orphaned girls
-
ప్రేమ.. పెళ్లి.. వేధింపులు.. ఆత్మహత్య
ధారూరు: ఓ అనాథ బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడంతో పాటు వేధింపులకు గురిచేసి, ఆత్మహత్యకు ప్రేరేపించిన యువకుడు, అతని కుటుంబ సభ్యులపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎస్ఐ వేణుగోపాల్‌గౌడ్, గ్రామస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.. ధారూరు మండల కేంద్రానికి చెందిన కె.మంజుల, యాదయ్య దంపతులకు కొడుకు, కూతురు సంతానం. మంజుల, యాదయ్య కొన్నేళ్ల క్రితం మరణించారు. మూడేళ్ల క్రితం వీరి కొడుకు కూడా మృతిచెందడంతో కూతురు స్వాతి(16) అనాథగా మిగిలింది. దోర్నాల్ గ్రామంలో ఉంటున్న అమ్మమ్మ బాలికను చేరదీసి, స్థానిక కస్తూర్బా విద్యాలయంలో చేరి్పంచింది. ఇదే సమయంలో కుక్కింద గ్రామానికి చెందిన యువకుడు శ్రీకాంత్ తా ను స్వాతిని ప్రేమిస్తున్నానంటూ తీసుకెళ్లి, పెళ్లి చేసుకున్నాడు. ఏడాది పాటు వీరి కాపురం సజావు గానే సాగింది. ఆ తర్వాత భర్త శ్రీకాంత్‌తో పాటు అత్త, మామలు వెంకటమ్మ, యాదయ్య, ఆడపడుచులు స్వాతిని వేధించడం ప్రారంభించారు.వీరి ఆగడాలు భరించలేక ఈనెల 16న సాయంత్రం స్వాతి ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి, స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. స్వాతి ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్త, మామ, ఆడపడుచులపై బాల్య వివాహం, వేధింపులు, పోక్సో, ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్ల కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
మా నాన్న కలెక్టర్.. ఆయనే మా ధైర్యం
‘అమ్మలేదంటూ బెంగపడవద్దు.. అయినవారెవ్వరూ లేరనే చింత అసలే వద్దు.. నాన్నగా ధైర్యమై మీ వెంటే ఉంటాను’ అంటూ జిల్లా కలెక్టర్ అనాథలైన ఇద్దరు కవల ఆడపిల్లలకు ఆండగా నిలుస్తున్నారు. కలెక్టర్ నాన్నగా అందరి మదిని గెలుచుకుంటున్నారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో చదువుకునే పిల్లలకు అక్కడ వసతి సదుపాయం కూడా ఉంది. ఆ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు రాధా, రాధికలు. ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. పదవ తరగతి పూర్తి అవుతూనే అందరు పిల్లలు వారి వారి ఇండ్లకు వెళ్లిపోయారు. ‘మేం ఎక్కడికి వెళ్లాలి?!’ ఈ ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణారెడ్డి వద్దకు వెళ్లి తమ విషయం చెప్పి కన్నీరుమున్నీరయ్యారు. దీంతో డీఈవో ఇద్దరు పిల్లలను తీసుకొని జిల్లా కేంద్రంలో జరిగే ప్రజావాణికి వెళ్లారు. అక్కడ అర్జీలు తీసుకుంటున్న కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఈ ఇద్దరు కవలల ఆడపిల్లల స్థితి చూసి చలించిపోయారు. వారి కష్టాలు నేరుగా విని చెమ్మగిల్లిన కళ్లతో అప్పటికప్పుడే ఇద్దరి పేరున చెరొక లక్ష రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేశారు. అదే సమయంలో దసరా పండుగ రావడంతో ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇచ్చి కొత్త బట్టలు కొనుక్కోమని చెప్పారు. వెంటనే జిల్లా స్త్రీ, శిశుసంక్షేమశాఖ అధికారులను పిలిచి వారికి ఆశ్రయం కల్పించాలని అదేశించారు. విషయమేంటంటే... సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలోని బంగారం పనిచేసుకుంటూ జీవించే వెంకటేశం, పార్వతిలకు రాధా, రాధికలు కవల పిల్లలు. భార్య ఆరోగ్యం సక్రమంగా ఉండకపోవడంతో ఇద్దరు ఆడపిల్లల భారం తానే మోయాల్సి వస్తుందని తండ్రి వెంకటేశం చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు అతని ఆచూకీ లేదు. ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ తల్లి వారు ఏడవ తరగతి చదువుతుండగానే ఆరోగ్యం క్షీణించి మరణించింది. ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు. పిల్లలు దగ్గరకు వస్తే ఆ భారం తమమీద పడుతుందనే భయంతో బంధువులు చిన్నారులను సూటిపోటి మాటలతో దూరంగా ఉంచారు. దీంతో గ్రామస్తులు అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయుల సహకారంతో సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి కస్తూరిబాగాంధీ బాలికల పాఠశాలలో చేర్పించారు. ఆ పాఠశాలలో ఇన్నాళ్లూ చదువుకున్న పిల్లలకు దేవుడే వారి బాధ్యతను తీసుకునే నాన్నను వరంగా ఇచ్చాడు. కష్టాల కడలిలో ఉన్న ఆ ఇద్దరి జీవితాల్లో ఆనందాన్ని నింపడానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వారికి నాన్నయ్యాడు. నాటి నుండి పర్యవేక్షణ.. రోజూ తమ వద్దకు వచ్చే వందలాది అర్జీలను తీసుకొని పరిష్కరించి మర్చిపోతారు. కానీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాత్రం ఈ రాధా, రాధికలను తానే దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు. తనకు వీలునప్పుడల్లా ఆ పిల్లల బాగోగులను స్వయంగా పర్యవేక్షించడం లేదా వారినే తన కార్యాలయానికి, ఇంటికి పిలిపించుకొని యోగ క్షేమాలు తెలుసుకోవడం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా పిల్లలకు ప్రతీ పుట్టినరోజు, పండుగలకు కొత్త బట్టలు తేవడం, ఇతర పిల్లలతో పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇలా పెరిగిన పిల్లలు ఇప్పుడు సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. కలెక్టర్ బిడ్డలు.. ‘మీరు నాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు. మీకు ఎవ్వరూ లేరనే దిగులే అవసరం లేదు. మీ నాన్న జిల్లా కలెక్టర్. మీకు ఏం కావాలన్నా డిమాండ్‌గా అడగచ్చు’ అని చెప్పి మరీ పిల్లలకు మనోధైర్యం కల్గిస్తున్నారు. ‘ఎక్కడా తక్కువ కాకుండా సంతోషంగా ఉండండి. బాగా చదువుకోండి. మీ చదువుల బాధ్యతే కాదు, పెళ్లిళ్లు చేసి మిమ్మల్ని ఓ ఇంటివారిని చేసే బాధ్యత కూడా తండ్రిగా నాదే’ అంటున్నారు ఈ కలెక్టర్. మనసున్న కలెక్టర్‌గా అందరిచేత అభినందనలు అందుకుంటున్నారు. – ఈరగాని భిక్షం, సాక్షి, సిద్దిపేట నాన్నే మా ధైర్యం అమ్మ ఆరోగ్యం బాగున్నన్ని రోజులు మాకే ఇబ్బందులు రాలేదు. తర్వాత అన్నీ కష్టాలే. ఆకలికి తట్టుకోలేక ఎన్నో రోజులు బాధలు పడ్డాం. ఇప్పుడు మాకు దేవుడే నాన్నగా వచ్చాడు. మాకే లోటు లేకుండా చూసుకుంటున్నారు. మా నాన్న కలెక్టర్. మా నాన్న మా ధైర్యం. మాకు స్ఫూర్తి. బాగా చదువుకొని నాన్నకు మంచి పేరు తీసుకొస్తాం. -
అనాథ.. అమ్మ అయింది!
నర్సంపేట: సొంత మనుషులు పట్టించుకోలేదు.. మతిస్థిమితం తప్పడంతో బస్టాండ్‌లో ఆవాసం ఏర్పర్చుకున్న యువతి గర్రెపల్లి రజినిపై ఓ కామాంధుడు కన్నేశాడు.. ఫలితంగా అభంశుభం తెలియని ఆమె గర్భం దాల్చింది. ఆరు నెలల గర్భంతో సరైన పోషణ, చికిత్స లేక అనారోగ్యం పాలైన ఆ యువతి దీనగాథను నాలుగు నెలల క్రితం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో స్పందించిన కాజీపేటలోని అమ్మ అనాథశ్రమం నిర్వాహకులు డాక్టర్ శ్రీదేవి ఆమెను చేరదీసి అన్నీ తానై చూసుకుంది. సాధారణ మహిళల్లాగే ఆశ్రమంలోనే సీమంతం జరిపించింది. ప్రస్తుతం నెలలు నిండిన రజినిని గురువారం హన్మకొండలోని ప్రసూతి ఆస్పత్రిలో చేర్పించగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆశ్రమంలో ఉన్న సమయాన కొద్దిగా ఆరోగ్యం బాగుపడిన రజిని.. తనకు పుట్టిన బిడ్డను చూసి మురిసిపోయింది. తన గాధను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాకున్నా.. అమ్మ ఆశ్రమం ఒడిలో చేర్చుకోకున్నా ఏమై పోయోదాన్నోనని ఆమె కంట తడి పెట్టుకుంది. మతిస్థిమితం లేకపోవడంతో... దుగ్గొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన గర్రెపల్లి రజిని. కొంత మతిస్థిమితం తప్పడంతో బస్టాండ్ సెంటర్లలో ప్రయాణికులను చిల్లర అడుక్కుంటూ., నర్సంపేట బస్టాండ్‌లోనే కాలం గడిపేది. ఆ సమయంలో ఓ కామాంధుడు చేసిన పాపానికి రజిని అమ్మ అయింది. ఆరు నెలల గర్భిణిగా ఉండి తనకేం జరిగిందో తెలియక.. సరైన చికిత్స అందక అనారోగ్యం పాలయిన అమె దీనగాధను గత జనవరి 20న ‘అనాధను అమ్మ చేశారు’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురితమైంది. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ హరిత.. రజినిని చేరదీయాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు,. అయితే, ఐసీడీఎస్ అధికారుల సమక్షాన కాజీపేటలోని అమ్మ అనాథాశ్రమం నిర్వాహకురాలు అమ్మ శ్రీదేవి ఆమె బాధ్యత స్వీకరించారు. ఇక ఏప్రిల్ 3న ఆశ్రమంలోనే సీమంతం కూడా జరిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైద్యపరీక్షలు చేయిస్తూ బిడ్డలా సాకారు. ఈ మేరకు గురువారం ఉదయం రజినికి పురిటి నొప్పులు రాగా.. హన్మకొండలోని జీఎంహెచ్‌లో చేర్పించారు. అక్కడ సూపరింటెండెంట్ సరళాదేవి నేతృత్వాన వైద్యులు, సిబ్బందికి రజినికి ప్రసవం చేయగా మగ బిడ్డ జన్మించాడు. కాగా, ఆ బాబు కొద్దిమేర అవస్థతకు గురవడంతో పిల్లల వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాం... కామాంధుల వంచనకు గురై అందరూ ఉన్నా అనాథగా మారిన రజిని విషయమై ‘సాక్షి’లో వచ్చిన కథనంతో చలించిపోయి వెంట తెచ్చుకున్నాను. గత ఐదు నెలలుగా రజినిని కంటికి రెప్పలా కాపాడుకున్నాను. ఇప్పుడు ఆమె బాబుకు జన్మనివ్వడం.. ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడం సంతోషాన్ని కలిగించింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయగానే బాబు, తల్లిని జిల్లా కలెక్టర్ సమక్షంలో ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తాను. – అమ్మ శ్రీదేవి, అమ్మ అనాథశ్రమం నిర్వాహకురాలు -
అనాథ బాలికకు అమెరికా ఆఫర్!
కోల్‌కతా: ఆమె ఓ అనాథ బాలిక. ఐదేళ్ల వయస్సులో కోల్‌కతాలోని ఓ ఫుట్‌పాత్‌పై తిరుగాడుతున్న ఆమెను ఇక్కడి రెయిన్బో హోం అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు చేరదీసి ఆశ్రయమిచ్చారు. వారి ప్రాపకంలో పెరిగి పెద్దదైన ఆ అనాథ బాలిక ఇవాళ అమెరికాలో చదువుకునే అదృష్టాన్ని దక్కించుకుంది. ఆమె పేరు ఏంజెలా బెర్నాడెట్టె రైల్. అమెరికా విదేశాంగ శాఖ నిధులతో కొనసాగుతున్న కమ్యూనిటీ కాలేజ్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం(సీసీఐపీ)లో భాగంగా ఆ దేశంలోని కమ్యూనిటీ కళాశాలల్లో చదివేందుకోసం భారత్ నుంచి 35 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో 19 ఏళ్ల ఏంజెలా ఒకరు. చిన్నారులకు బోధన ఎలా చేయాలో నేర్పించే ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్’ కోర్సు చేసేందుకు ఆమె వాషింగ్టన్ లేక్‌వుడ్‌లో పియర్స్ కమ్యూనిటీ కళాశాలలో చేరనుంది. అమెరికాలో చదివే అదృష్టం తన తలుపు తడుతుందని కలలో కూడా ఊహించలేదని కళ్లల్లో సంతోషం తొణికిసలాడుతుండగా ఏంజెలా చెప్పింది. ఐదేళ్ల వయస్సులో ఏంజెలాను చేరదీసిన రెయిన్బో హోం సభ్యులు ఆమెను సీల్దాహ్లోని లొరెటో స్కూల్లో చేర్చారు. ఒకవైపు చదువుకుంటూనే తానుంటున్న హోంలోని ఇతర అనాథ పిల్లలకు ఏంజెలా ఆంగ్లం బోధించేది. 12వ తరగతి పరీక్షలు రాసిన అనంతరం ఏంజెలా అదే రెయిన్బో హోంలో ఓ బృందానికి నాయకురాలిగా వ్యవహరిస్తూ.. వీధి బాలల సమస్యలపై కార్యక్రమాలు, సర్వేలు నిర్వహిస్తోంది. -
బాలగ్రామ్‌లో ‘భక్షకులు’
పింప్రి, న్యూస్‌లైన్: అనేక ఆరోపణలు ఎదుర్కొం టూ చర్చల్లో నిలుస్తున్న పుణేలోని ‘ఎస్ఓఎస్ ఆధ్వర్యంలో నడిచే బాలగ్రామ్’ మూసేయాలని ప్రభుత్వానికి విన్నపాలు అందినప్పటికీ ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవడంలో జాప్యం వహిస్తోంది. పుణేలోని ఎస్ఓఎస్ బాలగ్రామ్ మూసి వేయాలంటూ జిల్లా స్త్రీ- శిశు సంక్షేమాధికారి, శిశు సంక్షేమ సమితి, మహిళా- శిశు సంక్షేమ కమిషనర్లు ప్రభుత్వానికి వినతి పత్రాలను పంపించారు. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనున్నదో సర్వత్రా ఆసక్తి నెల కొం ది. పుణేలోని ఎరవాడ అగ్రసేన్ హైస్కూల్ పక్కన ఉన్న తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఈ బాలగ్రామ్ ఉంది. దీనిని ఎస్ఓఎస్ చిల్డ్రన్ విలేజ్ ఆఫ్ ఇండియా అనే సామాజిక సంస్థ పుణేలో ఏర్పాటు చేసింది. ఈ బాలగ్రామ్‌లో అనాథ పిల్లలను పెంచి, పోషించి, విద్యాభ్యాసం చేయించి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. అంతేకాకుండా వివాహాలు కూడా జరిపిస్తున్నారు. అయితే ఈ సంస్థ ఎస్ఓఎస్ నియమానుసారం నడుచుకోవలసి ఉంటుంది. ఈ సంస్థకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా స్త్రీ- శిశు సంక్షేమ శాఖ ద్వారా గ్రాంట్లు అందుతుంటా యి. ప్రస్తుతం ఇందులో మొత్తం 20 గదులున్నా యి. వీటిలో బాలబాలికలను