అయ్యో.. ఎంత దారుణం, ట్రాలీ చక్రం కింద నలిగిపోయిన చిన్నారి   | Hyderabad: 16 Months Boy Dies Run Over By Garbage Vehicle | Sakshi
Sakshi News home page

అయ్యో.. ఎంత దారుణం, ట్రాలీ చక్రం కింద నలిగిపోయిన చిన్నారి  

Published Tue, Mar 28 2023 11:12 AM | Last Updated on Tue, Mar 28 2023 12:12 PM

Hyderabad: 16 Months Boy Dies Run Over By Garbage Vehicle - Sakshi

సాక్షి,మల్కాజిగిరి(హైదరాబాద్‌): శుభకార్యంతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో కొద్ది సేపటికే విషాదఛాయలు అలముకున్నాయి. ఆటో ట్రాలీ వెనుక చక్రం కింద పడి 16 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మల్కాజిగిరి పోలీస్‌ సేష్టన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మౌలాలీ ఆర్టీసీ కాలనీ కృష్ణానగర్‌కు చెందిన మహ్మద్‌ జీఫాన్‌కు కుమారుడు మహ్మద్‌ రజాక్‌ అహ్మద్‌ ఖాద్రీ (16 నెలలు), 21 రోజుల వయసున్న కూతురు ఉన్నారు.

సోమవారం ఇంట్లో శుభకార్యం జరుగుతుండగా బాలుడు మహ్మద్‌ రజాక్‌ అహ్మద్‌ ఖాద్రీ బుడిబుడి అడుగులు వేసుకుంటూ బయటకు వచ్చాడు. అదే సమయంలో చెత్త సేకరణ కోసం వచి్చన ఆటో ట్రాలీ డ్రైవర్‌ బాలుణ్ని గమనించకుండా వాహనాన్ని వెనకకు తిప్పుతుండగా చక్రం కింద పడిపోయాడు. మహ్మద్‌ రజాక్‌ అహ్మద్‌ ఖాద్రీ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. బాలుడి తండ్రి మహ్మద్‌ జీఫాన్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement