పాన్ - ఆధార్ కార్డ్ లింక్ చేశారా? లేదంటే ఇప్పుడే చేయండి. ఎందుకంటే? దేశంలో ఆధార్ - పాన్ లింక్ చేయలేని కారణంగా దేశంలో మొత్తం 11.5 కోట్ల పాన్‌కార్డ్‌లు డీయాక్టివేట్ అయినట్లు తేలింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం ద్వారా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌ల అనుసంధానానికి సంబంధించిన వివరాల్ని కోరారు. ఆయన అభ్యర్ధనపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) స్పందించింది.
డెడ్‌లైన్ తర్వాత ఫైన్
జూలై 1, 2017 తర్వాత తీసుకున్న పాన్‌కార్డ్‌లను - ఆధార్‌కు ఆటోమేటిక్‌గా లింక్ అయ్యాయి. అయినప్పటికీ, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA సబ్-సెక్షన్ (2) ప్రకారం, ఆ తేదీకి ముందు పాన్ కార్డ్‌లను పొందిన వారు ఆధాన్-పాన్‌ను మాన్యువల్‌గా లింక్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎలాంటి చెల్లింపులు లేకుండా ఈ ఏడాది జూన్ 30 వరకు జత చేసుకునే అవకాశం కల్పించింది. జులై 1 నుంచి ఆధార్- పాన్‌ను జతచేయాలంటే రూ.1000 చెల్లించి యాక్టివేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
వెయ్యి ఎందుకు చెల్లించాలి
రూ. 1,000 జరిమానా చెల్లించడంపై గౌర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త పాన్ కార్డ్ ధర రూ. 91 (జీఎస్టీ మినహాయింపు ఉంది.). ‘అప్పుడు పాన్ కార్డును తిరిగి యాక్టివేట్ చేసేందుకు ప్రభుత్వం 10 రెట్ల జరిమానా ఎలా విధిస్తుంది ? అలాగే, పాన్ కార్డులు డీయాక్టివేట్ చేయబడిన వ్యక్తులు ఆదాయపు పన్నును ఎలా ఫైల్ చేస్తారు? ప్రభుత్వం పునరాలోచించి, పాన్‌తో లింక్ చేయడానికి కనీసం ఒక సంవత్సరం కాలపరిమితిని పొడిగించాలి అని గౌర్ అన్నారు.
దేశంలో 70.24 కోట్ల మంది పాన్‌కార్డ్ హోల్డర్లు
మనదేశంలో 70.24 కోట్ల మంది పాన్ కార్డ్ హోల్డర్లలో 57.25 కోట్ల మంది తమ పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించారు. 11.5 కోట్ల పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానం చేయలేదు. కాబట్టే అవి డీయాక్టివేట్ అని ఆర్టీఐ సమాధానంలో పేర్కొంది.
పాన్-ఆధార్ లింక్ అయ్యిందా? లేదా ఇలా తెలుసుకోండి
స్టెప్ 1: https://www.incometax.gov.in/iec/foportal/ ద్వారా ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ని సందర్శించండి
స్టెప్ 2: పేజీకి ఎడమ వైపున ఉన్న 'క్విక్ లింక్‌లు' క్లిక్ చేయండి. అనంతరం 'లింక్ ఆధార్ స్టేటస్'పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: మీ 10 అంకెల పాన్ నంబర్, 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
స్టెప్ 4: తర్వాత 'వ్యూ లింక్ ఆధార్ స్టేటస్'పై క్లిక్ చేయండి.
స్టెప్ 5: ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఇప్పటికే లింక్ చేయబడి ఉంటే చూపబడుతుంది. ఆధార్ లింక్ చేయకపోతే.. మీ సేవా సెంటర్‌లలో వాటిని లింక్ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment