న్యూఢిల్లీ: ముంబయిలో 26..11 దాడులకు సంబంధించి వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీకి చెందిన హురియత్ కాన్ఫరెన్స్ సభ్యుడు ఫిరదౌస్ అహ్మద్ షాకు, దాడులకు ఆర్థిక సాయం చేసిన వారికి మధ్య సంబంధాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ)ని ఆదేశించింది.
డెమొక్రాటిక్ పొలిటికల్ మూవ్‌మెంట్ చైర్మన్ అయిన షా 2007-2010 మధ్యలో ఇటలీకి చెందిన ‘మదీనా ట్రేడింగ్ కంపెనీ నుంచి 3కోట్ల రూపాయలను పొందినట్లు కశ్మీర్ లోయలో ఇటీవల ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ముంబయి దాడుల సమయంలో కూడా 8364307716-0 నెంబర్‌కు వాయిస్ ఓవర్ ఇంటర్‌నెట్ ప్రొటొకాల్ యాక్టివేట్ కోసం 229 అమెరికన్ డాలర్ల పేమెంట్ మదీనా ట్రేడింగ్ ద్వారానే జరిగింది. దీంతో.. వీరి సంబంధాలపై నివేదికను హోంశాఖ కోరింది.
ముంబయి దాడులతో గిలానీ లింకేమిటి?
Published Tue, Jul 21 2015 9:11 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM
Advertisement