CoronaVirus: Minister of Energy Jagadeesh Reddy Request People in Telangana to Pay the Electricity Bill in Online | విద్యుత్ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించాలి, మంత్రి జగదీష్‌రెడ్డి - Sakshi
Sakshi News home page

విద్యుత్ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించాలి: మంత్రి జగదీష్‌

Published Mon, Apr 13 2020 3:34 PM | Last Updated on Mon, Apr 13 2020 5:24 PM

Minister Jagadeesh: Electricity Bills Should Pay On Online - Sakshi

సాక్షి హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కాలంలో విద్యుత్‌ సిబ్బంది నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఎక్కడ కూడా అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్న సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. సోమవారం విద్యుత్‌సౌధ వద్ద మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న ప్రజలకు ఇబ్బంది లేకుండా 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇటీవల అకాల వర్షాలు వచ్చినప్పటికీ ఎక్కడా ట్రాన్స్‌ఫార్మర్‌లకు ఇబ్బంది రాలేదన్నారు. బిల్లులకు సంబంధించి రీడింగ్ తీసే అవకాశం లేనందున తమ సిబ్బంది ఇళ్లలోకి వెళ్లలేన్నారు. అయితే విద్యుత్ వినియోగానికి సంబంధించి  బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించాలని కోరారు. మిగతా రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానంలోనే తాము కూడా ఈ బిల్ ఇస్తున్నామన్నారు. (సెల‌బ్రిటీలు, ఇది క‌రోనా పార్టీ కాదు )

ఈఆర్సీ రెగ్యులేటరీ ఏ విధానం అయితే ఉంటుందో అదే పద్దతిలో..  గత సంవత్సరం మార్చి నెల వచ్చిన బిల్ ఆధారంగా బిల్ పే చేయాలి అన్నారు.  అయితే గత మార్చి నెలతో పోల్చితే ఈ మార్చి నెలలో 15, 20 శాతం ఎక్కుకాగానే వస్తాయని, కానీ ఈఆర్సీ ప్రకారమే చెల్లించాలన్నారు. ఇప్పటికే  బిల్లులను ప్రజలకు పంపడం జరిగిందని, వాటని దయచేసి కట్టాలని కోరారు. ఈ నెలలోని వ్యత్యాసాలను వచ్చే నెలలో ఇస్తామని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకొమన్నారు. (కరోనా: ఆయన రాజీనామా చేయాల్సిందే! )

ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 40 శాతం పైగా వినియోగదారులు ఆన్‌లైన్‌లోనే పే చేస్తున్నారని, 10700 కమర్షియల్స్‌లో అసలు రీడింగ్ తీసుకొని బిజినెస్ సంస్థలకు బిల్ ఇచ్చామని తెలిపారు. కమర్షియల్ కూడా గత సంవత్సరంలో 50 శాతం బిల్ కట్టాలని, ఒకవేళ  ఎక్కువ బిల్ కట్టినా.. వచ్చే బిల్‌లో సరిచేస్తామన్నారు. గత మార్చ్‌లో 8900 డిమాండ్ ఉండేదని.. ఈ మార్చ్‌లో 7800 డిమాండ్ ఉందన్నారు. ఇక కరోరా వైరస్ లేకుంటే 13500 మెగా వాట్స్ డిమాండ్ వస్తుందనుకున్నామని అన్నారు. ఈనెల బిల్ డిమాండ్ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో ఎల్టీకి రూ. 620 కోలు, ఎన్పీడీసీఎల్‌లో రూ.  203 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ సంస్థలు ప్రతీసారి అత్యవసర సమయంలో పని చేస్తున్నారని, ఇలాంటి క్లిష్టమైన పనిచేస్తున్న వైద్యుల సేవలను సైతం మంత్రి జగదీష్‌ ఈ సందర్భంగా కొనియాడారు. (లాక్‌డౌన్‌పై రేపు ప్రధానమంత్రి కీలక ప్రకటన )

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement