linkage
-
గొట్టిముక్కల ఎగువన రెండు జలాశయాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా గొట్టిముక్కలకు ఎగువన లోయ తరహాలో ఉన్న ప్రాంతాల్లో రెండు జలాశయాలను నిర్మించాలని జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)ను తెలంగాణ కోరింది. ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలను కేటాయించారని.. కానీ ఆ నీటితో ప్రతిపాదించిన 5.30 లక్షల ఎకరాల ఆయకట్టులో ఇప్పటికే 3 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ–2 ద్వారా నీళ్లు అందుతున్నాయని వివరించింది. అందువల్ల ఈ 45 టీఎంసీల నీటిని స్థానిక అవసరాల ఆధారంగా రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకునేలా వీలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ 45 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి రెండు జలాశయాలను నిర్మించాలని కోరింది.గోదావరి–కావేరి అనుసంధానంపై శుక్రవారం జలసౌధలో తెలంగాణతో ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం నిర్వహించింది. ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, సీఈ దేవేందర్‌రెడ్డి, ఈఈ శ్రీనివాస్, రాష్ట్రం తరఫున నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) అనిల్‌కుమార్ పాల్గొన్నారు. భేటీలో రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. అనుసంధానం ప్రాజెక్టుపై రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలను వివరించారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు సాగునీటి సరఫరా కోసం 250 టీఎంసీలు అవసర మని చెప్పారు. అందువల్ల ప్రాజెక్టు ద్వారా తరలించే నీటిలో 50 శాతాన్ని తెలంగాణకు కేటాయించాలని కోరారు.రాష్ట్రం చేసిన విజ్ఞప్తులు, డిమాండ్లు ఇవీ..⇒ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా నీటి తరలింపు కోసం ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని మా అధ్యయనంలో తేలింది. సమ్మక్క బరాజ్ నుంచే నీళ్లను తరలించాలి. రాష్ట్ర అవసరాల కోసం సమ్మక్క బరాజ్‌లో 83 మీటర్ల వరకు నిల్వలను సంరక్షిస్తూ ఆపై నిల్వలను మాత్రమే తరలించాలి. తెలంగాణకు సీతమ్మసాగర్ ప్రాజెక్టు కింద 70 టీఎంసీలు, సమ్మక్క ప్రాజెక్టు కింద 50 టీఎంసీలు, దేవాదుల కింద 38 టీఎంసీలు కలిపి మొత్తం 158 టీఎంసీల అవసరాలు ఉన్నాయి. వాటిని సంరక్షించాలి. సీతమ్మ ప్రాజెక్టులో విద్యుదుత్పత్తికి అవసరమైన కనీస నిల్వలను కాపాడాలి.⇒ సమ్మక్క బరాజ్‌లో 87 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేస్తే ఛత్తీస్‌గఢ్‌లో జరిగే ముంపు విషయంలో ఆ రాష్ట్రాన్ని ఒప్పించే బాధ్యతను ఎన్‌డబ్ల్యూడీఏ తీసుకోవాలి. ఛత్తీస్‌గఢ్ వాడుకోకపోవడంతో మిగిలే 148 టీఎంసీల గోదావరి జలాలను గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా తరలించనున్న నేపథ్యంలో.. ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పించి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై ఆ తర్వాతే సంతకాలు చేస్తాం.⇒ అనుసంధానం ప్రాజెక్టులో కాల్వలు, సొరంగాల కోసం సేకరించాల్సిన భూముల్లో రెండు పంటలు పండే ఆయకట్టు భూములున్నాయి. రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రం నిర్మించనున్న కాల్వల వ్యవస్థనే అనుసంధానం ప్రాజెక్టు అవసరాలకూ వాడుకోవాలి.⇒అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నీటిని నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి.. అక్కడి నుంచి కావేరికి తరలించాలని ప్రతిపాదించారు. అయితే కీలకమైన కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు వచ్చే వరకు సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకోరాదు. సాగర్ నిర్వహణ ప్రొటోకాల్‌తోపాటు ఏపీ, తెలంగాణలకు నీటి కేటాయింపులపై స్పష్టత వచ్చాకే ఈ విషయంలో ముందుకు వెళ్లాలి.50 శాతం వాటా మినహా మిగతావి ఓకే: ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్అనుసంధానం ప్రాజెక్టు ద్వారా తరలించే జలాల్లో తెలంగాణకు 50 శాతం కేటాయించాలనే డిమాండ్ విషయంలో పట్టువీడాలని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్ కోరారు. రెండు కొత్త జలాశయాల నిర్మాణం, సమ్మక్క బరాజ్ నుంచే నీటి తరలింపు, ఛత్తీస్‌గఢ్ నుంచి సమ్మతి తీసుకోవడం తదితర అంశాలన్నింటి పట్ల సానుకూలంగా ఉన్నామని తెలిపారు. తదుపరి చర్చల్లో ఈ అంశాలపై మరింత పురోగతి సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పెద్ద మనసుతో ముందుకొచ్చి ఎంఓయూ చేసుకోవాలని కోరారు.గౌరవెల్లి కాల్వల పనులకు అనుమతిసాక్షి, హైదరాబాద్: శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు–ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ (ఐఎఫ్ఎఫ్సీ) ప్రాజెక్టులోని ప్యాకేజీ– 7లో భాగంగా గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీళ్లను తరలించే కాల్వల నిర్మాణం కోసం రూ.431.30 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనాపరమైన అనుమ తులు జారీ చేస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. హుస్నాబాద్, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల పరిధి లోని 1,06,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ఈ పనులు చేపట్టనున్నారు. భూసేకరణలో పురోగతితో సంబంధం లేకుండా మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. -
1 నుంచి ‘ఉపాధి’కి ఆధార్ చెల్లింపులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు సెప్టెంబరు 1వతేదీ నుంచి పూర్తి స్థాయిలో ఆధార్‌తో అనుసంధానం చేసిన బ్యాంకు అకౌంట్లకు మాత్రమే వేతనాలు చెల్లింపులు చేస్తారు. ఉపాధి హామీ జాబ్ కార్డు నెంబరుతో పాటు ఆధార్, బ్యాంకు ఖాతాలను ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటేనే ఆయా ఖాతాలకు వేతనాలు జమ అవుతాయి. ఈ మూడింటినీ అనుసంధానం చేసుకోని వారికి సెప్టెంబరు ఒకటో తేదీ తర్వాత ఉపాధి పథకం పనులకు హాజరైనా వేతనాలు జమ చేసే పరిస్థితి ఉండదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు కీలక మార్పులు తెచ్చింది. దీన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 1వతేదీ నుంచే అమలు చేయాలని తొలుత భావించినా చాలా రాష్ట్రాల్లో (మన రాష్ట్రం కాదు) పెద్ద సంఖ్యలో కూలీల జాబ్‌కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పలు దఫాలు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సెప్టెంబరు ఒకటి నుంచి ఖచ్చితంగా నూతన విధానంలోనే కూలీలకు వేతనాల చెల్లింపులు ఉంటాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసినట్టు అధికారులు వెల్లడించారు. కేంద్రం ఈ ప్రతిపాదనలను తేకముందు నుంచే మన రాష్ట్రంలో ఉపాధి కూలీలకు పాక్షికంగా ఆధార్ అనుసంధానంతో కూడిన వేతనాల చెల్లింపులు కొనసాగుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో పథకం అమలులో పారదర్శకత కోసం వీలైనంత మేర కూలీల జాబ్‌కార్డులను బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించగా మిగతావారికి కూడా ఇప్పటివరకు వేతనాలను చెల్లిస్తున్నారు. అయితే సెప్టెంబరు ఒకటి నుంచి మాత్రం వందకు వంద శాతం తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం విధానంలో వేతనాల చెల్లింపుల ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 99.53 శాతం అనుసంధానం ఆంధ్రప్రదేశ్‌లో 69 లక్షల కుటుంబాలకు చెందిన 1.24 కోట్ల మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఏటా గరిష్టంగా 47.74 లక్షల కుటుంబాలకు సంబంధించి దాదాపు 79.81 లక్షల మంది కూలీలు ఉపాధి పనులతో లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కలిపి గత ఐదేళ్లుగా ఏటా రూ.ఐదారు వేల కోట్లకు తక్కువ కాకుండా ప్రయోజనం చేకూరుతోంది. వేతనాల చెల్లింపుల్లో కేంద్రం తెచ్చిన నూతన విధానంతో ఉపాధి హామీ కూలీలెవరూ ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మొత్తం 1.24 కోట్ల మంది కూలీలలో 99.53 శాతం మంది జాబ్ కార్డులు ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానం ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. గత మూడేళ్లలో ఒక్క రోజైనా ఉపాధి పనులకు హాజరైన క్రియాశీలక కూలీలలో 97.2 శాతం మందిని కూడా ఇప్పటికే అనుసంధానించారు. ఉపాధి పథకం కూలీల జాబ్‌కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. త్రిపుర, కేరళ, లడఖ్, పుదుచ్చేరి, చత్తీస్‌గఢ్, సిక్కిం, తమిళనాడు తరువాత స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న కూలీలలో ఇంకా కేవలం 60 వేల మందికి సంబంధించి మాత్రమే ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. వారు గతంలో పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ ఉపాధి పనులపై పెద్దగా ఆసక్తి చూపని వారే కావచ్చని పేర్కొంటున్నారు. -
Aadhaar-Pan Linking: తరుముకొస్తున్న గడువు.. కానీ వీరికి ఆ టెన్షన్ లేదు!
పాన్‌కు ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిన గడువు తరుముకొస్తోంది. పాన్ ఆధార్ లింక్ కేంద్రం తప్పనిసరి చేసింది. ఇందుకు మార్చి 31 వరకు గడువు విధించింది. ఏప్రిల్ 1 తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్లు చెల్లుబాటు కావని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి గడువును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతం రూ.1000 రుసుం చెల్లించి లింక్ చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. అప్పటికీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోకుంటే ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్ చెల్లదు . ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో పాన్ - ఆధార్ లింక్ చేసుకోవచ్చు. చదవండి: Google Bard: గూగుల్ బార్డ్ అంటే సెర్చ్ మాత్రమే కాదు.. అంతకు మించి.. ఆన్లైన్లో పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ https://incometaxindiaefiling.gov.inను సందర్శించవచ్చు. అలాగే ఎస్సెమ్మెస్ ద్వారా పాన్ ఆధార్ లింక్ చేసుకునేందుకు 567678 లేదా 56161 నంబర్‌కి UIDPAN < SPACE > < 12 అంకెల ఆధార్ నంబర్ > < SPACE > < 10 అంకెల పాన్ నంబర్ > టైప్ చేసి ఎస్మెమ్మెస్ చేయొచ్చు. ఇన్ ఆఫ్‌లైన్ ద్వారా పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలనుకున్న వారు సమీపంలోని పాన్ సర్వీస్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించవచ్చు. వీరికి మినహాయింపు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139ఎఎ ప్రకారం.. పాన్ ఆధార్‌తో లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి అది పనిచేయదు. అయితే దీని నుంచి కొందరికి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 2017 మేలో కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పాన్-ఆధార్ లింకింగ్ నిబంధన నుంచి ఈ నాలుగు వర్గాలకు మినహాయింపు ఉంది. అస్సాం, మేఘాలయ, జమ్మ కశ్మీర్ రాష్ట్రాల వాసులు. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం నాన్-రెసిడెంట్లు. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు. భారతదేశ పౌరులు కాని వారు. చదవండి: బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి! -
ఆధార్‌తో 48 కోట్ల పాన్లు అనుసంధానం
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు వ్యక్తులకు సంబంధించి 48 కోట్ల పాన్లు ఆధార్ డేటాబేస్‌తో అనుసంధానం చేసుకున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. మొత్తం 61 కోట్ల వ్యక్తిగత పాన్లు ఇప్పటి వరకు మంజూరు చేసినట్టు చెప్పారు. అంటే 80 శాతం కార్డులనే అనుసంధానించుకున్నట్టు తెలుస్తోంది. మిగిలిన 13 కోట్ల పాన్ హోల్డర్లు ఈ ఏడాది మార్చి 31లోపు అనుసంధానించుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. అనుసంధానం చేసుకుని పాన్లు పనిచేయకుండా పోతాయన్నారు. దీంతో వ్యాపార, పెట్టుబడులు, పన్నుల సంబంధిత ప్రయోజనాలు నష్టపోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వాస్తవానికి ఆధార్–పాన్ అనుసంధానానికి కేంద్రం ఇచ్చిన గడువు ఎప్పుడో ముగిసింది. దీంతో రూ.1,000 ఫీజు చెల్లించి ఈ ఏడాది మార్చి 31 వరకు అనుసంధానించుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ఎన్నో విడతలుగా గడువు పెంచుకుంటూ, ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన విషయాన్ని నితిన్ గుప్తా వివరించారు. -
ఆధార్‌తో పాన్ లింక్ ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్-పాన్ లింకింగ్‌పై తాజా డెడ్‌లైన్ మార్చి 31లోగా అనుసంధానం చేసుకోవడంలో విఫలమైతే రూ 10,000 జరిమానా, పాన్ కార్డు పనిచేయదని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. కీలక పత్రాలైన ఆధార్ కార్డు, పాన్ కార్డు అనుసంధానంపై కేంద్రం ఇప్పటికే పలుమార్లు గడువు తేదీలను పొడిగించింది. ఇప్పటికీ చాలా మంది ఆధార్‌తో పాన్ అనుసంధానం చేయని వారు పెద్దసంఖ్యలో ఉన్నారు. తాజా డెడ్‌లైన్‌లోగా ఈ రెండింటినీ లింక్ చేసుకోవాల్సి ఉండగా వీటి అనుసంధానానికి అవసరమైన దశలను చూద్దాం. ఆధార్‌తో పాన్ లింక్ చేసుకోవడం సులభమే. అయితే కొన్ని సందర్భాల్లో రెండు అనుసంధానం కాకపోవచ్చు. ఆధార్, పాన్ కార్డుల్లో పేరు, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలు వేర్వేరుగా ఉన్నా కూడా రెండు లింక్ కావు. ఆధార్ కార్డును యూఐడీఏఐ జారీ చేస్తే, పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. పాన్, ఆధార్ కార్డుల్లో పేరు, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలు వేర్వేరుగా ఉంటే అప్పుడు ఆధార్, పాన్ కార్డుల్లో వివరాలను సరిచేయాలి. ఆధార్ కార్డులో తప్పుగా ఉన్న పేరును మార్చుకోవాలంటే https://ssup.uidai.gov.in/ssup/login.html లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్లో లేదా ఎన్రోల్మెంట్ సెంటర్‌కు వెళ్లి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఆదాయ పన్నుశాఖ వెబ్సైట్ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html లో పాన్ వివరాలను సరిచేసుకోవచ్చు. వివరాలు ఏమీ తప్పుగా లేకపోతే ఆన్లైన్, ఎస్ఎంఎస్, పాన్ కేంద్రాల్లో రెండింటిని లింక్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా 567678 లేదా 56161 నెంబర్‌కు యూఐడీపాన్ 12 అంకెల ఆధార్ పది అంకెల పాన్ నెంబర్‌ను ఎస్ఎంఎస్ పంపడం ద్వారా పాన్ ఆధార్ లింకేజ్‌ను పూర్తిచేయవచ్చు. ఇక నేరుగా ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ www.incometaxindiaefiling.gov.in లోకి వెళ్లి పాన్ (యూజర్ ఐడీ), పాస్వర్డ్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి ప్రొఫైల్ సెట్టింగ్ ట్యాబ్‌పై క్లిక్ చేసి లింక్ ఆధార్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ మీ పాన్ ఆధార్ నెంబర్‌తో లింక్ అయినట్టు మెసేజ్ కనిపంచనిపక్షంలో అక్కడ కనిపించే ఫామ్‌లో మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. ఒకసారి మీ వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత స్క్రీన్‌పై సక్సెస్ మెసేజ్ కనిపిస్తుంది. చదవండి : ఆధార్- పాన్ లింకింగ్ : డెడ్‌లైన్ మిస్సయితే భారీ షాక్.. -
ఆధార్- పాన్ లింకింగ్ : డెడ్‌లైన్ మిస్సయితే భారీ షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్-పాన్ అనుసంధానానికి ఆదాయ పన్నుశాఖ తాజా డెడ్‌లైన్ మార్చి 31ని మిస్ అయితే పాన్‌కార్డుదారులకు భారీ షాక్ తప్పదు. ఈ గడువులోగా ఆధార్-పాన్ లింకేజ్ పూర్తిచేయడంలో విఫలమైతే పాన్ కార్డు పనిచేయకపోవడంతో పాటు రూ 10,000 జరిమానా విధించనున్నట్టు ఐటీ శాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. పనిచేయని పాన్ కార్డు వాడినట్టు తేలితే వారికి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 272 బీ కింద రూ 10,000 పెనాల్టీ విధిస్తారు. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడంలో విఫలమైన వారు పన్ను చెల్లింపులు మినహా బ్యాంక్ ఖాతా తెరిచేందుకు గుర్తింపు కార్డుగా వాడటం వంటి వెసులుబాటు ఉన్నా రూ 50,000 మించి లావాదేవీలు జరిపే క్రమంలో రూ 10,000 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయని వారి పాన్ ఏప్రిల్ 1 నుంచి పనిచేయదు..అయితే ఆధార్‌తో అనుసంధానం పూర్తి చేసిన అనంతరం వారి పాన్ కార్డు తిరిగి పనిచేస్తుంది. చదవండి : ఆధార్‌తో పాన్ లింకింగ్ ఇలా.. -
పాన్, ఆధార్ లింక్ : మరోసారి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు డెడ్‌లైన్‌ను ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. గతంలో సెప్టెంబర్ 30లోగా ఈ ప్రక్రియను ముగించాలని నిర్ధేశించగా తాజాగా ఆ గడువును డిసెంబర్ 31 వరకూ పొడిగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా పాన్ కార్డును ఇంకా ఆధార్‌తో లింక్ చేసుకోని వారికి ప్రభుత్వ నిర్ణయం ఊరట ఇస్తోంది. నిర్ధేశిత డెడ్‌లైన్‌లోగా పాన్‌తో ఆధార్ లింక్ కాకుంటే పాన్ కార్డు పనిచేయదు. ఈ క్రమంలో పాన్‌ను తప్పనిసరిగా పేర్కొనాల్సిన ఆర్థిక లావాదేవీలను కొనసాగించడంలో తమ పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయని వ్యక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి. -
బ్యాంకు ఖాతాకు ఆధార్ తప్పనిసరి
ముంబై: బ్యాంకు ఖాతాలను ఆధార్ నంబరుతో అనుసంధానించడం తప్పనిసరి అంటూ భార తీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) శనివారం స్పష్టతనిచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)కు తీసుకొచ్చిన సవరణలను అనుసరించి బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించుకోవాల్సిందేనంది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానంపై ఆర్బీఐ అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదంటూ మీడియాలో వస్తున్న వదంతులకు రిజర్వు బ్యాంకు స్పందించి తాజా ప్రకటన విడుదల చేసింది. డిసెంబరు 31కల్లా అన్ని బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించాలని జూన్‌లోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. బ్యాంకు వారికి ఆధార్‌ను ఇవ్వకపోతే ఖాతాను నిలిపివేస్తామనీ, రూ.50 వేలకు పైబడి జరిపే లావాదేవీలకు కూడా ఆధార్ తప్పనిసరని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. అలాగే పన్ను ఎగవేతదారులకు కళ్లెం వేసేందుకు ఆధార్, పాన్‌ను అనుసంధానించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయడం విదితమే. -
గడువు లోపు ఆధార్-పాన్ లింక్ తప్పదా?
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చెల్లింపుదారుల పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని యుఐడిఎఐ సీఈఓ అజయ్ భూషణ్ పాండే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆధార్-పాన్ అనుసంధానానికి డెడ్‌లైన్ యధావిధిగా కొనసాగుతుదని వెల్లడించారు. ఈ నెల చివరి నాటికి పన్ను చెల్లింపుదారులు ఆధార్‌తో వారి పాన్ నంబర్ లింక్ చేయాలని మరోసారి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తాజా నేపథ్యంలో ఈ నిబంధనపై ఎలాంటి మార్పు వుంటుందని ప్రశ్నించినపుడు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆగస్టు 31 తో పొడిగించిన గడువు నాటికి ఆధార్‌తో పాన్ జతచేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు (గోప్యత మౌలికమైన హక్కు) అనే అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆదాయ పన్ను చట్టంలోని ఒక సవరణ ద్వారా ఇది తప్పనిసరి అవుతుందని పాండే స్పష్టం చేశారు. సుప్రీం ఆర్డర్ నేపథ్యంలో తమ వివరాలు ఇవ్వడానికి ఎవరైనా తిరస్కరించారా అని అడిగిన ప్రశ్నకు పాండే ఇప్పటివరకూ అలాంటి లేదన్నారు. ఎందుకంటే ఆధార్ చట్టం చెల్లుబాటు అయ్యే చట్టమనీ, సుప్రీం తాజా తీర్పులో ఆధార్ చట్టంపై ఏమీ వ్యాఖ్యానించలేదని చెప్పారు. ఆధార్ చట్టం ప్రజల గోప్యతను ఒక మౌలికమైన హక్కుగా పరిరక్షిస్తుందని యు.ఐ.డిఎఐ సీఈఓ తెలిపారు. అలాంటి అంతర్గతంగా గోప్యతా రక్షణ నిబంధనలు కలిగి ఉంది. వ్యక్తిగత డేటాను కాపాడేందుకు, అటువంటి డేటాను ఎలా ఉపయోగించవచ్చో దాని నిబంధనలు పొందు పరిచాం కాబట్టి, వ్యక్తి యొక్క సమ్మతి లేకుండా డేటా భాగస్వామ్యం చేయబడదని తెలిపారు. జాతీయ భద్రత వంటి పరిస్థితులలో మినహా, ఈ వివరాలను ఎవరితోనూ పంచుకోలేరని, అదికూడా కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అనుమతి కావాల్సి ఉంటుందని చెప్పారు. ఉపయోగ పరిమితి, షేరింగ్ పరిమితి, పర్పస్ పరిమితిని లాంటి అన్ని ఈ పరిమితులు, నిబంధనలతో ఆధార్ చటాన్ని రూపొందించామన్నారాయన.