పింప్రి, న్యూస్‌లైన్: అనేక ఆరోపణలు ఎదుర్కొం టూ చర్చల్లో నిలుస్తున్న పుణేలోని ‘ఎస్‌ఓఎస్ ఆధ్వర్యంలో నడిచే బాలగ్రామ్’ మూసేయాలని ప్రభుత్వానికి విన్నపాలు అందినప్పటికీ ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవడంలో జాప్యం వహిస్తోంది. పుణేలోని ఎస్‌ఓఎస్ బాలగ్రామ్ మూసి వేయాలంటూ జిల్లా స్త్రీ- శిశు సంక్షేమాధికారి, శిశు సంక్షేమ సమితి, మహిళా- శిశు సంక్షేమ కమిషనర్‌లు ప్రభుత్వానికి వినతి పత్రాలను పంపించారు. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనున్నదో సర్వత్రా ఆసక్తి నెల కొం ది. పుణేలోని ఎరవాడ అగ్రసేన్ హైస్కూల్ పక్కన ఉన్న తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఈ బాలగ్రామ్ ఉంది. దీనిని ఎస్‌ఓఎస్ చిల్డ్రన్ విలేజ్ ఆఫ్ ఇండియా అనే సామాజిక సంస్థ పుణేలో ఏర్పాటు చేసింది.
ఈ బాలగ్రామ్‌లో అనాథ పిల్లలను పెంచి, పోషించి, విద్యాభ్యాసం చేయించి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. అంతేకాకుండా వివాహాలు కూడా జరిపిస్తున్నారు. అయితే ఈ సంస్థ ఎస్‌ఓఎస్ నియమానుసారం నడుచుకోవలసి ఉంటుంది. ఈ సంస్థకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా స్త్రీ- శిశు సంక్షేమ శాఖ ద్వారా గ్రాంట్లు అందుతుంటా యి. ప్రస్తుతం ఇందులో మొత్తం 20 గదులున్నా యి. వీటిలో బాలబాలికలను ఒకే దగ్గర ఉంచుతున్నారు. ఎస్‌ఓఎస్ నియమానుసారం 14 ఏళ్లుపైబడిన వారిని సంస్థకు చెందిన యూత్ హాస్టల్‌కు పంపుతారు. బాలికల విద్య, వివాహాలు జరిపేంతవరకు ఇక్కడనే ఉంచుతారు. ప్రస్తుతం సుమారు 200 మంది బాలబాలికలు ఉన్నారు. ఒక్కో గదిలో 8-10 మందిని ఉంచుతున్నారు. అయితే 14 ఏళ్లు పైబడిన బాలురను బాలికలతో ఒకే గదిలో ఉంచరాదని శిశు సంక్షేమ సమితి 2011 అక్టోబర్ 24వ తేదీన సంస్థకు నోటీసు పంపించింది. అయినప్పటికీ ఎస్‌ఓఎస్ నియమాలను, శిశు సంక్షేమ సమితి నోటీసును బేఖాతరు చేస్తూ పిల్లలను ఒకే గదుల్లో ఉంచుతున్నారు. దీంతో అనేక జరగరాని ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లు ఎరవాడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అలాగే రెండు నెలల క్రితం కళ్యాణీ అనిత గితే (6) అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీంతో కళ్యాణీ బంధువులు సంస్థపై ఆరోపణలు చేస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన ఎనిమిదేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై కూడా బాలిక బంధువులు నిరాహార దీక్ష చేశారు. ఈ మూడు ఘటనలకు సంస్థ డెరైక్టర్‌ను జవాబుదారీగా చేస్తూ ఎరవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే 2009లో సంస్థలోని ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్నా రు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ సంస్థను మూసేయాల్సిందిగా అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ విషయంగా జిల్లా స్త్రీ, శిశు సంక్షే మ అధికారి సువర్ణా జాదవ్ వివరిస్తూ ..సంస్థలో ఏడు నుంచి 18 ఏళ్లలోపు బాల బాలికలను ఒకే చోట ఉంచకూడదని అక్టోబర్ 24, 2011లో నోటీసు లు పంపామన్నారు. అయినప్పటికీ ఆ సంస్థ ఎలాం టి చర్యలు తీసుకోవడం లేదన్నారు. బాలగ్రామ్‌లో ఎస్‌ఓఎస్, ప్రభుత్వ నియమాలను పాటించడం లేదని జాదవ్ ఆరోపించారు. ప్రభుత్వం ఈ సంస్థ ను మూసేయాలని నిర్ణయించిందని, ఇందులోని పిల్లలను మరో సంస్థలకు పంపించనుందన్నారు.
మతిస్థిమితం లేని బాలికపై ఆత్యాచారం..
2006లో సంస్థలోని 19 ఏళ్ల మతిస్థిమితం లేని బాలి కపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. సంస్థ లో బస్సు డ్రైవర్ ఈ బాలికపై అత్యాచారం చేసినట్లు సంస్థలో పనిచేసే మహిళ వెలుగులోకి తెచ్చిం ది. దీనిపై దర్యాప్తు చేస్తున్నారని సంస్థ కార్యదర్శి రంజనా పురణీక్ తెలిపారు. కాగా ఈ సంస్థను మూసేయాలని తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని, నోటీసు వచ్చిన తర్వాత ఈ విషయంపై ఆలోచిస్తామని, అప్పటి వరకు ఈ సంస్థను నడుపుతామని రంజనా తెలిపారు. బాల గ్రామ్ డెరైక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత శోఛనాతాయి రణడేని సంప్రదించగా తాను ప్రస్తుతం పుణేలో లేననీ, ఈ విషయాలపై తమకు ఎలాంటి సమాచారం లేదని, పుణేకి వచ్చిన తర్వాత స్పం దిస్తానని చెప్పారు.
బాలగ్రామ్‌లో ‘భక్షకులు’
Published Mon, Dec 16 2013 12:47 AM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM
Advertisement