
చెన్నై : సాధారణంగా పోస్టుమ్యాన్లు ఉత్తరాలు అందివ్వడం ఆనవాయితీ. ఇప్పటి వరకు మనం అదేం చూశాం .అయితే ఇకపై వారు పండ్లు, కూరగాయలు సరఫరా చేయనున్నారు. ఇండియా పోస్ట్‌తో ఉద్యానవన శాఖ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి పండ్లు, కూరగాయలు ఇళ్లకు సరఫరా చేయనున్నారు. ఇటీవల చెన్నైలోని చిట్లపాక్కంలో పోస్ట్‌మ్యాన్‌లతో విజయవంతంగా పంపిణీ చేశారు. దీంతో ఈ వ్యవస్థను మరో వారంలో అమల్లోకి తీసుకురావాలని ఉద్యానవన శాఖాధికారులు భావిస్తున్నారు. ప్రతి పోస్టాఫీసు పరిధిలోని ఆపరేటివ్ ఏరియా సామర్థ్యాన్ని బట్టి కూరగాయల పొట్లాలు మాత్రమే పంపిణీ చేస్తారు. ప్రతి పార్సిల్‌లో గరిష్టంగా ఏడు కిలోల కూరగాయలు, పండ్లను సరఫరా చేసేలా యోచిస్తోందని తెలిపారు. పార్సిళ్లు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయడానికి వాహనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ ఉన్నందున కొత్తగా కూరగాయలు, పండ్లు సరఫరా వల్ల ఇండియా పోస్ట్‌కు ఆదాయం కూడా లభిస్తుందని తపాలాశాఖ అధికారులు భావిస్తున్నారు.
‘లాక్’ తీస్తే కరోనాతో కష్టమే..
Comments
Please login to add a commentAdd a comment