ఒకే దగ్గర ఉంచుతున్నారు. ఎస్ఓఎస్ నియమానుసారం 14 ఏళ్లుపైబడిన వారిని సంస్థకు చెందిన యూత్ హాస్టల్‌కు పంపుతారు. బాలికల విద్య, వివాహాలు జరిపేంతవరకు ఇక్కడనే ఉంచుతారు. ప్రస్తుతం సుమారు 200 మంది బాలబాలికలు ఉన్నారు. ఒక్కో గదిలో 8-10 మందిని ఉంచుతున్నారు. అయితే 14 ఏళ్లు పైబడిన బాలురను బాలికలతో ఒకే గదిలో ఉంచరాదని శిశు సంక్షేమ సమితి 2011 అక్టోబర్ 24వ తేదీన సంస్థకు నోటీసు పంపించింది. అయినప్పటికీ ఎస్ఓఎస్ నియమాలను, శిశు సంక్షేమ సమితి నోటీసును బేఖాతరు చేస్తూ పిల్లలను ఒకే గదుల్లో ఉంచుతున్నారు. దీంతో అనేక జరగరాని ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లు ఎరవాడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అలాగే రెండు నెలల క్రితం కళ్యాణీ అనిత గితే (6) అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీంతో కళ్యాణీ బంధువులు సంస్థపై ఆరోపణలు చేస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన ఎనిమిదేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై కూడా బాలిక బంధువులు నిరాహార దీక్ష చేశారు. ఈ మూడు ఘటనలకు సంస్థ డెరైక్టర్‌ను జవాబుదారీగా చేస్తూ ఎరవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే 2009లో సంస్థలోని ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్నా రు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ సంస్థను మూసేయాల్సిందిగా అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ విషయంగా జిల్లా స్త్రీ, శిశు సంక్షే మ అధికారి సువర్ణా జాదవ్ వివరిస్తూ ..సంస్థలో ఏడు నుంచి 18 ఏళ్లలోపు బాల బాలికలను ఒకే చోట ఉంచకూడదని అక్టోబర్ 24, 2011లో నోటీసు లు పంపామన్నారు. అయినప్పటికీ ఆ సంస్థ ఎలాం టి చర్యలు తీసుకోవడం లేదన్నారు. బాలగ్రామ్‌లో ఎస్ఓఎస్, ప్రభుత్వ నియమాలను పాటించడం లేదని జాదవ్ ఆరోపించారు. ప్రభుత్వం ఈ సంస్థ ను మూసేయాలని నిర్ణయించిందని, ఇందులోని పిల్లలను మరో సంస్థలకు పంపించనుందన్నారు. మతిస్థిమితం లేని బాలికపై ఆత్యాచారం.. 2006లో సంస్థలోని 19 ఏళ్ల మతిస్థిమితం లేని బాలి కపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. సంస్థ లో బస్సు డ్రైవర్ ఈ బాలికపై అత్యాచారం చేసినట్లు సంస్థలో పనిచేసే మహిళ వెలుగులోకి తెచ్చిం ది. దీనిపై దర్యాప్తు చేస్తున్నారని సంస్థ కార్యదర్శి రంజనా పురణీక్ తెలిపారు. కాగా ఈ సంస్థను మూసేయాలని తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని, నోటీసు వచ్చిన తర్వాత ఈ విషయంపై ఆలోచిస్తామని, అప్పటి వరకు ఈ సంస్థను నడుపుతామని రంజనా తెలిపారు. బాల గ్రామ్ డెరైక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత శోఛనాతాయి రణడేని సంప్రదించగా తాను ప్రస్తుతం పుణేలో లేననీ, ఈ విషయాలపై తమకు ఎలాంటి సమాచారం లేదని, పుణేకి వచ్చిన తర్వాత స్పం దిస్తానని చెప్పారు.