మె ల్యే రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి తదితరులతో కలిసి నారాయణఖేడ్‌లోని శంకరప్ప కొట్టులో సుశీల రుచి చూశారు. ‘నా అనుకున్న వాళ్ల ఆదరణ లేని పండుటాకులు పింఛన్ డబ్బుతో కనీసం రెండు పూటల సుశీలైనా తింటున్నారని సంతోష పడాలో లేక కనీస మౌలిక వసతులు లేక యువత ఉపాధి వెతుక్కుంటూ వృద్ధ తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి వలస పోయినందుకు బాధపడాలో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నాం’ అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. -
స్టాక్స్‌లోకి పెన్షన్ నిధులు..!
న్యూఢిల్లీ: దేశంలో స్టాక్ మార్కెట్లను మరింత బలోపేతం చేయాలంటే... పెన్షన్ నిధులను పెట్టుబడిగా పెట్టేందుకు అనుమతించాలని నియంత్రణ సంస్థ సెబీ కోరింది. స్టాక్స్ సంబంధ విభిన్న సాధనాల్లోకి ఈ నిధులు ప్రవహించేందుకు తగిన చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఆదివారమిక్కడ జరిగిన సెబీ బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తింది. బడ్జెట్ అనంతరం సెబీ బోర్డుతో జరిగిన ఈ భేటీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలోని స్టాక్ మార్కెట్ పరిస్థితిని ఆయన సమీక్షించారు. కాగా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు(రీట్స్) విజయవంతం కావాలంటే తగిన సానుకూల వాతావరణాన్ని కల్పించాలని కూడా సెబీ అభిప్రాయపడింది. భేటీలో సెబీ చైర్మన్ యూకే సిన్హా, ఎనిమిది మంది బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కూడా హాజరయ్యారు. స్టాక్ మార్కెట్‌కు సంబంధించి బడ్జెట్లో ప్రతిపాదించిన పలు ప్రతిపాదనలను ముందుకుతీసుకెళ్లడంపై సెబీతో ఈ సందర్బంగా జైట్లీ చర్చిం చారు. ప్రధానంగా కమోడిటీ మార్కెట్ నియంత్రణ సంస్థ(ఎఫ్ఎంసీ)ను సెబీలో విలీనం చేసి ఏకీకృత నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం తెలిసిందే. ఈ విలీనానికి సంబంధించి సెబీ సామర్థ్యాన్ని పెంచడం, తగిన మౌలిక వసతుల కల్పనపై చర్చించినట్లు జైట్లీ పేర్కొన్నారు. 2015-16 బడ్జెట్లో ప్రకటించిన చర్యలకు అనుగుణంగా తాము తీసుకున్న చర్యలను సెబీ చైర్మన్ యూకే సిన్హా వివరించారు. రీట్స్ ఏర్పాటుతో రియల్టీ కంపెనీలు నిధుల సమీకరణకు వీలుగా గతేడాది సెబీ కొత్త మార్గదర్శకాలను జారీ చేయడం తెలిసిందే. తాజా బడ్జెట్లో వీటికి పన్ను ప్రోత్సాహకాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. సెబీ ఇతర నిర్ణయాలు ఇవీ.. మొండిబకాయిల(ఎన్పీఏ)తో సతమతమవుతున్న లిస్టెడ్ కంపెనీల రుణ బకాయిలను బ్యాంకులు ఈక్విటీగా మార్పిడి చేసుకునేందుకు నిబంధనల సడలింపు. ఈ కీలక నిర్ణయం కారణంగా బ్యాంకులు రుణగ్రస్త కంపెనీల్లో మెజారిటీ వాటాలను చేజిక్కించుకొని... యాజమాన్య కార్యకలాపాలను తమచెప్పుచేతల్లో పెట్టుకోవడానికి వీలవుతుందని సిన్హా తెలిపారు. ఈ దీనివల్ల రుణాల పునర్వ్యవస్థీకరణ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. లిస్టెడ్ కంపెనీలు తమ బోర్డు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను 30 నిమిషాల్లోపు వెల్లడించాలి. సంబంధిత సమాచారాన్ని 24 గంటల్లోగా తప్పనిసరిగా అందరికీ తెలియజేయాలి. ఉల్లంఘించిన కంపెనీలపై భారీ జరిమానా సహా కఠిన చర్యలు.భారత్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం(ఐఎఫ్ఎస్సీ) ఏర్పాటుకు మార్గం సుగమం. ఈ సెంటర్లలో స్టాక్ ఎక్స్ఛేంజీలు, ఇతరత్రా క్యాపిటల్ మార్కెట్ సంబంధ మౌలిక సదుపాయాల కల్పనకు వీలుగా నిబంధనలు సడలిస్తూ కొత్త ఐఎఫ్ఎస్సీ మార్గదర్శకాలు జారీ. దీనిప్రకారం ప్రస్తుతం ఉన్న స్టాక్ ఎక్స్ఛేంజీలన్నీ తమ సబ్సిడరీలను ఐఎఫ్ఎస్సీలో నెలకొల్పేందుకు అనుమతిస్తారు. తొలి ఐఎఫ్ఎస్సీ గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఏర్పాటవుతోంది.స్టార్టప్ సంస్థ లిస్టింగ్, క్రౌడ్‌సోర్సింగ్ ద్వారా యువ ప్రారిశ్రామికవేత్తలు నిధులను సమకరించేందుకు త్వరలోనే కొత్త మార్గదర్శకాలు. మున్సిపల్ బాండ్ల జారీ, లిస్టింగ్‌కు ఓకే... పట్టణాల్లో మౌలిక రంగ ప్రాజెక్టులకు నిధుల సమీకరణ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్మార్ట్ సిటీల నిర్మాణానికి చేయూతగా మున్సిపల్ బాండ్ల జారీకి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ‘ముని బాండ్’ల జారీ, స్టాక్ మార్కెట్లో లిస్టింగ్.. ట్రేడింగ్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఆమోదించింది. మౌలిక రంగ అభివృద్ధి కార్యకలాపాల్లోకి ప్రజల పొదుపు నిధులను మళ్లించేలా చేయడమే ఈ బాండ్ల ప్రధానోద్దేశం. పటిష్టమైన ఆర్థిక పనితీరు కలిగిన మున్సిపాలిటీలు... స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్‌తో పాటు ఇతర అవసరాల కోసం ఈ ముని బాండ్ల జారీ ద్వారా ప్రజలు, సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ పెన్షన్ ఫండ్స్, సావరీన్ వెల్త్ ఫండ్స్ నుంచి నిధులను సమీకరించవచ్చని సిన్హా తెలిపారు. ఈ బాండ్లను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వీలుగా తగిన నిబంధనలను ఇందులో చేర్చినట్లు సిన్హా చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ స్థాయి పరపతి రేటింగ్‌తో పాటు ఇతరత్రా ప్రమాణాలను కలిగిఉండటంతోపాటు లిస్టయిన సెక్యూరిటీల పనితీరును పర్యవేక్షించేందుకు ఒక ఏజెన్సీ ఉంటుందని చెప్పారు. బాండ్లకు కనీసం మూడేళ్ల కాలపరిమితి ఉండాలి. ప్రాజెక్టు వ్యయంలో 20 శాతాన్ని బాండ్ల జారీ సంస్థ(మున్సిపాలిటీ) వెచ్చించాలనేది నిబంధనల్లో ప్రధానాంశం. బ్యాంకులు రుణ రేట్లను తగ్గించాలి: జైట్లీ నియంత్రణ అధికారాలకు కోత విషయంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)కి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయన్న వాదనలను ఆర్థిక మంత్రి జైట్లీ తోసిపుచ్చారు. తమ మధ్య(ప్రభుత్వం-ఆర్బీఐ) సమన్వయానికి సంబంధించి ఎలాంటి సమస్యలూ లేవని... ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయని స్పష్టం చేశారు. మరోపక్క, ఆర్బీఐ పరపతి విధానానికి అనుగుణంగా బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తాయన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. బడ్జెట్ అనంతరం ఆర్బీఐ బోర్డు సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి, మార్చి నెలల్లో వరుసగా రెండుసార్లు ఆర్బీఐ కీలక రెపో రేటును పావు శాతం చొప్పున తగ్గించినప్పటికీ.. బ్యాంకులు రుణ రేట్లను తగ్గించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, ప్రభుత్వ రుణ సమీకరణ నిర్వహణకు కేంద్రం ప్రతిపాదించిన ప్రత్యేక ఏజెన్సీ... ఆర్బీఐ లేదా ప్రభుత్వ నియంత్రణలో కాకుండా స్వతంత్రంగా ఉండాలని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు.. ద్రవ్యోల్బణం ధోరణిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. -
పింఛన్లు రెడీ.. లబ్ధిదారులేరీ..!
