మంత్రి జగదీశ్‌రెడ్డి బార్ ఎత్తుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
సాక్షి, ఖమ్మం, సూర్యాపేట: విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని మున్యానాయక్ తండాలో గృహలక్ష్మి పథకం కింద మంజూరైన ఇంటి నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యకర్త భానోతు రవి తాను కొనుగోలు చేసిన ఆటో ప్రారంభించాలని మంత్రిని కోరారు. వెంటనే మంత్రి జగదీశ్‌రెడ్డి ఆటో నడుపుతూ శంకుస్థాపన చేయనున్న ఇంటి వరకు వెళ్లారు.
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి మహిళల ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ పోటీలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వెయిట్ లిఫ్టింగ్ బార్‌ను సరదాగా ఎత్తి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment