గడువు లోపు ఆధార్-పాన్ లింక్ తప్పదా?
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చెల్లింపుదారుల పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని యుఐడిఎఐ సీఈఓ అజయ్ భూషణ్ పాండే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆధార్-పాన్ అనుసంధానానికి డెడ్‌లైన్ యధావిధిగా కొనసాగుతుదని వెల్లడించారు. ఈ నెల చివరి నాటికి పన్ను చెల్లింపుదారులు ఆధార్‌తో వారి పాన్ నంబర్ లింక్ చేయాలని మరోసారి స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు తాజా నేపథ్యంలో ఈ నిబంధనపై ఎలాంటి మార్పు వుంటుందని ప్రశ్నించినపుడు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆగస్టు 31 తో పొడిగించిన గడువు నాటికి ఆధార్‌తో పాన్ జతచేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు (గోప్యత మౌలికమైన హక్కు) అనే అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆదాయ పన్ను చట్టంలోని ఒక సవరణ ద్వారా ఇది తప్పనిసరి అవుతుందని పాండే స్పష్టం చేశారు. సుప్రీం ఆర్డర్ నేపథ్యంలో తమ వివరాలు ఇవ్వడానికి ఎవరైనా తిరస్కరించారా అని అడిగిన ప్రశ్నకు పాండే ఇప‍్పటివరకూ అలాంటి లేదన్నారు. ఎందుకంటే ఆధార్ చట్టం చెల్లుబాటు అయ్యే చట్టమనీ, సుప్రీం తాజా తీర్పులో ఆధార్ చట్టంపై ఏమీ వ్యాఖ్యానించలేదని చెప్పారు.
ఆధార్ చట్టం ప్రజల గోప్యతను ఒక మౌలికమైన హక్కుగా పరిరక్షిస్తుందని యు.ఐ.డిఎఐ సీఈఓ తెలిపారు. అలాంటి అంతర్గతంగా గోప్యతా రక్షణ నిబంధనలు కలిగి ఉంది. వ్యక్తిగత డేటాను కాపాడేందుకు, అటువంటి డేటాను ఎలా ఉపయోగించవచ్చో దాని నిబంధనలు పొందు పరిచాం కాబట్టి, వ్యక్తి యొక్క సమ్మతి లేకుండా డేటా భాగస్వామ్యం చేయబడదని తెలిపారు.
జాతీయ భద్రత వంటి పరిస్థితులలో మినహా, ఈ వివరాలను ఎవరితోనూ పంచుకోలేరని, అదికూడా కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అనుమతి కావాల్సి ఉంటుందని చెప్పారు. ఉపయోగ పరిమితి, షేరింగ్ పరిమితి, పర్పస్ పరిమితిని లాంటి అన్ని ఈ పరిమితులు, నిబంధనలతో ఆధార్ చటాన్ని రూపొందించామన్నారాయన.