విషాదంగా ముగిసిన అనాథ బాలిక జీవితం
పురుగు మందు తాగి, చికిత్స పొందుతూ మృతి
భర్త, అత్తమామ, ఆడపడుచులపై కేసు
ధారూరు: ఓ అనాథ బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడంతో పాటు వేధింపులకు గురిచేసి, ఆత్మహత్యకు ప్రేరేపించిన యువకుడు, అతని కుటుంబ సభ్యులపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్, గ్రామస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.. ధారూరు మండల కేంద్రానికి చెందిన కె.మంజుల, యాదయ్య దంపతులకు కొడుకు, కూతురు సంతానం. మంజుల, యాదయ్య కొన్నేళ్ల క్రితం మరణించారు.
మూడేళ్ల క్రితం వీరి కొడుకు కూడా మృతిచెందడంతో కూతురు స్వాతి(16) అనాథగా మిగిలింది. దోర్నాల్ గ్రామంలో ఉంటున్న అమ్మమ్మ బాలికను చేరదీసి, స్థానిక కస్తూర్బా విద్యాలయంలో చేరి్పంచింది. ఇదే సమయంలో కుక్కింద గ్రామానికి చెందిన యువకుడు శ్రీకాంత్ తా ను స్వాతిని ప్రేమిస్తున్నానంటూ తీసుకెళ్లి, పెళ్లి చేసుకున్నాడు. ఏడాది పాటు వీరి కాపురం సజావు గానే సాగింది. ఆ తర్వాత భర్త శ్రీకాంత్‌తో పాటు అత్త, మామలు వెంకటమ్మ, యాదయ్య, ఆడపడుచులు స్వాతిని వేధించడం ప్రారంభించారు.
వీరి ఆగడాలు భరించలేక ఈనెల 16న సాయంత్రం స్వాతి ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి, స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. స్వాతి ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్త, మామ, ఆడపడుచులపై బాల్య వివాహం, వేధింపులు, పోక్సో, ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్ల కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment