తెలంగాణ చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం | Highest Power Consumption In The History Of Telangana March 14th | Sakshi
Sakshi News home page

తెలంగాణ చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం

Published Tue, Mar 14 2023 12:44 PM | Last Updated on Tue, Mar 14 2023 4:48 PM

Highest Power Consumption In The History Of Telangana March 14th - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. మార్చి నెలలో అనుకున్న విధంగానే 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మంగళవారం ఉదయం 10.03 నిమిషాలకు 15254  మెగా వాట్ల విద్యుత్ అత్యధిక ఫీక్ డిమాండ్ నమోదు అయ్యింది. రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. సాగు విస్తీర్ణం పెరగడం, పారిశ్రామిక అవసరాలు పెరగడంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతుందని ట్రాన్స్ కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడించారు.

మొత్తం విద్యుత్ వినియోగంలో 37 శాతం వ్యవసాయ రంగానికే వినియోగింపబడుతోంది. దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానం కాగా, రెండో స్థానంలో తెలంగాణ ఉంది.నిన్న 14 138 మెగా వాట్లు కాగా రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక విద్యుత్ డిమాండ్ 15254 మెగా వాట్లు రికార్డ్ స్థాయిలో నమోదు ఇదే.

గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా, ఈసారి డిసెంబర్ నెలలోనే గత సంవత్సరం రికార్డ్‌ను అధిగమించి ఈ నెలలోనే 14750 మెగా వాట్ల ఫీక్ విద్యుత్ వినియోగం దాన్ని అధిగమించి 15254 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ నమోదైంది. ఈ ఏడాది వేసవి కాలంలో 16 వేల మెగా వాట్ల డిమాండ్  వచ్చే అవకాశం ఉంది.

ఎంత డిమాండ్ వచ్చిన సరఫరాకు అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ప్రభాకర్‌రావు తెలిపారు. మార్చి నెలలో 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతుందని ముందే ఉహించాం. అందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా కు ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర రైతాంగంకు,అన్ని రకాల వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని సీఎండీ అన్నారు.
చదవండి: TSPSC: మరో సంచలనం.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసిన ప్రవీణ్‌.. ఆ పేపర్‌ కూడా లీక్‌ అయ్యిందా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement