Rs. lakhs
-
దొంగ దొరికాడు..
గుంటూరు ఈస్ట్: బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసుకుని బైక్‌పై వెళ్లే వారి వద్ద దోపిడీకి పాల్పడే నిందితుడ్ని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద రూ. 12 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అమరావతి రోడ్డు ముత్యాలరెడ్డినగర్‌కు చెందిన షేక్ హుస్సేన్ పదో తరగతితో చదువు ఆపేసి పురుగుల మందుల దుకాణంలో పని చేసి మానేశాడు. ఆ అనుభవంతో పట్నంబజారులో సొంతంగా పురుగుల మందుల వ్యాపారం చేసి దెబ్బతిన్నాడు. అనంతనం ఫైనాన్స్ వ్యాపారంలోనూ అప్పుల పాలయ్యాడు. ఇక అడ్డదారిలో డబ్బు సంపాదించడానికి పథకం వేశాడు. ఈ క్రమంలోఎక్కువ మొత్తం డ్రా చేసే బ్యాంకుల వద్ద రెక్కీ వేశాడు. 2015 నవంబరులో జిన్నాటవర్ సెంటర్లోని కరూర్ వైశ్యాబ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసి ఒంటరిగా వెళుతున్న వ్యక్తిని వెంటాడాడు. నాజ్‌సెంటర్‌లోని యాక్సెస్ బ్యాంకు అండర్‌గ్రౌండ్‌లో పార్కింగ్ చేసిన అనంతరం ట్యాంకు కవర్లోని రూ. 4.50 లక్షలు చోరీ చేశాడు. 2016 ఫిబ్రవరి 15వ తేదీ అదే బ్యాంకులో డబ్బులు డ్రా చేసి బైక్‌పై వెళుతున్న వ్యక్తిని వెంటాడి పొన్నెకల్లులోని పంచాయతీ కార్యాలయం వద్ద పార్కు చేసిన అనంతరం ట్యాంకు కవర్లోని రూ. 10 లక్షలు దొంగిలించారు. తిరిగి అదే బ్యాంకు వద్ద 2016 ఆగస్టు 18న మరో వ్యక్తిని వెంటాడి నల్లచెరువు తొమ్మిదో లైను బియ్యం షాపు వద్ద పార్కు చేసిన బైక్ కవర్లోని రూ. 4.50 లక్షలు చోరీ చేశాడు. సీసీ కెమెరాల పుటేజీలు స్పష్టంగా లేని కారణంగా పోలీసులు వివిధ కోణాల్లో ఈ వరుస చోరీలపై లోతుగా విచారించారు. హుస్సేన్ నిందితుడని నిర్ధారించి అతని వద్ద రూ. 12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సొమ్మును నిందితుడు జల్సాలకు ఖర్చు పెట్టేశాడు. ఈ కేసు పురోగతిలో ప్రతిభ కనబర్చిన కానిస్టేబుల్ వెంకట్, ఐటీ కోర్ బాలాజీ, శ్రీధర్‌లకు ఎస్పీ రివార్డులు అందించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు సుబ్బరాయుడు, తిరుపాల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
‘ధన’నాథులకు పూజలు
వినాయకచవితి మండపాలను నిర్వాహకులు పోటీ పడి లక్షల రూపాయల నగదుతో అలంకరిస్తున్నారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని మండపాన్ని రూ.27 లక్షల నగదుతో అలంకరించారు. పెదనందిపాడు మండలం కట్రపాడులోని పట్టాభిరామ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని రూ.10 లక్షల నగదుతో అలంకరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మేకతోటి సుచరిత బుధవారం రాత్రి గణనాథుడిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. – పెదనందిపాడు/ మంగళగిరి -
రేకులషెడ్కు రూ. లక్షల విద్యుత్ బిల్లు
నరసరావుపేట: తప్పుడు తడకలుగా వస్తున్న విద్యుత్ బిల్లులు చూసి వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. నరసరావుపేటలో రేకులషెడ్డులో నివాసం ఉంటున్న ఓ సామాన్య మెకానిక్కు రూ.6 లక్షలకుపైగా బిల్లు రావడంతో ఆందోళనకు గురయ్యాడు. వివరాలు... పట్టణంలోని పెద్దచెరువు 9వ లైనులో పార్కు పక్క వీధిలో షేక్.మొహిద్దీన్సాహెబ్కు స్వగహం ఉంది. దీని పైభాగంలో ఉన్న రేకులషెడ్డులో షేక్.జాన్‌సైదా గత రెండేళ్ళ నుంచి భార్య, ఇద్దరు చిన్నపిల్లలతో అద్దెకు ఉంటున్నారు. అతడు పలనాడు రోడ్డులోని ఓ ద్విచక్రవాహనాల షోరూమ్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ప్రతి నెలా జాన్‌సైదాకు రూ.450లు నుంచి రూ.550లవరకు విద్యుత్ బిల్లు వస్తుంది. ఈనెలలో జూన్–జూలైకు చెందిన బిల్లు రూ.6,78,858లు వచ్చింది. ఆ బిల్లును చూడగానే అతడు షాక్‌కు గురయ్యాడు. ఆ ప్రాంత లైన్మెన్కు తెలియచేయగా బిల్లును సరిచేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే నెలాఖరు గడుస్తున్నా ఇప్పటివరకు చర్యలు ఏమీ తీసుకోలేదు. దీంతో అతను ఆందోళన చెందుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసేందుకు సిద్ధమయ్యాడు. -
రేకులషెడ్కు రూ. లక్షల విద్యుత్ బిల్లు
నరసరావుపేట: తప్పుడు తడకలుగా వస్తున్న విద్యుత్ బిల్లులు చూసి వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. నరసరావుపేటలో రేకులషెడ్డులో నివాసం ఉంటున్న ఓ సామాన్య మెకానిక్కు రూ.6 లక్షలకుపైగా బిల్లు రావడంతో ఆందోళనకు గురయ్యాడు. వివరాలు... పట్టణంలోని పెద్దచెరువు 9వ లైనులో పార్కు పక్క వీధిలో షేక్.మొహిద్దీన్సాహెబ్కు స్వగహం ఉంది. దీని పైభాగంలో ఉన్న రేకులషెడ్డులో షేక్.జాన్‌సైదా గత రెండేళ్ళ నుంచి భార్య, ఇద్దరు చిన్నపిల్లలతో అద్దెకు ఉంటున్నారు. అతడు పలనాడు రోడ్డులోని ఓ ద్విచక్రవాహనాల షోరూమ్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ప్రతి నెలా జాన్‌సైదాకు రూ.450లు నుంచి రూ.550లవరకు విద్యుత్ బిల్లు వస్తుంది. ఈనెలలో జూన్–జూలైకు చెందిన బిల్లు రూ.6,78,858లు వచ్చింది. ఆ బిల్లును చూడగానే అతడు షాక్‌కు గురయ్యాడు. ఆ ప్రాంత లైన్మెన్కు తెలియచేయగా బిల్లును సరిచేయిస్తామని హామీ ఇచ్చారు.