garbage vehicle
-
పంచకుండా పడేశారు
కుల్కచర్ల (వికారాబాద్): పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు అందివ్వాల్సిన ఆధార్, ఏటీఎం, పాన్, పోస్టు కార్డుల్ని ఓ పోస్ట్‌మ్యాన్ వారికివ్వకుండా ఏళ్ల తరబడి ఇంట్లోనే ఉంచేసుకున్నాడు. చివరికి వాటిని మూటకట్టి గ్రామానికి చెందిన ఓ చెత్త ట్రాక్టర్లో పడేశాడు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆ పోస్్టమ్యాన్ నర్సింలు నిర్వాకం గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా బయటకు వచ్చింది. వికారాబాద్ జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వెలుగు చూసిందిలా...: జిల్లాలోని చౌడాపూర్ మండల కేంద్రంలోని చౌడాపూర్ గ్రామానికి చెందిన చెత్త ట్రాక్టర్ శనివారం చెత్తను సేకరి స్తున్న క్రమంలో గ్రామానికి చెందిన పోస్ట్ మ్యాన్ నర్సింలు ఇంటివద్ద ఆగింది. ఆ సమయంలో నర్సింలు కుటుంబసభ్యులు ఓ పెద్ద సంచిని తీసుకొచ్చి ట్రాక్టర్లో పడేశా రు. కొద్ది దూరం వెళ్లాక ఈ సంచిని గమనించిన పంచాయతీ సిబ్బంది మూట విప్పి చూడగా..అందులో 2 వేలకు పైగా ఆధార్ కార్డులు, వందకు పైగా పాన్, ఏటీఎం, క్రెడి ట్ కార్డులు, మరికొన్ని ఉత్తరాలు కన్పించా యి. వీటిలో 2011 ఏడాదికి చెందినవి కూడా ఉన్నాయి. దీంతో పంచాయతీ కార్యాలయం వద్ద సంచిని దించారు. ఈ విషయాన్ని కొంతమంది వీడియోతీసి సామాజిక మాధ్యమా ల్లో వైరల్ చేయగా వీడియోను చూసిన చౌడా పూర్, మక్తవెంకటాపూర్, మందిపల్ గ్రామ స్తులు అక్కడకు చేరుకుని వారికి రావాల్సిన కార్డుల్ని తీసుకున్నారు. మిగిలిన ఆధార్, ఏటీఎం, క్రెడిట్ కార్డులను చౌడాపూర్ తహసీల్దార్ ప్రభు వద్ద భద్రపరిచారు. పోస్ట్‌మ్యాన్ నిర్లక్ష్యంపై ఆందోళన...: నర్సింలు విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నాడంటూ కొంతమంది తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇటీవలే ఆందోళన కూడా చేశారు. తాజా ఘటనతో అతడిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మహబూబ్‌నగర్ జిల్లా పోస్టల్ అధికారులకు సిఫార్సు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. చెక్కు దొరకలేదు. డిసెంబర్లో ఓ బీమా కంపెనీ నుంచి రూ.33 వేల చెక్కు రావాల్సి ఉంది. ఈ విషయమై కొద్ది రోజులుగా పోస్ట్‌మ్యాన్‌ను అడుగుతూనే ఉన్నాను. ఆయన మాత్రం ఎలాంటి చెక్కు రాలేదని చెబుతున్నాడు. ఈ విషయమై సబ్ పోస్టాఫీస్‌కు వెళ్లి ఆరా తీయగా డిసెంబర్ 9వ తేదీనే గ్రామానికి పంపించామని చెప్పారు. వీడియో చూసి పంచాయతీకి వెళ్లి సంచిలో వెదికినా నాకు రావాల్సిన చెక్కు మాత్రం దొరకలేదు. –కావలి రాములు, చౌడాపూర్ -
అయ్యో.. ఎంత దారుణం, ట్రాలీ చక్రం కింద నలిగిపోయిన చిన్నారి
సాక్షి,మల్కాజిగిరి(హైదరాబాద్): శుభకార్యంతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో కొద్ది సేపటికే విషాదఛాయలు అలముకున్నాయి. ఆటో ట్రాలీ వెనుక చక్రం కింద పడి 16 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మల్కాజిగిరి పోలీస్ సేష్టన్ పరిధిలో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మౌలాలీ ఆర్టీసీ కాలనీ కృష్ణానగర్‌కు చెందిన మహ్మద్ జీఫాన్కు కుమారుడు మహ్మద్ రజాక్ అహ్మద్ ఖాద్రీ (16 నెలలు), 21 రోజుల వయసున్న కూతురు ఉన్నారు. సోమవారం ఇంట్లో శుభకార్యం జరుగుతుండగా బాలుడు మహ్మద్ రజాక్ అహ్మద్ ఖాద్రీ బుడిబుడి అడుగులు వేసుకుంటూ బయటకు వచ్చాడు. అదే సమయంలో చెత్త సేకరణ కోసం వచి్చన ఆటో ట్రాలీ డ్రైవర్ బాలుణ్ని గమనించకుండా వాహనాన్ని వెనకకు తిప్పుతుండగా చక్రం కింద పడిపోయాడు. మహ్మద్ రజాక్ అహ్మద్ ఖాద్రీ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. బాలుడి తండ్రి మహ్మద్ జీఫాన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పోలీస్ స్టేషన్‌కు అనుకోని అతిథి
పెన్సిల్వేనియా: ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు. కానీ ఎలుగుబంటి సైతం తన సమస్యను చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? విషయం ఏమిటంటే... పెన్సిల్వేనియాలోని 'కార్బన్ కౌంటీ' ప్రాంతంలో చెత్తను తరలించే వాహనంపై ఎలుగుబంటి ఎక్కి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వాహనంపై ఉన్న ఎలుగుబంటి ఫోటోను 'కిడ్డర్ టౌన్షిప్' పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే 1400 మంది షేర్ చేయడంతో ఆ చిత్రం ఫేస్బుక్లో వైరల్‌గా మారింది. కార్బన్ కౌంటీ ప్రాంతంలో ఎలుగుబంట్ల సమస్యపై తరుచుగా ఫిర్యాదులు వచ్చేవని అక్కడి పోలీసు అధికారి అన్నారు. కానీ ఇప్పుడు వాటిని పట్టుకునేందుకు కష్టపడాల్సిన అవసరం లేకుండా ఎలుగుబంటే పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. కాసేపటికే ఎలుగుబంటి సురక్షితంగా అడవుల్లోకి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. -
చెత్త బండిలో లక్షాధికారి శవ యాత్ర
వేలూరు(తమిళనాడు): లక్షాధికారిగా జీవించిన ఓ వ్యక్తిని మరణించాక బంధువులు, కన్న బిడ్డలు అనాథగా వదిలిపెట్టడంతో అతని మృతదేహాన్ని చెత్త బండిలో తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటన తమిళనాడులోని వేలూరులో చోటుచేసుకుంది. షోలింగర్‌కు చెందిన రాజారామ్(70) భార్య కొన్నేళ్ల క్రితం మరణించడంతో కన్నబిడ్డలు అతన్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో వీధుల్లో బిక్షాటన చేసి జీవిస్తుండేవాడు. గత నెల 27న రాజారామ్ మృతిచెందాడు. ఆయన బంధువులకు పోలీసులు సమాచారం అందజేశారు. రాజారామ్‌తో తమకు సంబంధం లేదని కన్నబిడ్డలు మృతదేహాన్ని తీసుకోలేదు. దీంతో బుధవారం పోస్టుమార్టం నిర్వహించి పారిశుధ్య కార్మికుల సాయంతో చెత్త తీసుకెళ్లే బండిలో మృతదేహాన్ని తీసుకెళ్లి దహనక్రియలు నిర్వహించారు. -
‘చెత్త’బండి.. నెట్టాలండి..
సంగారెడ్డి పట్టణంలో నిత్యం చెత్తసేకరించే ట్రాక్టర్ తరచూ మోరాయిస్తోంది. దీన్ని నెట్టలేక పారిశుద్ధ్య కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. రోజుకు ఐదారుసార్లు మొరాయిస్తోండడంతో మహిళా కార్మికులు సైతం నరకం చూస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ట్రాక్టర్‌కు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. - సాక్షి ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి