సాక్షి న్యూఢిల్లీ: ఆధార్ గుర్తింపు కార్డుతో పాన్ కార్డు అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. మరికొద్ది రోజుల్లో ముగియనున్న ఈ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది (2018)మార్చి 31 వరకు పొడగిస్తూ ఆర్థికమంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. లింక్ చేసే ప్రక్రియను సులభతరం చేసేందుకు గడువును మార్చి 31, 2018 వరకు పొడిగించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆధార్,పాన్ లింకింగ్ గడువును 2018, మార్చి 31 వరకు పెంచుతున‍్నట్టుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. కాగా ఆదాయపు పన్ను దాఖలుకోసం శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఆధార్ నంబర్ జతచేయడాన్ని తప్పని సరి చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్-పాన్ లింకింగ్ ప్రస్తుత గడువు ఈ డిసెంబర్ 31తో ముగుస్తున్న సంగతి తెలిసిందే.
CBDT extends date till 31.3.18 for linking of Aadhaar with PAN https://t.co/5mLiy2sf6b
— Ministry of Finance (@FinMinIndia) December 8, 2017
Comments
Please login to add a commentAdd a comment