తాండూరు: అర్హత ఉన్నా జాబితాలో పేరు లేదని, తనకు పింఛన్ మంజూరు కాలేదని పలువురు పేదలు గగ్గోలు పెడుతున్నారు. ఆలస్యమైనా పింఛన్ వస్తుందనే ఆశతో మళ్లీమళ్లీ దరఖాస్తులు అందజేస్తున్నారు. అయితే తాండూరు మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పింఛన్ రాక జనాలు ఓవైపు లబోదిబోమంటుంటే ఇక్కడ దాదాపుగా రెండొందలకు పైగా లబ్ధిదారుల జాడ కనిపించడం లేదు. అలాగే ఒక పేరుపైనే డబుల్ పింఛన్లు మంజూరయ్యాయి. ఓ మృతి చెందిన వ్యక్తికి సైతం పింఛన్ మంజూరైంది. దీంతో మున్సిపల్ అధికారులు పింఛన్ డబ్బులు ఉన్నా పంపిణీ చేయలేని అయోమయంలో పడిపోయారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు మున్సిపాలిటీలో మొత్తం 8 రెవెన్యూ వార్డుల పరిధిలో 31 వార్డులు ఉన్నాయి. మొత్తం 5,051మంది వృద్ధులు, వికలాంగులు, వితంతు, చేనేత,కల్లుగీతకార్మికులకు పింఛన్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం రెండు విడతల్లో గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాలకు కలిపి మొత్తం కోటీ 4లక్షల 16వేల రూపాయలను విడుదల చేసింది. ఆయా వార్డుల్లో, మున్సిపల్ కార్యాలయంలో పలు దఫాలుగా జాబితా ప్రకారం లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందజేశారు. ఇలా ఈనెల 5వ తేదీ వరకు సుమారు 4,717మందికి రూ.98.92లక్షలను పంపిణీ చేయగా సుమారు రూ.5.24 లక్షలు ఇంకా పంపిణీ కాలేదు. 246 మంది పేర్లు జాబితాలో ఉన్నప్పటికీ.. వారు మొత్తం వార్డుల్లో ఎక్కడా లేరు. ముగ్గురు పేరు మీద పింఛన్లు రెండు సార్లు(డబుల్) వచ్చాయి. మృతి చెందిన ఒకరికి పింఛన్ మంజూరైంది. ఒక వార్డు లబ్దిదారుడు మరో వార్డులో, ఇంటినంబరు తప్పు, ఆధారు కార్డులో వివరాల పొరపాటు తదితర కారణాలతో కూడా కొంతమందికి పింఛన్లు పంపిణీ కాలేదు. తాండూరు మండలం మల్కాపూర్ అడ్రస్‌గా ఒకరికి పింఛన్ పట్టణంలో రావడం గమనార్హం. అయితే డబుల్, మృతి చెందిన పింఛన్‌దారులను మినహాయిస్తే 246మంది ఎవరు.. ఎక్కడున్నారు? స్థానికంగా లేని వారి పేరు మీద పింఛన్లు ఎలా మంజూరయ్యాయి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా..తదితర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎవరో.. ఎక్కడుంటున్నారో తెలియక రూ.5.24 లక్షల పింఛన్ డబ్బులు మిగిలిపోయినట్టు మున్సిపల్ బిల్‌కలెక్టర్ రమేష్ వివరించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు నివేదించామన్నారు. కలెక్టర్ ఆదేశాల తరువాత మున్సిపల్ కమిషనర్ సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.