నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో రైల్వే ఉద్యోగి బసంత్‌శర్మకు జూన్ నెల కరెంటు బిల్లు షాక్ ఇచ్చింది. ఓ రోజు ఉదయం ఆఫీసుకు బయలుదేరుతుండగా అద్దెకు ఇచ్చిన తన ఇంటికి సంబంధించి కరెంటు బిల్లు మెసేజ్ వచ్చింది.
ఏకంగా రూ.4 కోట్ల కరెంటు బిల్లు జులై 24కల్లా కట్టాలని ఆ మెసేజ్‌లో ఉంది. అది చూసి తొలుత ఆశ్చర్యపోయి తర్వాత కంగారుపడ్డాడు. టెనెంట్‌కు ఫోన్ చేసి కనుక్కుంటే సాధారణంగా వాడినట్లే జూన్‌లోనూ విద్యుత్ వాడామని సమాధానమిచ్చాడు.
దీంతో బసంత్‌శర్మ విద్యుత్ అధికారులకు ఫోన్ చేశాడు. వారు చెక్‌చేసి చూడగా ఎర్రర్ కారణంగా కంప్యూటర్ జనరేటెడ్ బిల్లులో పొరపాటు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. బిల్లును సరిచేసి పంపడంతో బసంత్ శర్మ ఊపిరి పీల్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment