- కమిషన్ చైర్మన్‌ప్రెస్‌మీట్ పెట్టడమేంటని ప్రశ్నించిన సీజేఐ ధర్మాసనం
- చైర్మన్‌ను మార్చేందుకు ఒప్పుకున్న తెలంగాణ ప్రభుత్వం
- కొత్త చైర్మన్ ఎవరనేదానిపై ఏజీ సుదర్శన్‌రెడ్డితో సీఎం రేవంత్ మంతనాలు
- లంచ్ తర్వాత కొత్త చైర్మన్ పేరు సుప్రీంకోర్టుకు తెలపనున్న ప్రభుత్వం
సాక్షి,న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కమిషన్‌ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం(జులై 16) విచారణ జరిపింది.
పిటిషన్‌ను విచారించిన సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని బెంచ్ ఆదేశించింది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డి తీరుపై సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రెస్‌మీట్ పెట్టి విచారణకు సంబంధించిన విషయాలపై ఓపెన్‌గా ఎలా మాట్లాడతారని సీజేఐ ప్రశ్నించారు.న్యాయమూర్తి విచారణ చేయడమే కాకుండా నిష్పక్షపాతంగా ఉన్నట్లు కనిపించాలని వ్యాఖ్యానించారు.
కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చైర్మన్‌ను మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్లు తెలిసింది. లంచ్ తర్వాత కొత్త చైర్మన్ ఎవరనేది చెబుతామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
దీంతో పిటిషన్ విచారణను లంచ్ తర్వాతకు కోర్టు వాయిదా వేసింది. విచారణలో కేసీఆర్ తరపున సీనియర్‌న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు.
అడ్వకేట్ జనరల్‌తో సీఎం రేవంత్ మంతనాలు .. కొత్త చైర్మన్ ఎవరనేదానిపై చర్చ
పవర్ కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో ఉన్నారు.
ఆదేశాల గురించి తెలియగానే కలెక్టర్ల సమావేశ హాల్ నుంచి వెళ్లి అడ్వకేట్ జనరల్(ఏజీ) సుదర్శన్‌రెడ్డితో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త చైర్మన్‌గా ఎవరిని నియమించాలన్నదానిపై సీఎం ఏజీతో చర్చిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment