పాన్‌కు ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిన గడువు తరుముకొస్తోంది. పాన్ ఆధార్ లింక్ కేంద్రం తప్పనిసరి చేసింది. ఇందుకు మార్చి 31 వరకు గడువు విధించింది. ఏప్రిల్ 1 తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్‌లు చెల్లుబాటు కావని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది.
పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి గడువును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతం రూ.1000 రుసుం చెల్లించి లింక్ చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. అప్పటికీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోకుంటే ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్ చెల్లదు . ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో పాన్ - ఆధార్ లింక్ చేసుకోవచ్చు.
చదవండి: Google Bard: గూగుల్ బార్డ్ అంటే సెర్చ్ మాత్రమే కాదు.. అంతకు మించి..
ఆన్‌లైన్‌లో పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ https://incometaxindiaefiling.gov.inను సందర్శించవచ్చు. అలాగే ఎస్సెమ్మెస్ ద్వారా పాన్ ఆధార్ లింక్ చేసుకునేందుకు 567678 లేదా 56161 నంబర్‌కి UIDPAN < SPACE > < 12 అంకెల ఆధార్ నంబర్ > < SPACE > < 10 అంకెల పాన్ నంబర్ > టైప్ చేసి ఎస్మెమ్మెస్ చేయొచ్చు. ఇన్ ఆఫ్‌లైన్ ద్వారా పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలనుకున్న వారు సమీపంలోని పాన్ సర్వీస్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించవచ్చు.
వీరికి మినహాయింపు
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139ఎఎ ప్రకారం.. పాన్ ఆధార్‌తో లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి అది పనిచేయదు. అయితే దీని నుంచి కొందరికి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 2017 మేలో కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పాన్-ఆధార్ లింకింగ్ నిబంధన నుంచి ఈ నాలుగు వర్గాలకు మినహాయింపు ఉంది.
- అస్సాం, మేఘాలయ, జమ్మ కశ్మీర్ రాష్ట్రాల వాసులు.
- ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం నాన్-రెసిడెంట్‌లు.
- 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు.
- భారతదేశ పౌరులు కాని వారు.
చదవండి: బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి!
Comments
Please login to add a commentAdd a comment