Power consumption
-
డిసెంబర్లో భారీగా విద్యుత్ వినియోగం
దేశవ్యాప్తంగా డిసెంబర్ నెలలో విద్యుత్ వినియోగం (power consumption) గణనీయంగా పెరిగింది. 6 శాతం పెరిగి 130.40 బిలియన్ యూనిట్లుగా నమోదైంది. 2023 డిసెంబర్ నెలలో వినియోగం 123.17 బిలియన్ యూనిట్లుగా ఉంది. రోజువారీ గరిష్ట సరఫరా (గరిష్ట డిమాండ్) 224.16 గిగావాట్లుగా నమోదైంది.2024 మే నెలలో 250 గిగావాట్లు ఇప్పటి వరకు గరిష్ట రోజువారీ రికార్డుగా ఉంది. 2024 వేసవి సీజన్‌కు గరిష్ట రోజువారీ డిమాండ్ 260 గిగావాట్లకు చేరుకోవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ అంచనా వేయడం గమనార్హం. ఇక 2025 వేసవి సీజన్‌కు గరిష్ట డిమాండ్ 270 గిగావాట్లకు చేరుకోవచ్చని భావిస్తోంది.రూమ్ హీటర్లు, వాటర్ హీటర్లు, గీజర్ల వాడకం డిసెంబర్లో విద్యుత్ వినియోగం పెరగడానికి కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి చేరుకునే అవకాశాలతో విద్యుత్ వినియోగం జనవరిలోనూ అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
‘వినియోగం’ గణనీయంగా తగ్గింది!
దాదర్: ముంబైలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. గత వారం దాకా ఉక్కపోతతో సతమతమైన ముంబైకర్లకు ఇప్పుడు చలి కారణంగా కొంతమేర ఊరట లభించినట్లైంది. పగలు కొంత ఉక్కపోత భరించలేకపోయినప్పటికి రాత్రుల్లో వాతావరణంలో ఆకస్మాత్తుగా మార్పులు జరుగుతున్నాయి. ఫలితంగా ఇళ్లలోని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం చాలా శాతం వరకు తగ్గింది. దీంతో ముంబైలో గత వారం కిందట మూడు వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఇప్పుడది 2,500 మెగావాట్లకు పడిపోయింది. చలికాలం ప్రారంభంలోనే సుమారు 500 మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగం తగ్గిపోయింది. మరికొద్ది రోజుల్లో ఇది 1,500 మెగావాట్లకు చేరడం ఖాయమని అధికారులు భావిస్తున్నారు. వేసవికాలంలో 4,550 మెగావాట్లపైనే.... వేసవి కాలంలో ఎండలు మండిపోవడంతో ఉదయం 10 గంటల తరువాత ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనాలు జంకుతారు. ఇళ్లల్లో, కార్యాలయాల్లో, వ్యాపార, వాణిజ్య సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులు ఉక్కపోత భరించలేక సతమతమవుతారు. నిరంతరంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు పనిచేసినప్పటికీ వాతావరణం చల్లబడదు. దీంతో వేసవి కాలంలో ముంబైలో విద్యుత్ వినియోగం ఏకంగా 4,500 మెగావాట్లకు పైనే చేరుకుంటుంది. ఏటా విద్యుత్ వినియోగం రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంటుంది. వేసవి కాలం మినహా మిగిలిన సీజన్లలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇళ్లు, షాపులు, కార్యాలయాల్లో విశ్రాంతిలేకుండా ఫ్యాన్లు, ఏసీలు పనిచేయడంతో రెండు రోజుల కిందట విద్యుత్ వినియోగం 2,500 మెగావాట్లకు చేరుకుంది. టాటా పవర్ నుంచి 382 మెగావాట్లు, అదాణీ డహాణు విద్యుత్ కేంద్రం నుంచి 288 మెగావాట్లు, ముంబై ఎక్చేంజ్ నుంచి 1,971 మెగావాట్లు విద్యుత్ సరఫరా జరిగింది. ముంబైలో భిన్నంగా... ఇదిలాఉండగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైనప్పటికీ అనేక జిల్లాల్లో వాతావరణం ఇంకా వేసవి ఎండలు తలపిస్తున్నాయి. రోజు ఏకంగా 31,001 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో మహానిరి్మతి కంపెనీ నుంచి 6,252 మెగావాట్లు, ప్రైవేటు కంపెనీల నుంచి 8,728 మెగావాట్లు, ఎక్చేంజి నుంచి సుమారు 8 వేల మెగావాట్లు విద్యుత్ సేకరించి ఈ డిమాండ్‌ను పూరిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ ప్రధాన నగరాలతో పోలిస్తే ముంబైలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్ధలు అధికంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. వీటితోపాటు జంక్షన్ల వద్ద, ప్రధాన రహదారులపై, పర్యాటక ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార ప్రకటనల బోర్డులు, హోర్డింగులు అడుగడుగున ఉంటాయి. వీటిలో కొన్ని ఎల్రక్టానిక్, డిజిటల్ బోర్డులుంటాయి. రాత్రుల్లో వాటికి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సాధారణ బోర్డులకు ప్లడ్ లైట్లు వెలుగుతాయి. దీంతో రాత్రి వాతావరణం చల్లిబడినప్పటికి విద్యుత్ వినియోగం పగలు మాదిరిగానే జరుగుతుంది. అయితే కొద్ది నెలల కిందట ఘాట్కోపర్లోని చడ్డానగర్ జంక్షన్ వద్ద భారీ హోర్డింగ్ కూలడంతో సుమారు 17 మంది చనిపోగా 30 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనతో అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగులు, బోర్డుల అంశం తెరమీదకు వచి్చంది. వివిధ రంగాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో కళ్లు తెరచిన ప్రభుత్వం, బీఎంసీ పరిపాలన విభాగం తనిఖీలు ప్రారంభించింది. అక్రమంగా ఏర్పాటుచేసిన హోర్డింగులు, సైన్ బోర్డులతోపాటు వాటికి విద్యుత్ సరఫరా చేస్తున్న కనెక్షన్లను కూడా తొలగిస్తున్నారు. ఆ ప్రకారం ముంబైలో కొంత శాతం విద్యుత్ వినియోగం తగ్గాలి. కానీ ఇవేమీ విద్యుత్ వినియోగంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. -
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
సాక్షి, హైదరాబాద్: వేసవి కాలం రావడంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీ, మోటర్ల వినయోగంతో విద్యుత్ డిమాండ్ ఎక్కువవుతోంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వినియోగం జరిగింది. గురువారం రికార్డు స్థాయిలో 4,053 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మైలురాయిని అధిగమించిది. 2023 ఏప్రిల్ 18న గరిష్ఠ డిమాండ్ 3,471 మెగావాట్లు కాగా గతేడాదితో పోల్చితే ప్రస్తుతం 582 మెగావాట్ల డిమాండ్ పెరిగింది. అయితే విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ అధికారులు ఏలాంటి అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా చేశారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తున్న విద్యుత్ శాఖ, సిబ్బందిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. మే నెలలో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ సిబ్బంది, అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే సేవలందించి వినియోగదారుల మన్ననలు పొందాలని సూచించారు. -
డిమాండ్‌కు తగ్గట్లు కరెంట్ కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది అనడానికి నిదర్శనంగా కనిపించే సూచికల్లో విద్యుత్ వినియోగం కూడా ఒకటి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఏపీలో విద్యుత్ డిమాండ్ ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. 2022లో తలసరి విద్యుత్ వినియోగం 1,234 యూనిట్లు ఉంటే 2023లో అది 1,357 యూనిట్లకు పెరిగింది. ఇలా ఏ ఏటికాయేడు కిందటి ఏడాదికి మించి కరెంటు రికార్డులు నమోదు చేస్తూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 236.73 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. ఇది గతేడాది ఇదే సమయానికి జరిగిన వినియోగం 231.05 మిలియన్ యూనిట్ల కంటే 2.46 శాతం ఎక్కువ. పగలు పీక్ డిమాండ్ 11,926 మెగావాట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 11,358 మెగావాట్లు ఉండేది. అంటే 5 శాతం పెరిగింది. ఈ ఏడాది వేసవి ఆరంభం కాకముందే ఎండలు ముదిరినప్పటికీ.. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా ఉంటున్నప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కొరత రాకుండా, కోతలు విధించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రజలకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాయి. కొనుగోలుకు వెనుకాడకుండా.. రాష్ట్ర ప్రజలకు విద్యుత్ అందించేందుకు ప్రస్తుతం ఏపీజెన్కో థర్మల్ నుంచి 94.427 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 4.528 మి.యూ, ఏపీ జెన్కో సోలార్ నుంచి 2.419 మి.యూ, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 31.868 మి.యూ, సెయిల్, హెచ్‌పీసీఎల్, గ్యాస్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 29.849 మి.యూ, సోలార్ నుంచి 21.635 మి.యూ, విండ్ నుంచి 20.535 మిలియన్ యూనిట్లు చొప్పున సమకూరుతోంది. నెల రోజుల్లో పవన విద్యుత్ ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయ్యింది. దీనితో పాటు బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.7.754 చొప్పున రూ. 20.634 కోట్లతో 30.211 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక ఆర్టిఫిషియల్ఇంటిలిజెన్స్(ఏఐ) సాంకేతికతను వినియోగిస్తున్నారు. డిమాండ్ ఫోర్కాస్ట్ విధానం ద్వారా ప్రతి పదిహేను నిమిషాలకూ విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేయగలిగే సామర్థ్యం మన విద్యుత్ సంస్థలకు ఉంది. దాని సాయంతో షార్ట్‌టెర్మ్ టెండర్ల ద్వారా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కోసం ముందస్తు బిడ్లు దాఖలు చేస్తున్నాయి. తద్వారా అప్పటికప్పుడు ఏర్పడే విద్యుత్ కొరత నుంచి బయటపడుతున్నాయి. రాష్ట్రంలో మునుపెన్నడూ ఇలాంటి ఏర్పాటు లేదు. గత ప్రభుత్వంలో అత్యవసర సమయాల్లో కరెంటు కొనేవారే కాదు. అనవసరంగా చేసుకున్న దీర్ఘకాల విద్యుత్ ఒప్పందాల వల్ల ఒరిగేదేమీ ఉండేది కాదు. ఫలితంగా రాష్ట్రంలో అన్ని కాలాల్లోనూ ప్రజలు విద్యుత్ కోతలతో అల్లాడిపోయేవారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు ప్రణాళికల కారణంగా విద్యుత్ వినియోగదారులకు అప్పటి ఇబ్బందులు ఇప్పుడు ఎదురవ్వడం లేదు. -
రికార్డు స్థాయిలో కరెంట్ వినియోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగంతో ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ 238.79 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గతేడాది ఇదే సమయానికి వినియోగం 166.97 కంటే 43.01 శాతం ఎక్కువ. రోజులో పీక్ డిమాండ్ 12,802 మెగావాట్లుగా ఉంది. ఇది గతేడాది ఇదే సమయానికి 7,997 మెగావాట్లు మాత్రమే ఉంది. అంటే 60.09 శాతం పెరిగింది. అయినప్పటికీ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు వినియోగదారులకు కరెంట్ సరఫరా చేస్తున్నాయి. ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా.. గత సంవత్సరం వేసవిలో మన రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 265 మిలియన్ యూనిట్లకు చేరుకుని రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఆ రికార్డు బ్రేక్ అవుతుందని అంచనా. దీనికి తగ్గట్టు విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. కృష్ణపట్నంలోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో గతేడాది 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. ఇబ్రహింపట్నంలోని ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్–8లోనూ ఉత్పత్తి ముందుగానే ప్రారంభించారు. అలాగే వీటీపీఎస్‌లో రోజుకి 32,186 మెట్రిక్ టన్నులు, ఆర్టీపీపీలో 16,443 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నంలో 23,632 మెట్రిక్ టన్నులు, హిందూజాలో 14,277 మెట్రిక్ టన్నులు చొప్పున బొగ్గును వినియోగిస్తూ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. కొనుగోలుకు వెనుకాడని ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు విద్యుత్ లోటు రాకుండా చూసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఏపీజెన్కో థర్మల్ నుంచి 91.081 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 4.920 మి.యూ, ఏపీ జెన్కో సోలార్ నుంచి 2.269 మి.యూ, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 35.925 మి.యూ, సెయిల్, హెచ్‌పీసీఎల్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 32.213 మి.యూ, సోలార్ నుంచి 20.647 మి.యూ, విండ్ నుంచి 12.359 మిలియన్ యూనిట్లు చొప్పున సమకూరుతోంది. అయితే ఇది మాత్రమే సరిపోవడం లేదు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి రోజుకు యూనిట్ సగటు రేటు రూ. 8.764 చొప్పున రూ. 35.253 కోట్లతో 40.224 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా డిమాండ్‌ను అందుకోలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జార్ఖండ్, ఉత్తరాఖండ్, బిహార్, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మన దగ్గర కంటే తక్కువ విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్ కొరత ఏర్పడింది. -
పెరిగిన విద్యుత్ వినియోగం కనపడదా!?
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు నిరంతరం కోతలు లేకుండా సరఫరా చేయడం కూడా తప్పే అన్నట్లుగా ఉంది రామోజీ తీరు చూస్తుంటే. ఈ ఏడాది రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం.. దానివల్ల విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిన విషయం కళ్లకు కనిపిస్తున్నా ఆయన ఇవేమీ పట్టనట్లు అడ్డగోలుగా రాసిపారేస్తూ జనం మెదళ్లను కలుషితం చేసేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ఈ పెరుగుదల వ్యవసాయ, గృహ విద్యుత్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయినా.. ‘ప్రజలపై మరో రూ.1,723 కోట్ల భారం’ అంటూ ఆదివారం ఈనాడు పెట్టిన రంకెల్లో ఎప్పటిలాగే ఏమాత్రం పసలేకపోగా అదంతా పూర్తి ఊహాజనితమని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ. పృథ్వితేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు కొట్టిపడేశారు. ఈ మేరకు వారు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. వర్షాభావంతో అదనంగా వినియోగం.. నిజానికి.. ఈ ఏడాది వాతావరణంలో ఏర్పడిన అసాధారణ పరిస్థితులవల్ల వర్షాభావం, తీవ్ర ఎండ, ఉక్కపోతతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ పెరుగుదల వ్యవసాయ విద్యుత్ రంగంలోను, గృహ విద్యుత్ రంగంలోను స్పష్టంగా కనిపిస్తోంది. మొన్న ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు వినియోగం దాదాపు 10–31 శాతం వరకు ప్రతి నెలా అదనంగా నమోదవుతోంది. అలాగే, గతేడాది మార్చి నుంచి అక్టోబరు కాలానికి జల విద్యుదుత్పత్తి దాదాపు 3 వేల మిలియన్ యూనిట్లు ఉంటే ఈ సంవత్సరం అది కేవలం 1,260 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉంది. ఇది దాదాపు 60 శాతం తక్కువ. సాధారణంగా ఏటా వినియోగం 7–8 శాతం వరకూ పెరగవచ్చని భావించి ముందస్తు విద్యుత్ సేకరణ ప్రణాళిక తయారుచేస్తారు. కానీ, డిమాండ్ అనుకున్న దానికంటే ఎక్కువగా పెరగడం, దీర్ఘకాలిక వనరులనుంచి లభ్యత అనుకున్నంత రాకపోవడంవల్ల విద్యుత్ కొనుగోళ్లు అనివార్యమయ్యాయి. సర్కారు ముందుచూపు.. ఇలా నెలవారీ విద్యుత్ డిమాండ్‌లో మునుపెన్నడూ లేనంత పెరుగుదలను గమనించి రాబోయే 7నెలల కాలానికి (సెపె్టంబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు) వెయ్యి మెగావాట్ల కోసం కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆ«దీనంలోని డీప్ ఈ–బిడ్డింగ్ పోర్టల్ ద్వారా ఆగస్టులోనే టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియలో రివర్స్ ఆక్షన్ కూడా పూర్తయ్యాక మనకు కావలసిన విద్యుత్ పరిమాణం లభించేంత వరకు అంటే బిడ్లలో పిలిచిన వెయ్యి మెగావాట్ల వరకు నిబంధనల ప్రకారం వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, ట్రేడర్లకు కొనుగోలు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నెలలో మొత్తంగా ఒకశాతం వరకు విద్యుత్ కొనుగోలును తగ్గించుకునే అవకాశం ఈ టెండర్లలో ఉంది. ఈ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా నిబంధనలకు లోబడి చేపట్టారు. ఎవరైనా సరే ఈ వివరాలు పోర్టల్ వెబ్సైట్ ద్వారా కానీ, దరఖాస్తు ద్వారా కానీ పొందవచ్చు. పరిమితులు, నియంత్రణ లేవు ఇక స్వల్పకాలిక కొనుగోళ్లకు సంబంధించి ప్రతీ యూనిట్‌కు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతి ఉంది. మండలి నిర్దేశించిన ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు నిబంధన నియమావళి ప్రకారం.. ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగానికి ఈ అదనపు వ్యయం సర్దుబాటు ఏదైనా ఉంటే దానిని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం పూర్తయ్యాక విద్యుత్ కొనుగోలులో ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించి జరిగిన అదనపు విద్యుత్ కొనుగోలు వ్యయం లెక్కించి ఆ నివేదికను ప్రభుత్వానికి పంపుతారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం మొత్తం విద్యుత్‌కు కటకటలాడుతుండగా రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రం వినియోగదారులకు ఎలాంటి వినియోగ పరిమితి, నియంత్రణలు అమలుచేయకుండా వారి డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా చేస్తున్నాయి. కానీ, రామోజీకి ఇవన్నీ తెలియనివి ఏమీకాదు. తన ఆత్మబంధువు చంద్రబాబును ఉన్నపళంగా సీఎం కుర్చిలో కూర్చోబెట్టడమే ఆయన లక్ష్యం. అందుకే రోజూ సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై తన విషపుత్రిక ఈనాడులో నిత్యం విషం కక్కుతున్నారు. అంతే..! ఇవ్వకపోతే అలా.. ఇస్తే ఇలానా రామోజీ..? ఎప్పుడైనా ఒకసారి కరెంట్ ఇవ్వకపోతే కోతలు ఎక్కువైయ్యాయంటూ గగ్గోలు పెడతారు. అదే నిరంతరాయంగా సరఫరా చేస్తే అధిక మొత్తం పెట్టి కొనేస్తున్నారంటూ నానా యాగీ చేస్తారు. ఇదెక్కడి నీతి రామోజీ. నిజానికి.. మార్కెట్లో విద్యుత్ రేటు ఎంత ఉంటే అంతకు కొనితీరాల్సిందే. ఏ రాష్ట్రానికైనా ఇదే పరిస్థితి. ఎక్కువ రేటు, తక్కువ రేటు అన్నది మన చేతిలో ఉండదు కదా.. అవసరమైనప్పుడు ఎవరైనా మార్కెట్ రేటును చెల్లించి కొనాల్సిందే.. అదే అవసరంలేనప్పుడు ఎవరూ కొనరు. టెండర్లు కూడా చాలా పారదర్శకంగా నిర్వహిస్తారు. మన ఒక్కరి కోసం రేట్లు పెంచడం లేదా తగ్గించడం అనేది ఉండదు. ఇదంతా మీకు తెలీదా!? చంద్రబాబు అధికారంలో లేడన్న ఒకే ఒక్క కారణంతో ఇంత అడ్డగోలుగా.. దారుణంగా పిచ్చి రాతలు రాసిపారేస్తారా ఏంటి రామోజీ..? 22% పెరిగిన గ్రిడ్ విద్యుత్ వినియోగం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత, ఆదేశాల ప్రకారం.. ఇంతటి క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో కూడా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలనే భావనతో, స్వల్పకాలిక మార్కెట్లో నిబంధనలకు లోబడి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత నవంబరులో కూడా రికార్డు స్థాయిలో రోజువారీ విద్యుత్ వినియోగం 220 మిలియన్ యూనిట్ల వరకు నమోదవుతోంది. కిందటి ఏడాది నవంబరులో ఇదే కాలానికి సరాసరి విద్యుత్ వినియోగం దాదాపు 180 మిలియన్ యూనిట్లుగా వుంది. అలాగే, కిందటి సంవత్సరంతో పోలిస్తే గ్రిడ్ విద్యుత్ వినియోగం పెరుగుదల దాదాపు 22 శాతం. ఈ పరిస్థితుల్లో కూడా రోజుకి దాదాపు 50 మిలియన్ యూనిట్లను స్వల్పకాలిక మార్కెట్ నుండి కొనాల్సి వస్తోంది. ఇందులో దాదాపు 20 మిలియన్ యూనిట్లు ఆగస్టులో చేపట్టిన టెండర్ల ప్రక్రియ ద్వారా సమకూరుతోంది. ఇలా దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ కొరత పరిస్థితుల కారణంగా వాటిని అధిగమించడానికి తమిళనాడు, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా ముందస్తుగా ఈ స్వల్పకాలిక ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాయి. రోజువారీ వివిధ వనరుల నుంచి అందుబాటులో వున్న విద్యుత్‌ను గ్రిడ్ డిమాండ్‌కు అనుగుణంగా డిస్కంలు బేరీజు వేసుకుంటున్నాయి. గ్రిడ్ డిమాండ్ బాగా పడిపోయిన రోజుల్లో రోజువారీగా దాదాపు 50శాతం వరకు విద్యుత్ సేకరణ నిలుపుదల, బ్యాక్‌డౌన్ చేసి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయి. విద్యుత్ ఎక్సే్చంజీల్లో విద్యుత్ కొంటే ఈ బ్యాక్‌డౌన్ సౌకర్యం అందుబాటులో ఉండదు. -
