న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థులకు కుల, నివాస ధ్రువపత్రాలను ఇచ్చేముందు వాటిని వారి ఆధార్ కార్డులతో జత చేయాలని కేంద్ర ప్రభుత్వం ...రాష్ట్రాలను కోరింది. ఐదు, ఎనిమిదో తరగతులు చదువుతున్న విద్యార్థులకు దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి 60 రోజుల్లోగా ఈ ధ్రువపత్రాలు అందేలా చూడాలని కోరింది.
ఎస్సీ, ఎస్టీలకు విద్యార్థులకు అందిస్తున్న స్కాలర్ షిప్ లలో ప్రతి ఏడాది జాప్యం జరుగుతోందని ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కుల, నివాస పత్రాలను ఇవ్వడానికి ప్రభుత్వ అధికారులు తమ చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారని రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాయి. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ పాస్ లో ఉన్న విద్యార్థుల జాబితాలతో ఆధార్ ను లింక్ చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కోరింది.