రేకులషెడ్‌కు రూ. లక్షల విద్యుత్ బిల్లు
Published Sat, Jul 30 2016 7:59 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
నరసరావుపేట: తప్పుడు తడకలుగా వస్తున్న విద్యుత్ బిల్లులు చూసి వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. నరసరావుపేటలో రేకులషెడ్డులో నివాసం ఉంటున్న ఓ సామాన్య మెకానిక్‌కు రూ.6 లక్షలకుపైగా బిల్లు రావడంతో ఆందోళనకు గురయ్యాడు. వివరాలు... పట్టణంలోని పెద్దచెరువు 9వ లైనులో పార్కు పక్క వీధిలో షేక్.మొహిద్దీన్‌సాహెబ్‌కు స్వగహం ఉంది. దీని పైభాగంలో ఉన్న రేకులషెడ్డులో షేక్.జాన్‌సైదా గత రెండేళ్ళ నుంచి భార్య, ఇద్దరు చిన్నపిల్లలతో అద్దెకు ఉంటున్నారు. అతడు పలనాడు రోడ్డులోని ఓ ద్విచక్రవాహనాల షోరూమ్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ప్రతి నెలా జాన్‌సైదాకు రూ.450లు నుంచి రూ.550లవరకు విద్యుత్ బిల్లు వస్తుంది. ఈనెలలో జూన్–జూలైకు చెందిన బిల్లు రూ.6,78,858లు వచ్చింది. ఆ బిల్లును చూడగానే అతడు షాక్‌కు గురయ్యాడు. ఆ ప్రాంత లైన్‌మెన్‌కు తెలియచేయగా బిల్లును సరిచేయిస్తామని హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement