![Puvvada Ajay Kumar Counter To Cm Revanthreddy On Floods](/styles/webp/s3/article_images/2024/09/4/Puvvada-Ajay-Kumar.jpg.webp?itok=bXvYquNk)
సాక్షి,హైదరాబాద్: మున్నేరు వరద భాదితులను ఆదుకునేందుకు వెళ్తే తమపైన దాడి చేశారని మాజీ మంతత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులకు వాయిస్ లేదని విమర్శించారు. తెలంగాణభవన్‌లో పువ్వాడ అజయ్ మీడియాతో మాట్లాడారు.‘ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారని ప్రజలు భావిస్తున్నారు.
మున్నేరుకు వరద ఎక్కడి నుండి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలుసా. అజయ్ కుమార్ ఆక్రమణల వలనే ఖమ్మం మునిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు పరివాహకంలో రాజీవ్ గృహకల్ప,జలగం నగర్ కాలనీలు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు రేవంత్ రెడ్డి వ్యవహరించారు. ఖమ్మం నగరంలో ఒక్క ఇంచు నేను ఆక్రమణలు ఉన్నా కూల్చివెయ్యి.
నా హాస్పిటల్ కట్టి 25 సంవత్సరాలు అయింది. నా హాస్పిటల్‌కు చుక్క నీరు రాలేదు. నా హాస్పిటల్‌కు మున్నేరుకు సంబంధం లేదు. కేసీఆర్ వరద సాయం చేస్తే నువ్వు సీఎం పదవిలో ఉండి ఎందుకు..? ప్రజలను డైవర్ట్ చేసేందుకు నిన్న మాపై దాడులు చేశారు. మున్నేరుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ కావాలని రూ.650 కోట్లు మంజూరు చేయించాను.
రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టడం లేదో ప్రభుత్వం చెప్పాలి. భౌతికంగా మాపై దాడి చేస్తే ఖమ్మం ప్రజల భాదలు తీరుతాయా..? మంత్రుల ఫంక్షన్ హాల్స్ ఆక్రమణలో ఉన్నాయని ఖమ్మం ప్రజలు అనుకుంటున్నారు. రెవిన్యూ మంత్రి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మరో మంత్రి విల్లాలు వక్ఫ్ బోర్డు భూముల్లో ఉన్నాయి. హైడ్రా కూల్చివేతలు మంత్రుల ఫంక్షన్ హాళ్లు,విల్లాలతో మొదలు పెట్టండి. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు మనుషులే మాపై దాడి చేశారు’అని అజయ్‌కుమార్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment