సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్-పాన్ అనుసంధానానికి ఆదాయ పన్నుశాఖ తాజా డెడ్‌లైన్ మార్చి 31ని మిస్ అయితే పాన్‌కార్డుదారులకు భారీ షాక్ తప్పదు. ఈ గడువులోగా ఆధార్-పాన్ లింకేజ్ పూర్తిచేయడంలో విఫలమైతే పాన్ కార్డు పనిచేయకపోవడంతో పాటు రూ 10,000 జరిమానా విధించనున్నట్టు ఐటీ శాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. పనిచేయని పాన్ కార్డు వాడినట్టు తేలితే వారికి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 272 బీ కింద రూ 10,000 పెనాల్టీ విధిస్తారు.
పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడంలో విఫలమైన వారు పన్ను చెల్లింపులు మినహా బ్యాంక్ ఖాతా తెరిచేందుకు గుర్తింపు కార్డుగా వాడటం వంటి వెసులుబాటు ఉన్నా రూ 50,000 మించి లావాదేవీలు జరిపే క్రమంలో రూ 10,000 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయని వారి పాన్ ఏప్రిల్ 1 నుంచి పనిచేయదు..అయితే ఆధార్‌తో అనుసంధానం పూర్తి చేసిన అనంతరం వారి పాన్ కార్డు తిరిగి పనిచేస్తుంది.
చదవండి : ఆధార్‌తో పాన్ లింకింగ్ ఇలా..
Comments
Please login to add a commentAdd a comment