న్యూఢిల్లీ: ఇప్పటి వరకు వ్యక్తులకు సంబంధించి 48 కోట్ల పాన్‌లు ఆధార్ డేటాబేస్‌తో అనుసంధానం చేసుకున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. మొత్తం 61 కోట్ల వ్యక్తిగత పాన్‌లు ఇప్పటి వరకు మంజూరు చేసినట్టు చెప్పారు. అంటే 80 శాతం కార్డులనే అనుసంధానించుకున్నట్టు తెలుస్తోంది. మిగిలిన 13 కోట్ల పాన్ హోల్డర్లు ఈ ఏడాది మార్చి 31లోపు అనుసంధానించుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
అనుసంధానం చేసుకుని పాన్‌లు పనిచేయకుండా పోతాయన్నారు. దీంతో వ్యాపార, పెట్టుబడులు, పన్నుల సంబంధిత ప్రయోజనాలు నష్టపోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వాస్తవానికి ఆధార్–పాన్ అనుసంధానానికి కేంద్రం ఇచ్చిన గడువు ఎప్పుడో ముగిసింది. దీంతో రూ.1,000 ఫీజు చెల్లించి ఈ ఏడాది మార్చి 31 వరకు అనుసంధానించుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ఎన్నో విడతలుగా గడువు పెంచుకుంటూ, ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన విషయాన్ని నితిన్ గుప్తా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment