సాక్షి, హైదరాబాద్: రేషన్ సరుకులు పొందేందుకు ఆధార్‌తో మొబైల్ ఫోన్ అనుసంధానం (ఓటీపీ కోసం) తప్పనిసరి కావటంతో తపాలాకార్యాలయాలను వినియోగించుకోవాలని ఆ శాఖ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. పోస్టల్ హైదరాబాద్ రీజియన్ (28 మఫిసియల్ జిల్లాలు) పరిధిలో అందుబాటులో ఉన్న 124 ఆధార్ కేంద్రాల్లో ఈ అనుసంధాన ప్రక్రియ చేయించుకోవచ్చని పేర్కొంది. వీటితోపాటు 15 మొబైల్ కేంద్రాలు కూడా ఈ సేవల్ని అందిస్తున్నాయని తెలిపింది.
రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తొలగించి, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌కు వచ్చే ఓటీపీ చెప్పటం ద్వారా గాని లేదా ఐరిష్ ద్వారా కానీ సరుకులు ఇచ్చే విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఓటీపీ కోసం ఆధార్‌తో మొబైల్ అనుసంధానం తప్పనిసరైంది. ఆధార్‌లో నిక్షిప్తమై ఉన్న ఐరిస్‌లో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున, ఐరిస్‌ను కూడా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ రెండు సేవలను తపాలాశాఖ ఆధ్వర్యంలోని ఆధార్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment