Shed
-
కరెంట్ ఇచ్చే పార్కింగ్ షెడ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం(ఐడీవోసీ–కలెక్టరేట్)లో మొదటగా ఖమ్మంలో సోలార్షెడ్ ఏర్పాటు చేశారు. ఐడీవోసీలో 38కిపైగా శాఖల ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండగా వారి వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి సౌకర్యం లేదు. దీంతో అధికారులు సోలార్ ప్యానళ్లతో కూడిన పార్కింగ్ షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.1.78 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ఇప్పటికే పూర్తికాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించనున్నారు. 200 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఈ సోలార్ ప్యానళ్ల ద్వారా రోజుకు 800 నుంచి వెయ్యి యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతోంది. ఈ మొత్తాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేసి కలెక్టరేట్ అవసరాలు పోగా మిగిలిన విద్యుత్‌కు మాత్రమే బిల్లు చెల్లించనున్నారు. సోలార్ షెడ్‌తో నెలకు సుమారు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు విద్యుత్‌చార్జీలు ఆదా కావడమే కాక ఉద్యోగులకు చెందిన వందలాది వాహనాల పార్కింగ్‌కు సౌకర్యం కల్పించినట్లవుతోంది. సోలార్ ప్లాంట్‌తో ఐడీవోసీ భవనమంతా గ్రీన్ బిల్డింగ్‌గా మారనుంది. ఈవిధంగా రాష్ట్రంలోనే తొలి కలెక్టరేట్‌గా ఖమ్మం ఐడీవోసీ నిలుస్తోంది. -
ఇళ్లల్లోకి దుర్వాసన రావడంతో...
రంగారెడ్డి, కొత్తూరు: జంతు కళేబరాలతో కంపు కొడుతున్న ఓ షెడ్‌కు అధికారులు తాళం వేశారు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని ఓ షెడ్లో జంతుకళేబరాలను నిల్వ చేయడంతో ఇళ్లల్లోకి దుర్వాసన వస్తోంది. ఇది గుర్తించిన స్థానికులు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం షెడ్‌ను పరిశీలించిన అధికారులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న జంతు కళేబరాలను చూసి అవాక్కయ్యారు. తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ జ్యోతి, పోలీసులు షెడ్లోని జంతుకళేబరాలతో తయారు చేస్తున్న ఉత్పత్తులను పరిశీలించారు. అధికారులు వచ్చే సరికి షెడ్లో పనిచేస్తున్న సిబ్బంది పరారయ్యారు. ఇతర ప్రాంతాల నుంచి డీసీఎంలో తెచ్చిన జంతుకళేబరాలు, అవయవాలు దీంతో షెడ్‌కు తాళం వేసినఅనంతరం అధికారులు మాట్లాడుతూ.. ఏపీకి చెందిన కొంతమంది వ్యాపారులు తిమ్మాపూర్ శివారులో హరిప్రోటీన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ షెడ్‌ను అద్దెకు తీసుకొని దాంట్లో జంతుకళేబారాలతో పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. కాగా ఉత్పత్తుల తయారీ కోసం అన్ని శాఖల అనుమతులు తీసుకున్నారా..? ఇక్కడ కళేబరాలు, అవయవాలతో వంటనూనె తయారు చేస్తున్నారా..? లేక ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నారా.? అనే విషయాలు తెలాల్సి ఉందన్నారు. షెడ్లో తయారు చేస్తున్న ఉత్పత్తుల విషయాన్ని తాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తహసీల్దార్ చెప్పారు. ఇదిలా ఉండగా నిర్వాహకుల్లో కొందరు మాట్లాడుతూ.. తాము జంతుకళేబరాలతో వంటనూనె తయారు చేయడం లేదన్నారు. ఆక్వాఫుడ్(చేపల ఆహారం) ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అన్ని అనుమతులు తీసుకున్నట్లు చెప్పారు. -
మనసు చలించింది...
సాక్షి, కణేకల్లు: నిరాశ్రయులైన స్థానిక ఓ వృద్ధ దంపతుల దయనీయ పరిస్థితిని ఫేస్బుక్ ద్వారా తెలుసుకున్న హైదరాబాదీలు స్పందించారు. అక్కడి నుంచి వచ్చి శాశ్వత షెడ్ ఏర్పాటు చేయించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కణేకల్లులో అంజినమ్మ, రామాంజినేయులు వృద్ధ దంపతులు. ఎవరి తోడు లేక మెయిన్‌రోడ్డులోని ఓ పూరిగుడిసెలో నివాసముంటున్నారు. ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ వారు పడుతున్న వేదనను స్థానిక యువకుడు వినోద్ (సప్తగిరి చిన్న) ఫేస్బుక్లో హలో యాప్ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చాడు. ఈ విషయాన్ని హలో యాప్ ద్వారా చూసిన ఫీడ్ ది హంగర్ ఫర్ కేఎస్కే ఆర్గనైజేషన్ సభ్యులు కావ్య, శ్రీకాంత్, కృష్ణ చలించిపోయారు. వినోద్‌ను ఫోన్ ద్వారా సంప్రదించి, మరింత సమాచారాన్ని రాబట్టుకున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి కణేకల్లుకు చేరుకున్న వారు పూరిగుడిసెను తొలగించి, పటిష్టమైన రేకుల షెడ్ వేసి, వృద్ధ దంపతులను అందులో చేర్చారు. ఇందు కోసం దాదాపు రూ. 30 వేలు ఖర్చు పెట్టారు. వీరి ఔదార్యాన్ని చూసిన స్థానిక యువకులు బాషా, సంతోష్, రమేష్, జావీద్, జాకీర్, పాషా అందులో సభ్యులుగా చేరి, షెడ్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. పాత గుడిసెను తొలగిస్తున్న కేఎస్కే టీమ్ ఎవరు వీరు.. హైదరాబాద్‌లోని రివ్లోన్ కాస్మోటిక్ కంపెనీలో సౌత్ ట్రైనర్‌గా కావ్య, సేల్స్ మేనేజర్‌గా కృష్ణ పనిచేస్తున్నా్నరు. శ్రీకాంత్ ఇంకా చదువుకుంటున్నారు. వీరు ముగ్గురు స్నేహితులు. తమ సంపాదనలో కొంత మేర నిరుపేదల కోసం వెచ్చిస్తున్నారు. ప్రతి ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వద్ద స్వయంగా వంటలు చేసి నిరుపేదల ఆకలి దప్పికలు తీరుస్తుంటారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తుంటారు. నిరాశ్రయులుగా ఉన్న వృద్ధ దంపతులు -
రేకుల షెడ్డు కరెంట్ బిల్లు రూ.6 లక్షలు
గోదావరిఖనిటౌన్: ఇది ఫ్యాక్టరీ కాదు, పెద్ద వ్యాపార సంస్థ అంతకన్నా కాదు. కేవలం ఒక చిన్నపాటి రేకుల షెడ్డు. దీనికి వచ్చిన నెల విద్యుత్ బిల్లు అక్షరాల రూ.6 లక్షలు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంజయ్‌నగర్‌కు చెందిన మాస రాజయ్యకు ఆగస్టు నెలకు సంబంధించిన విద్యుత్ బిల్లు రూ.6,08,000 వచ్చింది. ఇది ఏమిటని అడిగితే సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెలకు ఇంత బిల్లు ఎలా వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం కూడా అధికారులు చేయడం లేదని రాజయ్య తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వాస్తవ బిల్లును ఇవ్వాలని కోరుతున్నాడు. -
విరుచుకుపడిన గాలివాన
షెడ్డు కూలి 309 గొర్రెలు మృతి కన్నీరుమున్నీరైన రైతులు గొల్లప్రోలు (పిఠాపురం) : గొర్రెల మందపై గాలివాన విరుచుకుపడడంతో వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న పెంపకందారులు జీవనోపాధి కోల్పోయారు. శుక్రవారం రాత్రి కురిసిన గాలివానకు దుర్గాడలో 309 గొర్రెలు మృతి చెందగా మరో 32 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గాలివాన తీవ్రతకు గొర్రెలు, మేకల మంద గ్రామానికి చెందిన పూసల సత్తిరాజు పొలంలో నిర్మాణం చేపట్టిన పట్టు పురుగుల పెంపకం షెడ్డు నీడకు చేరాయి. గాలి తీవ్రత ఎక్కువ కావడంతో షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలింది. షెడ్డు గోడలు, పైకప్పు దూలాలు గొర్రెలు, మేకలపై పడడంతో అవి చనిపోయాయి. ఈ ఘటనలో గొర్రెల రైతు కపిలేశ్వరపు పాపారావు, కాపరి ఉగ్గిరాల తమ్మియ్యకు గాయాలు కావడంతో చికిత్స కోసం గ్రామానికి తరలించారు. రాత్రివేళ ఈ సంఘటన జరగడంతో ఏమీ తెలియని పరిస్థితి నెలకొంది. మొదట వంద గొర్రెల వరకు మృతి చెందాయనుకున్నారు. తెల్లారిచూసేసరికి మృతి చెందిన గొర్రెల సంఖ్య 309కు చేరింది. దుర్ఘటన జరిగిన సమయంలో ఏడుగురు రైతులకు చెందిన 600 మేకలు, గొర్రెలు ఉన్నాయి. తాటిపర్తి శ్రీనుకు చెందిన 55, గారపాటి వీరబ్బాయికు చెందిన 75, గారపాటి సత్తిబాబుకు చెందిన 45, పల్లా గోవిందుకు చెందిన 34, తాటిపర్తి సత్తిరాజుకు చెందిన 30, కపిలేశ్వరపు పాపారావుకు చెందిన 30, తాటిపర్తి సూరిబాబుకు చెందిన 40 గొర్రెలు మృతి చెందాయి. వీటితో పాటు మరో 32 గొర్రెలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. పరిశీలించిన అధికారులు సంఘటనా స్థలాన్ని కాకినాడ ఆర్డీఓ ఎల్. రఘుబాబు, తహసీల్దార్ వై.జయ, పశుసంవర్ధక శాఖ డీడీ శ్రీనివాస్, ఏడీ డాక్టర్ దినకర్, పశువైద్యాధికారి డాక్టర్ ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు మడికి ప్రసాద్, టీడీపీ నాయకులు ఎస్‌వీఎస్‌ఎ¯ŒS రవివర్మ, మండల టీడీపీ అధ్యక్షుడు బవిరిశెట్టి రాంబాబు, స్థానిక నాయకులు కొమ్మూరి కృష్ణ, తూము బాబు తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఆర్డీఓ రఘుబాబు మాట్లాడుతూ గొర్రెలకు ఇన్సూరె¯Œ్స చేయిస్తే బీమా పరిహారం అందుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టంపై ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వపరంగా పరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. కన్నీరు మున్నీరైన పెంపకందారులు తమ జీవనాధారం కోల్పోవడంతో గొర్రెల పెంపకందారులు కన్నీరుమున్నీరయ్యారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న గొర్రెలు కళ్లెదుటే విలవిలా కొట్టుకుని మృత్యువాతపడ్డాయని గారపాటి వీరబ్బాయి, తాటిపర్తి సత్తిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తాము పెంచుకుంటున్న మొత్తం గొర్రెలు మృత్యువాత పడ్డాయన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. -
రేకులషెడ్కు రూ. లక్షల విద్యుత్ బిల్లు
నరసరావుపేట: తప్పుడు తడకలుగా వస్తున్న విద్యుత్ బిల్లులు చూసి వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. నరసరావుపేటలో రేకులషెడ్డులో నివాసం ఉంటున్న ఓ సామాన్య మెకానిక్కు రూ.6 లక్షలకుపైగా బిల్లు రావడంతో ఆందోళనకు గురయ్యాడు. వివరాలు... పట్టణంలోని పెద్దచెరువు 9వ లైనులో పార్కు పక్క వీధిలో షేక్.మొహిద్దీన్సాహెబ్కు స్వగహం ఉంది. దీని పైభాగంలో ఉన్న రేకులషెడ్డులో షేక్.జాన్‌సైదా గత రెండేళ్ళ నుంచి భార్య, ఇద్దరు చిన్నపిల్లలతో అద్దెకు ఉంటున్నారు. అతడు పలనాడు రోడ్డులోని ఓ ద్విచక్రవాహనాల షోరూమ్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ప్రతి నెలా జాన్‌సైదాకు రూ.450లు నుంచి రూ.550లవరకు విద్యుత్ బిల్లు వస్తుంది. ఈనెలలో జూన్–జూలైకు చెందిన బిల్లు రూ.6,78,858లు వచ్చింది. ఆ బిల్లును చూడగానే అతడు షాక్‌కు గురయ్యాడు. ఆ ప్రాంత లైన్మెన్కు తెలియచేయగా బిల్లును సరిచేయిస్తామని హామీ ఇచ్చారు. -
గోడ కూలి చిన్నారి మృతి
ఆత్మకూరురూరల్: నల్లకాల్వ గ్రామంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో గోడకూలి చిన్నారి మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామంలోని ప్రేమజ్యోతి, ప్రేమ్‌కుమార్ దంపతులకు 6 నెలల క్రితం కుమార్తె పుట్టింది. ఇంకా పేరు కూడా పెట్టలేదు. వీరు రేకులషెడ్డులో నివాసం ఉంటున్నారు. చిన్నారిని ఊయలలో నిద్రపుచ్చిన తల్లి ప్రేమజ్యోతి, అమ్మమ్మ శేషమ్మలు పక్కనే నిద్రించారు. కాగా పక్కనున్న మిద్దె గోడ కూలి రేకుల షెడ్‌పై పడింది. దీంతో ఊయలలో నిద్రిస్తున్న చిన్నారి తీవ్రంగా గాయపడి మతి చెందింది. చిన్నారి తల్లి, అమ్మమ్మలకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. -
మామిడి తోటలో గుర్తుతెలియని మహిళ శవం
కోరుట్ల రూరల్ : మండలంలోని కల్లూర్‌రోడ్ మాదాపూర్ శివారులోని మామిడి తోటలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని బుధవా రం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గ్రామ శివారులోని ఓ మామిడి తోట నుంచి దుర్వాసన రావడంతో సమీపంలో పనిచేస్తున్న కూలీలు వెళ్లి చూశారు. తోటలో ఉన్న షెడ్డులో కుళ్లి పోయిన మహిళ మృత దేహం కనిపించిం ది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై బాబూరావు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముఖం పూర్తిగా కుళ్లిపోవడంతో గుర్తుపట్టలేకుండా ఉంది. ఒంటి పై నీలి రంగు చీర, ఎడమ చేతికి వాచీ ఉంది. మహిళ వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.