ఏపీలో ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయికి విద్యుత్ వాడకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అత్యంత గరిష్ట స్థాయికి చేరింది. రాష్ట్రంలో శుక్రవారం 263.237 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదైంది. రాష్ట్ర విభజన తర్వాత ఎనిమిదేళ్లలో విద్యుత్ వాడకం ఇదే ఎక్కువ కావడం గమనార్హం. విద్యుత్ వినియోగం అధికారుల అంచనాలను మించి ఆల్‌టైమ్ రికార్డులను సృష్టిస్తోంది. ఈ మేరకు ఇంధన శాఖ శనివారం విద్యుత్ సరఫరా బులిటెన్‌ను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ గతేడాది కంటే 28.24 శాతం ఎక్కువగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 205.266 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగం జరిగింది. రోజులో పీక్ డిమాండ్ 12,738 మెగావాట్లుగా ఉంది. ఇది గతేడాది ఇదే సమయానికి 9,960 మెగావాట్లు మాత్రమే. అంటే రోజువారీ పీక్ డిమాండ్ కూడా 27.89 శాతం పెరిగింది. పగటి పూట సగటు పీక్ డిమాండ్ 10,968 మెగావాట్లు కాగా.. సాయంత్రం వేళల్లో 9,786 మెగావాట్లకు చేరింది. ఇంత భారీ స్థాయిలో విద్యుత్ వాడకం జరుగుతున్నప్పటికీ గృహ, వ్యవసాయ విద్యుత్‌కు ఇబ్బంది లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సంస్థలు వినియోగదారులకు కరెంట్ సరఫరా చేస్తున్నాయి. రాష్ట్ర అవసరాలకు ఏపీ జెన్కో అత్యధికంగా థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఆదుకుంటోంది. దీని నుంచి 98.082 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 5.470 మి.యూ, ఏపీ జెన్కో సోలార్ నుంచి 2.592 మి.యూ, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 38.058 మి.యూ, సెయిల్, హెచ్‌పీసీఎల్, గ్యాస్ వంటి ఇతర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి 27.531 మి.యూ, పవన విద్యుత్ ద్వారా 50.125 మి.యూ, సౌర విద్యుత్ నుంచి 22.507 మిలియన్ యూనిట్లు సమకూరుతోంది. బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.6.606 చొప్పున రూ.14.505 కోట్లతో 21.956 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రోజుకు కొనుగోలు చేస్తున్నారు. బిహార్‌లో 5.53 మి.యూ, మహారాష్ట్రలో 2.07 మి.యూ, జార్ఖండ్‌లో 2.22 మి.యూ, హరియాణాలో 6.73 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంది. అయితే మన రాష్ట్రంలో మాత్రం ఎలాంటి లోటు లేకుండా, అవసరం మేరకు బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి మరీ వినియోగదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
గ్రేటర్ ‘పవర్’ఫుల్..!
ఐటీ, అనుబంధ సంస్థల రాకతో నగరవాసుల ఆదాయం గణనీయంగా పెరిగింది. ధనిక, పేద తేడా లేకుండా ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, కంప్యూటర్లు, టీవీలు, వాటర్ హీటర్లు, ఐరన్ బాక్స్‌లు, మిక్సీలు, గీజర్లు సర్వ సాధారణమయ్యాయి. ఫలితంగా తలసరి కరెంట్ వినియోగం కూడా భారీగా పెరిగింది. 2014లో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 2,261 యూనిట్లకు చేరడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: నగరం శరవేగంగా విస్తరిస్తోంది. కోర్‌సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహ, వాణిజ్య, పారిశ్రామిక భవనాలు వెలుస్తున్నాయి. నెలకు సగటున 2500–3000 వరకు కొత్త విద్యుత్ కనెక్షన్లు జత చేరుతున్నాయి. ఫలితంగా ఏటా విద్యుత్ వినియోగం రెండు నుంచి మూడు శాతం అధికంగా నమోదవుతున్నట్లు అంచనా. ఇక విద్యుత్ గృహోపకరణాల సంఖ్యా అదేస్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం ఎండలు భగ్గున మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవుతుండటంతో సిటీజనాలు ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రోజంతా ఆన్ చేసి ఉంచుతున్నారు. ఫలితంగా గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ డిమాండ్ పీక్కు చేరుకుంది. రికార్డు స్థాయిలో డిమాండ్ రాష్ట్రం ఏర్పాటు సమయంలో గ్రేటర్ పీక్ సీజన్ డిమాండ్ 48 నుంచి 49 మిలియన్ యూనిట్లు (ఎంయూ) నమోదు కాగా... ప్రస్తుతం రికార్డు స్థాయిలో నమోదవుతుంది. మే 19న డిస్కం చరిత్రలోనే అత్యధికంగా 80 ఎంయూలు నమోదైంది. గత ఏడాది ఏప్రిల్ 28న 71.09 ఎంయూల విద్యుత్ వినియోగం నమోదు కాగా, ఈ సారి ఏకంగా ఎనిమిది ఎంయూలకు పైగా వినియోగం నమోదు కావడం గమనార్హం. రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో ఇంజనీర్లు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు సైతం తీవ్ర ఒత్తిడికి గురవుతుండటం, ఆయిల్ లీకేజీల కారణంగా బస్తీల్లోని పలు డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అవుతుండటం, గంటల తరబడి సరఫరా నిలిచిపోతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు అప్రమత్తమై.. ఎప్పటికప్పుడు ఆయా సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నారు. -
థర్మల్ ఉత్పత్తిలో ‘కోత’ లేదు
సాక్షి, అమరావతి: థర్మల్ విద్యుదుత్పత్తిని సామర్థ్యంలో 50 శాతానికి తగ్గించాలని ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోడ్ (ఐఈజీసీ) నిబంధనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల అవసరాల మేరకు థర్మల్ పవర్ స్టేషన్లు సగటున 73 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 240 నుంచి 255 మిలియన్ యూనిట్లు ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) రోజుకు సమారు 100 నుంచి 105 మిలియన్ యూనిట్లను గ్రిడ్‌కు సరఫరా చేస్తోంది. అంటే రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో దాదాపు 40 నుంచి 45 శాతం వరకు ఏపీ జెన్కో నుంచే సమకూరుతోంది. అలాగని సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించడానికి లేదు. దీంతో పర్యావరణ హితం కోరి పవన, సౌరవిద్యుత్ వినియోగానికి ‘మస్ట్ రన్ స్టేటస్’ కింద అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇష్టానుసారం ఆపలేం సాధారణంగా లోడ్ డిస్పాచ్ సెంటర్ ఫ్రీక్వెన్సీని బట్టి గ్రిడ్‌కు విద్యుత్‌ను సరఫరా, స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. గ్రిడ్‌కు మనం ఎంత విద్యుత్ సరఫరా చేస్తామో అంత తీసుకోవచ్చు. ఎక్కువ (ఓవర్ డ్రా) తీసుకుంటే ఆ మేరకు చెల్లించాలి. అపరాధరుసుం భరించాలి. తక్కువ ఇచ్చి ఎక్కువ తీసుకుంటే దక్షణాది రాష్ట్రాల రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ హెచ్చరికలు జారీచేస్తుంది. తరచూ ఇలా చేస్తే గ్రిడ్ కనెక్షన్ తప్పిస్తుంది. మన అవసరాలకు మించి గ్రిడ్‌కు సరఫరా చేస్తే డిమాండు లేనప్పుడు అదనపు విద్యుత్‌కు పైసా రాదు. దీంతో విద్యుత్ డిమాండు ఎప్పుడు ఎలా ఉంటుందో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) ద్వారా అధికారులు నిత్యం పరిశీలిస్తుంటారు. డిమాండుకు తగ్గట్టు సరఫరా పెంచాలో, తగ్గించాలో వారు సూచిస్తారు. అయితే డిమాండు లేని సమయాల్లో థర్మల్ ప్లాంట్లను షట్‌డౌన్ చేసి డిమాండు పెరగ్గానే లైటప్ చేయడం వీలుకాదు. అందువల్ల ప్లాంట్లను ఆన్‌లోనే ఉంచాలి. అందుకే 55 శాతం సామర్థ్యంతో పనిచేసేలా ప్లాంట్లను సిద్ధంగా ఉంచడానికి ఏయే చర్యలు తీసుకోవాలో సూచనలు, సలహాలు, సాంకేతిక సహకారం ఇచ్చే సంస్థలను ఆహ్వానిస్తూ ఏపీ జెన్కో ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) దరఖాస్తులు ఆహ్వానించింది. దుష్ప్రచారాలను నమ్మవద్దు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లో 45 శాతానికి, డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్)లో 55 శాతానికి విద్యుదుత్పత్తిని తగ్గించి, రాష్ట్ర అవసరాలకు బయట కొనుగోలు చేసే ఎత్తుగడలో ప్రభుత్వం ఉందని కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి దుష్ప్రచారాలను ఎవరూ నమ్మనవసరం లేదు. సౌర, పవన విద్యుత్ అందుబాటులో ఉంటే దానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఇది పర్యావరణపరంగా మంచిదైనందున పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయేతర విద్యుత్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. – కె.విజయానంద్, చైర్మన్, ఏపీ జెన్కో -
ఏపీలో ఆల్‌టైమ్ రికార్డు దాటిన కరెంట్ వినియోగం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. తీవ్ర ఎండలతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 251 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత ఎనిమిదేళ్లలో ఇంత రికార్డు స్ధాయిలో విద్యుత్ వినియోగం జరగలేదు. ఎన్నడూ లేని విధంగా 12,660 మెగావాట్లకి పైగా విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో 255 మిలియన్ యూనిట్ల వరకు అత్యధిక వినియోగం పెరగవచ్చని విద్యుత్ శాఖ చెబుతోంది. మరో వారం రోజులపాటు ఇదే విధంగా విద్యుత్ డిమాండ్ కొనసాగనున్నట్లు విద్యుత్‌శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్ తెలిపారు. అయితే ఊహించని డిమాండ్ ఏర్పడినా కూడా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళికతో బహిరంగ మార్కెట్ లో పదిరూపాయిలుండే యూనిట్ విద్యుత్‌ను 6.40 రూపాయిల నుంచి 7 రూ. లోపు కొంటున్నామని తెలిపారు.విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో రోజూ 30 నుంచి 40 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నామన్నారు. ఆయన మాట్లాడుతూ..‘అత్యధిక డిమాండ్ కారణంగా ఉభయగోదావరి జిల్లాలలోని కొన్ని లైన్లలో వచ్చిన సాంకేతిక సమస్యలని సరిచేస్తున్నాం. నున్న- గుడివాడ విద్యుత్ లైన్‌కు ఏర్పడిన సమస్యలని పరిష్కరిస్తున్నాం. ఏపీలో ఇంత విద్యుత్ డిమాండ్ ఉన్నా కోతలు విధించలేదు. సాధారణంగా ఏప్రియల్ నెలలోనే విద్యుత్ డిమాండ్ ఉంటుంది. కానీ మే నెలలో ఎండలు తీవ్రంగా ఉండటంతో ఊహించని డిమాండ్ ఏర్పడింది. మే నెలలో 215 మిలియన్ యూనిట్ల వరకే వినియోగం ఉంటుందనుకున్నాం కానీ విద్యుత్ వినియోగం రికార్డుస్ధాయిలో 250 మిలియన్ యూనిట్లు దాటేసింది’ అని వెల్లడించారు. చదవండి: కోతల్లేని కరెంట్.. ప్రభుత్వ ముందు చూపు వల్లే సాధ్యం -
విద్యుత్ బిల్లులు భారం కాకుండా ఉండాలంటే.. ఇదొక్కటే మార్గం!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో చార్జీలు పెరగకుండా.. విద్యుత్ బిల్లులు భారం కాకుండా ఉండాలంటే.. కరెంటు వినియోగంలో పొదుపు ఒక్కటే మార్గమని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు. రాష్ట్రంలో పీక్ విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే వేళల్లో నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు గరిష్టంగా యూనిట్‌కు రూ.12 ధరతో బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు జరుపుతున్నాయి. దీంతో డిస్కంల విద్యుత్ కొనుగోళ్ల వ్యయం భారీగా పెరిగిపోతోంది. ఈ వ్యయభారాన్ని చివరకు వినియోగదారులపై బిల్లులను మరింతగా పెంచి బదిలీ చేయకతప్పదని ఆయన స్పష్టం చేశారు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలకు ఈ బిల్లులు మోయలేని భారంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, విద్యుత్ పొదుపు చర్యలను పాటించి సలువుగా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అవసరం లేకున్నా విద్యుత్‌ను వృథాగా వినియోగిస్తుండడంతోనే బిల్లులు అధికంగా వస్తున్నాయని, విద్యుత్ పొదుపుపై రాష్ట్రంలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఈఆర్సీ తరఫున వినియోగదారులకు సూచనలు, సలహాలతో ఆదివారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తన్నీరు శ్రీరంగారావు -
తెలంగాణ చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. మార్చి నెలలో అనుకున్న విధంగానే 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మంగళవారం ఉదయం 10.03 నిమిషాలకు 15254 మెగా వాట్ల విద్యుత్ అత్యధిక ఫీక్ డిమాండ్ నమోదు అయ్యింది. రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. సాగు విస్తీర్ణం పెరగడం, పారిశ్రామిక అవసరాలు పెరగడంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతుందని ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడించారు. మొత్తం విద్యుత్ వినియోగంలో 37 శాతం వ్యవసాయ రంగానికే వినియోగింపబడుతోంది. దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానం కాగా, రెండో స్థానంలో తెలంగాణ ఉంది.నిన్న 14 138 మెగా వాట్లు కాగా రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక విద్యుత్ డిమాండ్ 15254 మెగా వాట్లు రికార్డ్ స్థాయిలో నమోదు ఇదే. గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా, ఈసారి డిసెంబర్ నెలలోనే గత సంవత్సరం రికార్డ్‌ను అధిగమించి ఈ నెలలోనే 14750 మెగా వాట్ల ఫీక్ విద్యుత్ వినియోగం దాన్ని అధిగమించి 15254 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ నమోదైంది. ఈ ఏడాది వేసవి కాలంలో 16 వేల మెగా వాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఎంత డిమాండ్ వచ్చిన సరఫరాకు అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ప్రభాకర్‌రావు తెలిపారు. మార్చి నెలలో 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతుందని ముందే ఉహించాం. అందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా కు ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర రైతాంగంకు,అన్ని రకాల వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని సీఎండీ అన్నారు. చదవండి: TSPSC: మరో సంచలనం.. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన ప్రవీణ్.. ఆ పేపర్ కూడా లీక్ అయ్యిందా? -
ఏపీ ‘పవర్’ఫుల్.. పెరిగిన తలసరి విద్యుత్
ఏ రాష్ట్రంలో అయినా పౌరులకు సరిపడినంత స్థాయిలో విద్యుత్ అందుబాటులో ఉందంటే ఆ రాష్ట్రంలో ఉత్పాదకత, జీవన ప్రమాణాలు మెరుగైన స్థితిలో ఉన్నాయని అర్థం. ఆర్థిక అభివృద్ధికి విద్యుత్ వినియోగాన్ని సైతం ప్రామాణికంగా తీసుకుంటారు. అలాంటి అత్యుత్తమ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని మరోసారి రుజువైంది. రాష్ట్రంలో తలసరి విద్యుత్ లభ్యత పెరుగుదలే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. 2018లో తలసరి విద్యుత్ లభ్యత 1,180.3 యూనిట్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడది 1,378.6 యూనిట్లకు పెరిగింది. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఇస్తున్న ప్రోత్సాహం, బలపడుతున్న విద్యుత్ వ్యవస్థల కారణంగానే ఇది సాధ్యమైంది. సాక్షి, అమరావతి: వినియోగదారులకు అత్యధిక విద్యుత్‌ను అందుబాటులో ఉంచేందుకు ఏపీ ట్రాన్స్‌కో మెరుగైన నెట్వర్క్ మెయింటెనెన్స్, మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను సులభతరం చేసే దిశగా చర్యలు చేపట్టింది. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) అంతర్గత డిమాండ్ అంచనా నమూనాను అభివృద్ధి చేసింది. ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఏపీ ఎస్ఎల్డీసీ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి మరింత అధునాతన అంతర్గత ఎనర్జీ ఫోర్ కాస్టింగ్ మోడల్‌ను అభివృద్ధి చేసింది. తద్వారా ఎప్పటికప్పుడు అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేయగలుగుతోంది. మరోవైపు పంపిణీ వ్యవస్థను డిస్కంలు మెరుగుపరుచుకుంటున్నాయి. దీంతో 2018–19లో 16.36 శాతంగా ఉన్న యాగ్రిగేట్ టెక్నికల్, కమర్షియల్ (ఏటీసీ) నష్టాలు 2021–22లో 11.21 శాతానికి తగ్గాయి. 5.15 శాతం తగ్గుదలతో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు దేశంలోనే అత్యుత్తమమని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ప్రకటించింది. మున్ముందు మరింత మెరుగ్గా.. రాష్ట్రంలోని 1.92 కోట్ల వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు డిస్కంలు ‘కన్సూ్యమర్ సర్వీస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్’ నివేదికలో ఇప్పటికే ‘ఏ’ గ్రేడ్ సాధించాయి. రానున్న రోజుల్లో సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ‘లాస్ డిడక్షన్ వర్క్స్’ పేరుతో ఏపీ ఈపీడీసీఎల్‌లో రూ.2,617.54 కోట్లు, ఏపీ సీపీడీసీఎల్‌లో రూ.1,498.5 కోట్లు, ఏపీ ఎస్పీడీసీఎల్లో రూ.5,160.64 కోట్లు వెచ్చించాలని భావిస్తున్నాయి. విద్యుత్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దానివల్ల ప్రజలు, విద్యుత్ సిబ్బంది ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు కూడా విద్యుత్ సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. భద్రతా చర్యలలో భాగంగా స్ప్రింగ్ చార్జ్ బ్రేకర్స్ స్థానంలో సాంకేతికంగా మెరుగైన ‘ఫాస్ట్ యాక్టింగ్ పర్మినెంట్ మాగ్నెట్ యాక్యుయేటర్’ మెకానిజం టైప్ వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్లతో భర్తీ చేయాలని డిస్కంలు ఇప్పటికే ప్రతిపాదించాయి. ప్రభుత్వ ప్రోత్సాహం గడచిన మూడేళ్లలో డిస్కంలకు ప్రభుత్వం రూ.40 వేల కోట్లకుపైగా ఆర్థిక సాయం అందించింది. దీంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ధి పరుచుకుంటున్నాం. మౌలిక సదుపాయాలు కల్పించుకుంటున్నాం. ఆధునిక సాంకేతికతతో వినియోగదారులకు అధిక విద్యుత్‌ను అందుబాటులో ఉంచుతున్నాం. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ మనమే ఆదర్శం విద్యుత్ కొరత ఏర్పడితే బహిరంగ మార్కెట్ నుంచి అత్యధిక ధరకు కొనైనా సరే వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వమే ఆర్థికంగా చేయూతనిస్తోంది. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం అత్యాధునిక సబ్స్టేషన్లు నిర్మిస్తున్నాం. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, మరమ్మతులను తరచుగా నిర్వహిస్తున్నాం. – జె.పద్మాజనార్దనరెడ్డి, సీఎండీ, ఏపీ సీపీడీసీఎల్ -
