సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం(ఐడీవోసీ–కలెక్టరేట్)లో మొదటగా ఖమ్మంలో సోలార్‌షెడ్ ఏర్పాటు చేశారు. ఐడీవోసీలో 38కిపైగా శాఖల ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండగా వారి వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి సౌకర్యం లేదు. దీంతో అధికారులు సోలార్ ప్యానళ్లతో కూడిన పార్కింగ్ షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.1.78 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ఇప్పటికే పూర్తికాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించనున్నారు.
200 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఈ సోలార్ ప్యానళ్ల ద్వారా రోజుకు 800 నుంచి వెయ్యి యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతోంది. ఈ మొత్తాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేసి కలెక్టరేట్ అవసరాలు పోగా మిగిలిన విద్యుత్‌కు మాత్రమే బిల్లు చెల్లించనున్నారు. సోలార్ షెడ్‌తో నెలకు సుమారు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు విద్యుత్‌చార్జీలు ఆదా కావడమే కాక ఉద్యోగులకు చెందిన వందలాది వాహనాల పార్కింగ్‌కు సౌకర్యం కల్పించినట్లవుతోంది. సోలార్ ప్లాంట్‌తో ఐడీవోసీ భవనమంతా గ్రీన్ బిల్డింగ్‌గా మారనుంది. ఈవిధంగా రాష్ట్రంలోనే తొలి కలెక్టరేట్‌గా ఖమ్మం ఐడీవోసీ నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment