
గోదావరిఖనిటౌన్: ఇది ఫ్యాక్టరీ కాదు, పెద్ద వ్యాపార సంస్థ అంతకన్నా కాదు. కేవలం ఒక చిన్నపాటి రేకుల షెడ్డు. దీనికి వచ్చిన నెల విద్యుత్ బిల్లు అక్షరాల రూ.6 లక్షలు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంజయ్‌నగర్‌కు చెందిన మాస రాజయ్యకు ఆగస్టు నెలకు సంబంధించిన విద్యుత్ బిల్లు రూ.6,08,000 వచ్చింది.
ఇది ఏమిటని అడిగితే సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెలకు ఇంత బిల్లు ఎలా వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం కూడా అధికారులు చేయడం లేదని రాజయ్య తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వాస్తవ బిల్లును ఇవ్వాలని కోరుతున్నాడు.