ఇంధన పొదుపులో ఏపీనే లీడర్
సాక్షి, విశాఖపట్నం: ఇంధన సామర్థ్య నిర్వహణలో అన్ని రాష్ట్రాలకు ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్(ఏపీఎస్ఈసీఎం) లీడర్‌గా వ్యవహరిస్తోందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సెక్రటరీ రాకేష్ కే రాయ్ వెల్లడించారు. ఎనర్జీ ఎఫిషియన్సీలో మిగిలిన రాష్ట్రాలకు ఏపీని బ్రాండ్‌గా చూపిస్తున్నామని తెలిపారు. ఇంధన పొదుపునకు ప్రత్యేకంగా స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ (ఎస్డీఏ)లు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని చెప్పారు. ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు అంశాలను వివరించారు. వాటిలో ప్రధానమైనవి.. ఏపీలో ఏటా రూ.3,500 కోట్లు ఆదా ఇంధన సామర్థ్య చర్యల్ని పటిష్టంగా అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం ముందంజలో ఉంది. అన్ని రాష్ట్రాలకూ ఏపీఎస్ఈసీఎం ఆదర్శంగా నిలుస్తోంది. ఇందుకోసం ఏపీలో ప్రత్యేకంగా ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్, స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీలు ఏర్పాటు చేయడం విశేషం. ఏపీ అనుసరిస్తున్న విధానాల్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని నిర్ణయించాం. దేశంలో తొలిసారిగా రాష్ట్రపతి అవార్డుని ఏపీఎస్ఈసీఎం దక్కించుకోవడం ఇంధన పొదుపుపై ఏపీ విధానాలకు నిదర్శనం. ఇప్పటికే పవర్ ప్లాంట్స్, సిమెంట్, టెక్స్టైల్స్, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఇలా.. రాష్ట్రంలోని మొత్తం 53 గుర్తింపు పొందిన భారీ పరిశ్రమలు బీఈఈ ప్రమాణాలకు అనుగుణంగా ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేస్తున్నాయి. దీని ద్వారా 3,430 మిలియన్ యూనిట్లు ఆదా చేస్తున్నాయి. దీని ద్వారా పెర్ఫార్మ్ అచీవ్ ట్రేడ్ (ప్యాట్) అమలులో ఏపీ ఇప్పటికే అద్భుతమైన పనితీరు కనబరుస్తోంది. ఏపీలోని పరిశ్రమల్లో ఇంధన పొదుపు ద్వారా ఏటా రూ.3,500 కోట్లు ఆదా అవుతోంది. ఏపీలో 12 వేల ఎనర్జీ క్లబ్‌లు ఏర్పాటు ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీఈఈ విభిన్న కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా భవిష్యత్తు వారధులైన విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలని భాగస్వామ్యం చేస్తూ దేశవ్యాప్తంగా లక్ష ఎనర్జీ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో 12 వేల క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి క్లబ్‌కు ఏటా రూ.10 వేలు నిధులు సమకూరుస్తాం. ఈ క్లబ్‌లు విద్యార్థుల్లో ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తాయి. త్వరలో వలంటరీ కార్బన్ ట్రేడ్.. బీఈఈ అడ్మినిస్ట్రేటర్‌గా ఈ ఏడాది నుంచి వలంటరీ కార్బన్ ట్రేడింగ్ ఫ్రేమ్ వర్క్‌కు సిద్ధమవుతున్నాం. ఇంధన పొదుపు పాటించే ప్రతి పరిశ్రమకు కర్బన ఉద్గారాల నియంత్రణకు సంబంధించి బీఈఈ ఈ ట్రేడ్ ధ్రువపత్రం అందిస్తుంది. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ మరో 1.5 డిగ్రీలు దాటితే మరింత కర్బన ఉద్గారాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే రుతుపవనాల రాకలో కూడా తీవ్రమైన మార్పులుంటాయి. దీనిని నియంత్రించడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దేశంలో 2030 నాటికి కర్బన ఉద్గారాలు 45 శాతం తగ్గించే లక్ష్యంతో రోషనీ అనే కార్యక్రమాన్ని బీఈఈ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంధన సామర్థ్య సాంకేతికత సాయంతో విద్యుత్, ఇతర ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించేందుకు నిర్మాణాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో కర్బన ఉద్గారాల నియంత్రణలో భారత్ దిక్సూచిగా మారబోతోంది. మనం ఆదా చేసే విద్యుత్ శ్రీలంక సరఫరాతో సమానం ఇంధన సామర్థ్యం విషయంలో భారత్.. మిగిలిన దేశాలతో పోలిస్తే.. అద్భుతంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో తలెత్తబోయే ప్రమాదాలను ముందే పసిగట్టిన ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు.. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలోని 13 రంగాలకు చెందిన పరిశ్రమలు ఇంధన సామర్థ్యాల్ని అమలు చేస్తుండటం వల్ల ఏటా రూ.48 వేల కోట్లు ఆదా విద్యుత్ వినియోగం అవుతోంది. ఇది శ్రీలంక వంటి దేశాలకు విద్యుత్ సరఫరాతో సమానం. ఈ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది. -
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. ఫ్యాన్లు గిరాగిర, కూలర్లు, ఏసీలు ఆన్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు బ్రేక్ పడింది. కానీ.. పక్షం రోజులుగా పొడి వాతావరణం, ఎండలు మండుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిరుజల్లులు, మబ్బులతో ఆహ్లాదంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భానుడి భగభగలతో పగలే కాదు రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఫలితంగా ఉక్కపోతకు తట్టుకోలేక సిటీజనులు అల్లాడిపోతున్నారు. ఉపశమనం కోసం మళ్లీ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఆన్ చేస్తున్నారు. దీంతో నగరంలో విద్యుత్ డిమాండ్ అన్యూహ్యంగా పెరిగింది. వారం రోజుల క్రితం వరకు గ్రేటర్ సగటు విద్యుత్ డిమాండ్ 52–55 మిలియన్ యూనిట్లుగా ఉండగా, తాజాగా 61 ఎంయూలకు పైగా నమోదవుతుండటం విశేషం. ఉక్కపోత కారణంగా కరెంట్ వినియోగం రెట్టింపవడంతో మీటర్లు గిర్రున తిరుగుతూ స్లాబ్‌రేట్లు మారి భారీగా బిల్లులు చేతికి అందుతుండటంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. హీటెక్కుతున్న పీటీఆర్లు ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరగడం, పగటి ఉష్ణోత్రలు కూడా భారీగా నమోదవుతుండటంతో సబ్ స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. ఒత్తిడిని తట్టుకోలేక ఫీడర్లు తరచూ ట్రిప్పవుతుండటంతో సరఫరాలో అంతరాయం తప్పడంలేదు. ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు ఇంట్లో కరెంట్ కూడా లేకపోవడం, బహుళ అంతస్తుల సముదాయాల్లో ఏర్పాటు చేసిన జనరేటర్లు కూడా చాలా వరకు వినియోగంలో లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మంచినీటి మోటార్లు, లిఫ్ట్‌లు పని చేయకపోవడంతో మీటర్ రీడింగ్ నమోదు, బిల్లుల జారీ కోసం ఆయా నివాసాలకు వెళ్లిన సిబ్బంది ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తోంది. ఈ సీజన్లో అత్యధికం విద్యుత్ వినియోగం సాధారణంగా వేసవిలో మాత్రమే 60 ఎంయూలు దాటుతుంది. వర్షాకాలం, చలికాలంలో చాలా తక్కువ వాడకం నమోదవుతుంది. కానీ ఇటీవల వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా గత రెండు రోజుల నుంచి డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది ఇదే రోజు 2392 మెగావాట్ల డిమాండ్ నమోదు కాగా తాజాగా శుక్రవారం 2984, శనివారం 2998 మెగావాట్లు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం నగరంలో డెంగీ కారక దోమలు విజృంభిస్తున్నాయి. రాత్రి పూట కరెంట్ లేకపోవడంతో ఉక్కపోతకు తోడు దోమలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆకస్మిక విరామం వల్లే శుక్రవారం నగరంలో 32.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శనివారం 34 డిగ్రీలకు చేరింది. రుతుపవనాల మధ్య విరామమే ఆకస్మిక ఉక్కపోతకు కారణం. ప్రస్తుతం వర్షాకాలమే అయినా రుతుపవనాలు బలహీన పడటం వల్ల అల్పపీడనాలు ఏర్పడడం లేదు. పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడి వేడి పెరిగింది. గాలిలో తేమ తగ్గిపోవడం వల్ల అధిక ఉక్కపోత నమోదవుతోంది. రుతుపవనాల మధ్యలో ఆకస్మిక విరామం వస్తే ఈ తరహా పరిస్థితి ఉత్పన్నమవుతుంది. – కె. నాగరత్న, ఐఎండీ డైరెక్టర్ -
AP: మళ్లీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం మళ్లీ క్రమంగా పెరుగుతోంది. అసని తుపాను ప్రభావంతో తగ్గిన డిమాండ్.. మళ్లీ పెరుగుతోంది. విద్యుత్ డిమాండ్ గత నెలతో పోల్చితే ప్రస్తుతం భారీగా తగ్గింది. ఏప్రిల్‌లో అత్యధికంగా రోజుకు 235 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వరకూ చేరిన వినియోగం కొద్ది రోజుల క్రితం అసని తుఫాను ప్రభావం వల్ల తగ్గుముఖం పట్టింది. చదవండి: ఏది నిజం: ఐదేళ్ల లూటీ ఆగిందనా మంట.. రామోజీ? వాతావరణం చల్లబడటంతో ఈ నెల 11వ తేదీన 151.43 మిలియన్ యూనిట్లకు తగ్గింది. దీంతో వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు పూర్తి స్థాయిలో విద్యుత్ అందిస్తూనే, పరిశ్రమలపై ఉన్న ఆంక్షలను దాదాపు ఎత్తేశారు. కానీ అంతలోనే పెరగడం మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 172.86 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతోంది. కొనుగోలుకు రూ.2,687.81 కోట్లు ఖర్చు దేశవ్యాప్తంగా ఏర్పడ్డ బొగ్గు సంక్షోభం కారణంగా ఏర్పడ్డ విద్యుత్ కొరతకు ఏప్రిల్ నెల ప్రారంభంలో రాష్ట్రంలో అత్యధిక డిమాండ్ తోడైంది. ఫలితంగా కొద్ది రోజులు వినియోగదారులు విద్యుత్ కోతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. వెంటనే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించింది. పరిశ్రమల విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించింది. గృహాలు, వ్యవసాయానికి ఆటంకం లేకుండా సరఫరా చేసింది. ఇందుకోసం మొదట్లో బహిరంగ మార్కెట్లో రోజుకు సుమారు రూ.70 కోట్లు, ఆ తరువాత రోజుకి రూ.40 కోట్లు వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేసింది. మార్చి నుంచి ఇప్పటివరకూ బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకే రూ.2,687.81 కోట్లు వెచ్చించింది. ఫలితంగా నేటికీ ఉత్తరప్రదేశ్‌లో రోజుకు 1.34 ఎంయూ, బీహార్‌లో 1.44 ఎంయూ, జార్ఖండ్‌లో 2.03 ఎంయూ, రాజస్థాన్‌లో 0.65 ఎంయూ కొరత ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. అందుబాటులో 208.63 మిలియన్ యూనిట్లు రాష్ట్రంలోని వివిధ కేంద్రాల నుంచి జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి డిమాండ్ కంటే ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం (ఈ నెల 13న) ఏపీ జెన్కో థర్మల్ కేంద్రాల నుంచి 78.45 ఎంయూ, ప్రైవేటు థర్మల్ కేంద్రాల నుంచి 10.75 ఎంయూ, సెంట్రల్ గ్యాస్ స్టేషన్లు నుంచి 39.62 ఎంయూ, హైడ్రో స్టేషన్ల నుంచి 5.48 ఎంయూ, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ (ఐపీపీ) నుంచి 8.74 ఎంయూ, పవన విద్యుత్ 27.85 ఎంయూ, సౌర విద్యుత్ 17.65 ఎంయూ సమకూరుతోంది. 20.09 ఎంయూ బయటి నుంచి కొన్నారు. మొత్తం 208.63 ఎంయూ అందుబాటులో ఉంది. ప్రస్తుత వినియోగం 172.86 ఎంయూ మాత్రమే ఉంది. దీంతో ఒప్పందాల మేరకు సుమారు 35 ఎంయూను ఇతరులకు విక్రయించారు. మళ్లీ విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో మరికొద్ది రోజులు జాగ్రత్త అవసరమని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. -
అమ్మో! ఎండ వేడి...రికార్డు స్థాయిలో విద్యుత్ వాడకం.. ఇదే అత్యధికం
సాక్షి, హైదరాబాద్: ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. గ్రేటర్ జిల్లాల వాసులు ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా ఇంట్లోని కరెంట్ మీటరు గిరగిరా తిరుగుతోంది. కేవలం వ్యక్తిగత వినియోగం మాత్రమే కాదు గ్రేటర్ సగటు విద్యుత్ వినియోగం కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. తాజాగా శనివారం 64.5 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ఇప్పటికే డిస్కం గృహ విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు రూపాయి చొప్పున పెంచింది. ఏప్రిల్ నెల నుంచి పెంచిన బిల్లులను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఫీడర్లు, డీటీఆర్లపై ఒత్తిడి.. ►గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో తొమ్మిది సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 55 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 45.50 లక్షలు గృహ, 7.30 లక్షల వాణిజ్య, 44 వేల పారిశ్రామిక, 1.40 లక్షల వ్యవసాయ, 45 వేల వీధి దీపాల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2019 మే 30న అత్యధికంగా 73.9 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. 2021 మే నెలలో అత్యధికంగా 68 ఎయూలు నమోదైంది. ►ఐటీ అనుబంధ రంగాలతో పాటు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలన్నీ పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. కేవలం గృహ విద్యుత్ విని యోగం మాత్రమే కాకుండా వాణిజ్య, పారిశ్రామిక వినియోగం కూడా రెట్టింపైంది. ఫలితంగా ప్రస్తుతం రోజు సగటు విద్యుత్ వినియోగం 60 యూనిట్లు దాటింది. ఏప్రిల్ చివరి నాటికి 75– 80 ఎంయూలకు చేరే అవకాశం లేకపోలేదు. చదవండి: హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ దొంగ.. ఆఖరికి ఓ చిన్న తప్పుతో.. -
సక్సెస్ స్టోరీ: యంగ్ అండ్ ఎనర్జిటిక్
కరెంటు బిల్ అనే మాట వినబడగానే... కొండంత భయం ఎదురొచ్చి నిలుచుంటుంది. ఆ కొండను కోడిగుడ్డు స్థాయికి తగ్గించలేమా? కరెంటు బిల్లు అనేది పెద్ద ఖర్చు కాదు. విద్యుత్ వృథాను అరికడితే ‘బిల్’ మనల్ని కనికరిస్తుంది. ‘వెరీగుడ్’ అని వెన్నుతట్టేలా చేస్తుంది. మరి విద్యుత్ వృథాను అరికట్టాలంటే? 26 సంవత్సరాల గోకుల్ శ్రీనివాస్ సక్సెస్ స్టోరీని తెలుసుకోవాల్సిందే... ఒకప్పటి మాదిరిగా ఇంట్లో లైట్ వెలగడానికి మాత్రమే మనం కరెంట్‌ను ఖర్చు చేయడం లేదు. ఇస్త్రీ పెట్టె, ఫ్యాన్, మిక్సీ, ఫ్రిజ్, మైక్రోవేవ్ వోవెన్, కంప్యూటర్... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. విద్యుత్ వినియోగానికే పరిమితమైన మనం ‘వృథా’ను అంతగా పట్టించుకోవడం లేదు. లేదా అవగాహన ఉండడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చిందే ‘మినియన్’ డివైజ్. దీని సృష్టికర్త గురించి... హైస్కూల్ రోజుల్లో గోకుల్ శ్రీనివాస్‌కు ‘హాకీ’ అంటే ప్రాణం. ఈ ఆటలో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని కలలు కన్నాడు. అయితే ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో అతని కలలు అవిరైపోయాయి. హాకీ గట్టిగా ఆడలేని పరిస్థితి. కట్ చేస్తే... చదువు పూర్తయిన తరువాత అమెజాన్ ఐటీలో ఉద్యోగం వచ్చింది. సంవత్సరం పూర్తయిన తరువాత ‘ఇది మనకు సెట్ అయ్యే జాబ్ కాదు’ అనిపించింది. తనకు ‘ఎలక్ట్రానిక్స్’ అంటే చా...లా ఇష్టం. రకరకాల డివైజ్‌లు తయారుచేశాడు. అలా తయారు చేసిందే మినియన్ (మిని+ఆన్) సంప్రదాయ విధానాల్లో ‘ఎనర్జీ మానిటరింగ్’ అనేది సంక్లిష్టమైన విషయం.‘మినియన్’ డివైజ్‌తో మాత్రం విద్యుత్ వాడకానికి సంబంధించి మానిటరింగ్, ఎనాలసిస్ చేయడం సులభం. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ఎంఎల్ (మెషిన్ లెర్నింగ్) వైర్లెస్ డివైజ్ ‘మినియన్’అరచేతిలో ఇమిడిపోయేంత చిన్న సైజ్‌లో ఉంటుంది. వృథాను అరికట్టడం మాత్రమే కాదు... ఏదైనా విద్యుత్ ఉపకరణాన్ని రిపేర్ చేయించాల్సిన పరిస్థితి వస్తే అలర్ట్ చేస్తుంది. ‘మినియన్ ల్యాబ్స్’ పేరుతో బెంగళూరులో అంకుర సంస్థను మొదలుపెట్టాడు శ్రీనివాస్. ఇది అంతర్జాతీయ స్థాయిలో హిట్ అయింది. ఇళ్లు, ఆఫీసు, ఫ్యాక్టరీ...లలో ఇంధన వృథాను గణనీయంగా అరికడుతూ ప్రశంసలు అందుకుంటోంది. ‘విద్యుత్ వృథాను అరికట్టడం అనేది వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు సామాజిక బాధ్యత కూడా’ అంటారు. యువత ‘మినియన్’లాంటి ఇంధన వృథాను అరికట్టే పరికరాలను మరిన్ని తయారుచేస్తే ఆ బాధ్యత నెరవేర్చడం సులువవుతుంది. -
Power Saving Tips: ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్లులు తక్కువ రావడం ఖాయం!
Power Saving Tips For House: ఎండా కాలం, చలి కాలం, వానా కాలం.. ఇలా సీజన్లతో సంబంధం లేకుండా కరెంట్ బిల్లులు సామాన్యుడికి గుబులు పుట్టిస్తున్నాయి. ఈమధ్య కాలంలో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయంటూ చాలామంది గగ్గోలు పెడుతూ.. కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుండడం చూస్తున్నాం. మరి కరెంట్ వినియోగం కూడా అదే స్థాయిలో ఉంటోంది కదా!. అందుకే ఆదా చేసే మార్గాలు ఉన్నప్పుడు.. కరెంట్ బిల్లులను తగ్గించుకోవడం మన చేతల్లోనే ఉంటుందని గుర్తు చేస్తున్నారు నిపుణులు. పైగా అవి సింపుల్ చిట్కాలే!. వ్యాంపైర్ అప్లియెన్సెస్.. కరెంట్‌ను జలగల్లా పీల్చేస్తాయి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. కాబట్టే వీటికి వ్యాంపైర్ అని పేరు పెట్టారు. విశేషం ఏంటంటే.. ఆఫ్‌లో ఉన్నా కూడా ఇవి ఎంతో కొంత కరెంట్‌ను లాగేస్తుంటాయి కూడా. సెల్‌ఫోన్ ఛార్జర్ల మొదలు.. వైఫై రూటర్లు, టీవీలు, కంప్యూటర్లు, ఐరన్బాక్స్లు, వాషింగ్‌మెషీన్, ల్యాప్‌ట్యాప్‌లు.. ఇలా ఫ్లగ్గులో ఉండి కూడా ఆఫ్‌లో ఉన్నప్పుడు కరెంట్‌ను తీసుకుంటాయి. అందుకే వినియోగించనప్పుడు వాటిని ఫ్లగ్‌ల నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఈరోజుల్లో స్టాండ్‌బై మోడ్ ఆప్షన్‌తో వస్తున్నా.. అవి ఎంతో కొంత వాట్లలో పవర్‌ను లాగేస్తున్నాయి. కాబట్టి, వీటి విషయంలో ఈ చిన్న సలహా పాటిస్తే బెటర్. సంబంధిత కథనం: ఆఫ్ చేసినా ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసా? కెపాసిటీకి తగ్గట్లు.. వాషింగ్ మెషిన్, గ్రీజర్-వాటర్ హీటర్, ఏసీలు.. ఇలా హెవీ అప్లయెన్సెస్ ఏవి వాడినా కరెంట్ బిల్లు ఎక్కువగానే వస్తుంటుంది. కానీ, వాటిని వాడే విధానంలో తేడాల వల్లే బిల్లులు అంతలా వస్తుంటాయని తెలుసా?. కాబట్టి, ఒక పద్దతిలోనే వాటిని వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు వాషింగ్ మెషిన్‌ను ఫుల్ కెపాసిటీతో కాకుండా తక్కువ కెపాసిటీతో ఉపయోగించడం. అంటే తక్కువ బట్టలు వేసి.. రెగ్యులర్‌గా ఉతకడం. దీనివల్ల ఫుల్ కెపాసిటీ టైంలో పడే లోడ్ పడి కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది. వాషింగ్ మెషిన్లు మాత్రమే కాదు.. ఏసీలు, హీటర్లు, గ్రీజర్లు.. ఇలా ఏవైనా సరే వాటి లెవల్‌కు తగ్గట్లుగా స్మార్ట్‌గా ఉపయోగించడం వల్ల కరెంట్ బిల్లులను తగ్గించుకున్న వాళ్లు అవుతాం. ఇక కొత్తగా అప్లియెన్సెస్ కొనాలనుకుంటే.. వాటి రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకోవడం అస్సలు మరవద్దు. తద్వారా కరెంట్ కన్జంప్షన్ తగ్గుతుంది. కరెంట్ సేవింగ్‌లో ఇదే ముఖ్యం బల్బులు, సీలింగ్ ఫ్యాన్లు ఇంటి ప్రాథమిక అవసరాలు. అలాగే కరెంట్ బిల్లుల విషయంలో వీటి భాగస్వామ్యం కూడా ఎక్కువే!. చివరికి కరెంట్ తక్కువ లాగుతాయనుకునే.. సీఎల్ఎఫ్, ఎల్ఈడీ బల్బులు సైతం ఆఫ్ కరెంట్‌ను ఎక్కువే తీసుకుంటాయి. కాబట్టి, అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయడం, తక్కువ స్పేస్‌లో పని చేస్తున్నప్పుడు ఫోర్టబుల్ ల్యాంపులు, స్టడీ ల్యాంపులు ఉపయోగించడం బెటర్. పాతవి ఎక్కువే.. పాత అప్లియెన్సెస్.. కొత్తగా వస్తున్నవాటికన్నా ఎక్కువ ఎనర్జీని లాగేస్తాయి. అందుకు కారణం.. ఆప్టియం ఏజ్. అంటే కాలం చెల్లడంలాంటిదన్నమాట. అందుకే పాత అప్లియెన్సెస్‌ను మార్చేసి.. మంచి రేటింగ్ ఉన్న అప్లియెన్సెస్‌ను ఉపయోగించాలి. మాటిమాటికీ అక్కర్లేదు.. మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, దోమల బ్యాట్లు, ఛార్జింగ్ లైట్లు.. అవసరం లేకున్నా ఛార్జింగ్ పెట్టడం కొందరికి ఉండే అలవాటు. ముఖ్యంగా సెల్‌ఫోన్ ఛార్జింగ్‌ల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ, దీనివల్ల కరెంట్ అడ్డగోలుగా కాలుతుంది. అందుకే అత్యవసం అయితేనే ఛార్జింగ్ పెట్టాలి. అవసరం లేనప్పుడు ఫ్లగ్‌ల నుంచి ఛార్జర్లను తొలగించాలి మరిచిపోవద్దు. కరెంట్ బిల్లులు మోగిపోవడానికి, మీటర్ గిర్రున తిరగడం ఒక్కటే కారణం కాదు. ఎంత ఉపయోగిస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ, చిన్న చిన్న జాగ్రత్తలు, టిప్స్ పాటిస్తూ కరెంట్‌ను ఆదా చేయడంతో పాటు జేబుకు చిల్లుపడకుండా చూసుకోవచ్చు. -
ఏపీలో పెరిగిన సగటు విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. బొగ్గు సంక్షోభంలోనూ డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ అందిస్తూ రాష్ట్రంలో వెలుగులు నింపుతున్నాయి. తీవ్ర బొగ్గు కొరత వల్ల అక్టోబర్‌లో అనేక రాష్ట్రాలు ఇబ్బందులు పడినా.. ఏపీలో మాత్రం జాతీయ సగటు కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం నమోదయ్యింది. సంక్షోభంలోనూ రికార్డు.. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి, వినియోగదారుల సంక్షేమానికి.. నిరంతరం విద్యుత్ సరఫరా అందించటం కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తగినట్లే విద్యుత్ పంపిణీ సంస్థలు, ఇంధన శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా జాతీయ సగటు విద్యుత్ వినియోగం అక్టోబర్‌లో 4.8 శాతం పెరిగితే, ఏపీలో ఏకంగా 17.2 శాతం పెరిగింది. గతేడాది ఇదే నెలలో రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం 4,972 మిలియన్ యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో 5,828 మిలియన్ యూనిట్లకు చేరింది. దేశంలో గతేడాది అక్టోబర్‌లో 109.17 బిలియన్ యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది 114.37 బిలియన్ యూనిట్లకు చేరింది. ఇక గతేడాది అక్టోబర్ 31న రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ వినియోగం 8,820 మెగావాట్లుగా ఉండగా.. ఈ ఏడాది అక్టోబర్ 19న గరిష్ట విద్యుత్ వినియోగం 9,865 మెగావాట్లుగా నమోదైంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ రాజీ లేదు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన, చౌక విద్యుత్ అందించే విషయంలో ప్రభుత్వం రాజీపడదని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ చెప్పారు. విద్యుత్ డిమాండ్‌పై ఏపీ ట్రాన్స్‌కో, రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ విభాగాలతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. చౌక విద్యుత్ సరఫరాలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని సీఎం జగన్ లక్ష్యమని శ్రీకాంత్ తెలిపారు. భవిష్యత్‌లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు వంద శాతం నమ్మకమైన, నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు అవసరమైన కృషి జరగాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు. సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు ఇమ్మడి పృథ్వీతేజ్, బి.మల్లారెడ్డి, డైరెక్టర్ కె.ప్రవీణ్, చీఫ్ ఇంజనీర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వినియోగదారులకు నాణ్యమైన చౌక విద్యుత్‌ను అందించేందుకు, రాష్ట్రానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు ఇంధన శాఖ అధికారులు చేస్తున్న కృషిని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభినందించారు. -
ఆఫ్ చేసినా ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసుకోండి
టెక్ ఏజ్‌లో సాంకేతికతకు పవర్ తోడైతేనే రోజువారీ పనులు జరిగేది. విచ్చల విడిగా వాడేస్తూ.. నెల తిరిగే సరికి కరెంట్ బిల్లును చూసి కళ్లు పెద్దవి చేసేవాళ్లు మనలో బోలెడంత మంది. అయితే మనకు తెలియకుండానే కరెంట్‌ను అదనంగా ఖర్చు చేస్తున్నామని తెలుసా?.. అదీ ఆఫ్ చేసినప్పటికీ!. యస్.. మొత్తం పవర్ బిల్లులలో మినిమమ్ 1 శాతం.. పవర్ ఆఫ్ చేసిన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వల్ల వస్తుందని ఇండియన్షెల్ఫ్ ఓ కథనం ప్రచురించింది. టెలివిజన్ సెట్స్.. చాలామంది టీవీలు చూస్తూ రిమోట్ ఆఫ్ చేసి వేరే పనుల్లో మునిగిపోతారు. లేదంటే రాత్రిళ్లు పడుకునేప్పుడు టీవీలను స్విచ్ఛాఫ్ చేయకుండా వదిలేస్తారు. ఇలా చేయడం స్టాండ్‌బై మోడ్‌లోకి వెళ్లే టీవీ.. రోజుకి 24 వాట్ల పవర్‌ను తీసుకుంటుంది. ఇది తక్కువే అనిపించినా.. రోజుల తరబడి లెక్క ఎక్కువేగా అయ్యేది!. సెల్‌ఫోన్ ఛార్జర్.. చాలామంది నిర్లక్క్ష్యం వహించేది దీని విషయంలోనే. ఫోన్ ఛార్జింగ్ అయ్యాకో, మధ్యలో ఫోన్ కాల్ వస్తేనో స్విచ్ఛాఫ్ చేయకుండా ఫోన్ నుంచి పిన్ తీసేస్తుంటారు. కానీ, పవర్ బటన్‌ను ఆఫ్ చేయడమో, సాకెట్ నుంచి ఛార్జర్‌ను తీసేయడమో చేయరు. ఛార్జర్ సగటున రోజుకి 1.3 వాట్ల పవర్‌ను లాగేసుకుంటుంది. అంతేకాదు ఛార్జర్ పాడైపోయే అవకాశం.. ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. వైఫై మోడెమ్.. స్విచ్ఛాఫ్ చేయకుండా ఉంచే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది ఇదే. ఇంటర్నెట్ను ఉపయోగించినా లేకున్నా, వైఫై పరిధి నుంచి మొబైల్స్, తదితర డివైజ్‌లు దూరంగా వెళ్లినా సరే.. 24/7 వైఫైలు ఆన్‌లోనే ఉంటాయి. ప్రత్యేకంగా ఇది ఎంత కరెంట్ కాలుస్తుందనేది ప్రత్యేకంగా చెప్పలేకపోయినా.. ఉపయోగించనప్పుడు, బయటికి వెళ్లినప్పుడు ముఖ్యంగా రాత్రిళ్లు పడుకునేప్పుడు ఆఫ్ చేసి ఫ్లగులు తీసేయడం బెటర్. మైక్రో ఓవెన్స్.. ఇది తక్కువ మంది ఇళ్లలో ఉండొచ్చు. కానీ, చాలామంది వీటిని పూర్తిగా ఆఫ్ చేయకుండా వదిలేస్తుంటారు. కానీ, మైక్రో ఓవెన్స్, ఓవెన్స్‌లు ఒకరోజులో 108 వాట్ల పవర్‌ను లాగేస్తాయి. సో.. వాడనప్పుడు వాటిని అన్‌ఫ్లగ్ చేయడం ఉత్తమం. మరికొన్ని.. పెద్దసైజులో ఉండే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లు వాషింగ్ మెషిన్స్, ఫ్రిడ్జ్(పెద్దగా పాడయ్యే సామాన్లు లేనప్పుడు)లతో పాటు డ్రైయర్స్, మిక్సర్లు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, టేబుల్ ఫ్యాన్లు, బ్లూటూత్ స్పీకర్లు ఆఫ్ చేయడం ముఖ్యంగా అన్‌ఫ్లగ్ చేయడం మంచిది. వర్క్ ఫ్రమ్ హోంలో చాలామంది ల్యాప్‌టాప్‌లను సిచ్ఛాఫ్ చేసినా అన్‌ఫ్లగ్ చేయరు. అడిగితే చాలామంది టైం ఉండదంటూ సాకులు చెప్తుంటారు. లేదంటే పరధ్యానంలో మరిచిపోతుంటారు. ఇంకొందరు ఓస్ అంతే కదా అని బద్ధకిస్తుంటారు. కానీ, పవర్సేవింగ్ను ఒక బాధ్యతగా గుర్తిస్తే.. కరెంట్‌ను ఆదా చేయడం, అప్లయన్సెస్‌ను పాడవకుండా కాపాడుకోవడంతో పాటు ఖర్చుల్ని తగ్గించుకున్నవాళ్లు అవుతారు. -సాక్షి, వెబ్‌డెస్క్ -
విద్యుత్‌లో తెలంగాణ నయా రికార్డు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: విద్యుత్ సరఫరాలో తెలంగాణ మరోసారి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఉమ్మడి ఏపీలో సైతం ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఈ సీజన్లో అత్యధిక వినియోగం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి చివరి వారం (23న) అత్యధికంగా 13,162 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఈ నెల మొదటి వారంలో ఒక్క తెలంగాణలోనే 13,141 మెగావాట్ల వినియోగం జరగడం రికార్డుగా విద్యుత్ సరఫరా సంస్థలు ప్రకటించాయి. వాతావరణం చల్లబడి, వరి కోతలు చేపడుతున్న సమయంలో శుక్రవారం కూడా భారీగా విద్యుత్ వినియోగం అయినట్లు నమోదైంది. ఈ సీజన్లో ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్), దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) విద్యుత్ సరఫరా చేసి సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఏటా పెరుగుతున్న విద్యుత్ వినియోగం టీఎస్ ఎన్పీడీసీఎల్, టీఎస్ఎస్పీడీఎల్ పరిధిలో ఏటేటా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన విద్యుత్ వినియోగం వివరాలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ప్రకటించాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ‘తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే–2021’ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2016-17లో తెలంగాణలో 9,187 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదవగా 2017-18లో అది 10,284 మెగావాట్లకు చేరింది. అలాగే 2018-19లో 10,818 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదుకాగా 2019–20లో డిమాండ్ 11,703 మెగావాట్లకు చేరింది. దేశ సగటు వృద్ధి శాతం 3.44గా నమోదవగా తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 8.18 శాతంగా నమోదైంది. పంపుసెట్లకు నిరంతర ఉచిత విద్యుత్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలలో కీలకమైనది వ్యవసాయానికి ఉచిత, నాణ్యమైన విద్యుత్ సరఫరా. 2018 జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంపు సెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 19 లక్షలకుపైగా పంపు సెట్లు ఉంటే ఇప్పుడు 24 లక్షలకుపైగా కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా మరో 4.20 లక్షల వరకు ఉంటాయని అధికారుల అంచనా. అలాగే రాష్ట్రం ఏర్పడే నాటికి 1.10 కోట్ల వరకు వివిధ రకాల విద్యుత్ కనెక్షన్లు ఉండగా ఈ ఏడాది మార్చి 31 నాటికి వాటి సంఖ్య 1.55 కోట్లు దాటింది. ఈ లెక్కన విద్యుత్ కనెక్షన్లలో 38.62 శాతం వృద్ధి నమోదైనట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఇదే స్థాయిలో సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు కూడా పెరిగాయి. కాగా వీటితో పాటు 2014 వరకు 680 మెగావాట్ల విద్యుత్ ఎత్తిపోతల పథకాలకు వినియోగించగా, కాళేశ్వరం లాంటి భారీ పథకాలు తోడవడంతో ప్రస్తుతం 2,100 మెగావాట్లకు చేరినట్లు అధికరుల గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే రెండేళ్లలో మరిన్ని ఎత్తిపోతల పథకాలు పూర్తి కానుండగా, వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్లో భారీగా యాసంగి పంటలు కోతకు వచ్చినా విద్యుత్ వినియోగం ఆగడం లేదు. గురు, శుక్రవారాల్లోనూ గతేడాది ఇదే సమయంతో పోలిస్తే విద్యుత్ గణనీయంగా వినియోగమైంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో గత ఏడాది 2,584 మెగావాట్లు కాగా, ఇప్పుడు 3,081 మెగావాట్లుగా, ఎస్పీడీసీఎల్ పరిధిలో గతేడాది ఇదే సమయంలో 4,575 మెగావాట్లు కాగా, శుక్రవారం 6,665 మెగావాట్లు విద్యుత్ వినియోగం నమోదైంది. ఈ రెండు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని పూర్వ కరీంనగర్ జిల్లాలో 1,029 మెగావాట్లు వినియోగం కాగా, ఎస్పీడీసీఎల్ పరిధిలోని మెదక్‌లో 1,443, మహబూబ్‌నగర్‌లో 1,126 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. -
పుంజుకుంటున్న పారిశ్రామిక విద్యుత్
సాక్షి, అమరావతి: పారిశ్రామిక విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల్లో పురోగతి కనిపిస్తున్నా.. ఎగుమతులు, దిగుమతులపై ఆధారపడే భారీ పరిశ్రమలు ఇంకా పుంజుకోవాల్సి ఉంది. ఫెర్రో అల్లాయిస్ పారిశ్రామిక వేత్తలు ఇటీవల ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లిని కలిశారు. ఆ రంగానికి విద్యుత్ రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం పురోగతిని ఇంధన శాఖ సమీక్షించింది. ఆ వివరాలివీ.. అది గడ్డుకాలమే! రాష్ట్రంలో 2019 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం 3,975.66 మిలియన్ యూనిట్లు ఉంటే.. ఈ ఏడాది అదే త్రైమాసికంలో 2,754.14 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. దాదాపు 31 శాతం డిమాండ్ తగ్గింది. ఈ కాలంలో పారిశ్రామిక విద్యుత్ రెవెన్యూ వసూళ్లు 32 శాతం తగ్గి విద్యుత్ రంగం గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. జూలై, ఆగస్టు నెలల్లో విద్యుత్ వినియోగం తిరిగి వేగం పుంజుకుని 1,444.75 మిలియన్ యూనిట్లకు చేరింది. పరిశ్రమలకు ప్రభుత్వ అండ కోవిడ్ సమయంలోనూ పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఫెర్రో అల్లాయిస్ పారిశ్రామిక వేత్తలు రాయితీలు కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి -
తగ్గిన విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా పారిశ్రామిక కార్యకలాపాలు మందగించడంతో ఏప్రిల్–జూన్ మధ్య రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 2,106.6 మిలియన్ యూనిట్లు తగ్గింది. మరోవైపు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో గృహ విద్యుత్తు వినియోగం మాత్రం 11.27 శాతం పెరిగింది. వ్యవసాయ విద్యుత్ వాడకం మే నెలలో మాత్రమే 5 శాతం మేర పెరిగింది. పారిశ్రామిక విద్యుత్ డిమాండ్ ఎన్నడూ లేని విధంగా 30.72 శాతం పడిపోయింది. విద్యుత్తు వినియోగంపై తొలి త్రైమాసికం నివేదికను ఇంధనశాఖ గురువారం మీడియాకు వెల్లడించింది. ఏపీఈఆర్సీకి గతంలో సమర్పించిన అంచనాలు తలకిందులు కావడంతో వాస్తవ చిత్రాన్ని సమర్పించనున్నారు. గతేడాది తొలి త్రైమాసికంలో అన్ని విభాగాల విద్యుత్ వినియోగం 15,262.64 మిలియన్ యూనిట్లు కాగా ఈ ఏడాది ఇదే సమయంలో 13,156.04 మిలియన్ యూనిట్లు (13.80 శాతం తక్కువ) నమోదైంది. 2019 ఏప్రిల్‌లో 5,221.37 ఎంయూలుగా ఉన్న ఉన్న డిమాండ్ ఈ ఏడాది 4,076.95 ఎంయూలకు పడిపోయింది. లాక్డౌన్ నేపథ్యంలో రైల్వే సర్వీసులన్నీ ఆగిపోవడం విద్యుత్ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో 390.83 మిలియన్ యూనిట్లున్న విద్యుత్ డిమాండ్ ఈ ఏడాది 262.77 ఎంయూలకు పడిపోయింది. ఒక్క మే నెలలోనే 42.71 శాతం పడిపోయింది. -
స్లాబు ప్రకారమే విద్యుత్ బిల్లులు: జగదీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లలో ఉండటంతో విద్యుత్ వినియోగం పెరిగిందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్లాబుల్లో ఉన్న విధంగా బిల్లులు వస్తున్నాయని.. వాడిన దాని కంటే ఎక్కువ బిల్లులు ఎక్కడా రాలేదని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఏడాది సాధారణంగా వేసవిలో 35-40 శాతం వరకు విద్యుత్ వాడకం పెరుగుతుందని, లాక్డౌన్ కారణంగా 10-15 శాతం పెరిగిందని వివరించారు. గతంలో కంటే ఎక్కువగా బిల్లు వచ్చిందన అనుమానం ప్రజల్లో ఉందని.. కానీ వాడిన దానికంటే ఎక్కువ బిల్లు రాలేదన్నారు. తుంగతుర్తి, హుజూర్నగర్ ఎమ్మెల్యేలు కూడా బిల్లులు ఎక్కువ వచ్చాయని తన దృష్టికి తీసుకొచ్చారని, కానీ వారు వాడుకున్న మేరకే బిల్లులు వచ్చాయని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.